తెలంగాణా ఆందోళనకారులపై ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్న పోలీసుల అణచివేత చర్యలకు నిరసనగా 1969 జూలై 7న తెలంగాణ బంద్ జరపాలని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది. సదాలక్ష్మి అధ్యక్షతన సమితి కార్యాచరణ సంఘం, విద్యార్థి కార్యాచరణ సంఘం సంయుక్త సమావేశం అనంతరం జూలై 7 బంద్‌కు పిలుపునిచ్చింది. శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన గల తెలంగాణ ప్రజాసమితి ూడా జూలై 7 బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా జంటనగరాల్లో ఐదు చోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. పురానాపూల్ వద్ద ఆందోళనకారులు టెలిఫోన్ స్తంభాలను పడగొట్టి రోడ్డుకడ్డంగా వేస్తూ లాఠీ ఛార్జీ చేస్తున్న పోలీసులపై నిరసనగా రాళ్ళు విసరడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి మరణించాడు. జుమేరాత్ బజార్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. బొల్లారం, ఛత్తాబజార్, జావ్‌ుబాగ్, బేగంబజార్, చప్పల్ బజార్ తదితర ప్రాంతాల్లో లాఠీఛార్జీ, భాష్పవాయు ప్రయోగం, కొన్ని చోట్ల రివాల్వర్ కాల్పులు జరిపారు. వందలాదిమంది అమాయకులు గాయాలపాలైనారు. వరంగల్‌లో ఉద్యమనేత మాచర్ల మార్కండయ్యను పోలీసులు కాల్చి చంపినారు. జూలై 7 బంద్ సంపూర్ణంగా జరిగింది. ఖాజిపేట సమీపంలో ఆందోళనకారులు పోలీసుకాల్పులకు నిరసనగా రైలింజన్‌కు నిప్పుపెట్టారు.
తెలంగాణను నిర్లక్ష్యం చేశారు: జె.పి.
కలకత్తాలో నిర్వహించబడిన ఒక సమావేశంలో జయ ప్రకాశ్ నారాయణ్ ప్రసంగిస్తూ , దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతల ను తొలగించడానికి, వెనుక బడిన ప్రాంతాలు త్వరితగతిని అభివృద్ధి చెందడానికి సత్వర చర్యలు తీసుకొనకపోతే ఇండియాలో అనేక ‘తెలంగాణ ఉద్యమాలు’ రాగలవని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. దేశ సమైక్యతపై నిర్వహించిన ఈ సదస్సులో జె.పి. మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పటి ఆందోళనకు మూలకారణం అదేననటంలో భేదాభిప్రాయాలు లేవు. ఇంత ఆందోళన జరిగిన తర్వాత మంత్రులు, పార్లమెంటు ఈ విషయమై కొంత ఆలోచన మొదలుపెట్టారు. దేశంలో మరికొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దేశ సమైక్యతకు భంగం రాదని అన్నారు.
గుంటూరులో ప్రత్యేకాంధ్ర సదస్సు
దేశ సమైక్యతకు రాష్ట్ర విభజనకు సంబంధం లేదు. ఆంధ్ర, తెలంగాణ రాషా్టలు ఏర్పడితే ఇరు ప్రాంతాలు సర్వతో ముఖాభివృద్ధి చెందుతాయని నడింపల్లి నర్సింహారావు అన్నారు. జూలై 5న గుంటూరులో జరిగిన ప్రత్యేకాంధ్ర సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సదస్సును ప్రారంభిస్తూ స్వతంత్ర పార్టీ నాయకుడు ఎన్.విజయరాజకుమార్ ”పెద్ద మనుషుల ఒప్పందం గత 13 సంవత్సరాల నుంచి అమలు జరుపలేదు. ముల్కీ రూల్స్ సరిగా అమలు జరపక ఆంధ్రులకు ఉద్యోగా లిచ్చారు. యావత్తు ఒడంబడిక గాలికి వదిలిన పేలపిండి అయ్యింది” అన్నారు. ఈ సదస్సుకు తెలంగాణ ఉద్యమ నాయకులు సదాలక్ష్మి, శ్రీధర్ రెడ్డి సందేశాలు పంపారు.
‘తెలంగాణా సంరక్షణ’కై వి.బి.రాజు కార్యక్రమం
జూలై8న రెవెన్యూ మంత్రి వి.బి.రాజు విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి, నైరాశ్యం ఏర్ప డింది. వాటిని తొలగించవలసిన అవసరం వుంది. ఆంధ్ర ప్రాంతం వారు కొంత త్యాగం చేస్తేగానీ వీటిని తొలగించడం సాధ్యం కాదు. మనస్సులో ఏ విధమైన సంకోచాలు పెట్టుకొనక, ఏ విధమైన షరతులూ విధించక ఆంధ్ర ప్రాంతం వారు రాష్ట్ర వ్యవహారాల నిర్వహణ బాధ్యతను తెలంగాణా నాయకత్వానికి అప్పగించాలి అన్నారు.
నిజలింగప్ప, కామరాజ్‌ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసన సభాపక్షం చేసిన తీర్మానంతో వి.బిరాజు ఆశాభంగం చెందారు. ఈ తీర్మా నం తెలంగాణ ప్రజల మీద ఏమీ పనిచేయ జాలదు. ఆంధ్ర- తెలంగాణ ప్రాంతాల వారి మధ్య విద్వేషాన్ని తొలగించడం తక్షణా వసరం. ఈ విద్వేషాన్ని తొలగించడం ఎలా అన్న విషయం మీద తెలంగాణ శాసన సభ్యులతో చర్చలు జరుపుతున్నాను. నేటి స్థితి నుంచి తెలంగాణను రక్షించుకోవాలన్నదే తెలంగాణ సంరక్షణ నినాదం తాత్పర్యం అని వి.బి.రాజు అన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వి.బి.రాజు తన రాజీనామాను వెంటనే ఆమోదింపజేయాలని కోరినారు.
తెలంగాణ పి.సి.సి. గుర్తింపునకై
ఎం.పి. ప్రయత్నం
బెంగుళూరులో జరుగుతున్న ఏ.ఐ.సి.సి. సమావేశంలో జూలై 10న తెలంగాణ ఎం.పి. జె.రామేశ్వర రావు కాంగ్రెస్ నిబంధనావళికి ఒక సవరణను ప్రతిపాదించారు. తెలంగాణకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన ఈ సవరణకై రామేశ్వర రావు వొత్తిడి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పిమ్మట ఆరు నెలల వరకు ూడా ప్రత్యేకంగా హైదరాబాద్ పి.సి.సి. ఉండేదని, అయితే దానిని విచక్షణ లేకుండా ఆంధ్ర ప్రదేశ్ పి.సి.సి.లో కలిపారని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత సంక్షోభానికి గల పెక్కు కారణాలలో ఈ పి.సి.సి విలీనం ూడా ఒకటని అన్నారు.
జూలై 12న తెలంగాణ పతాక దినం
జూలై 12ను తెలంగాణ పతాక దినంగా పరిగణించాలని ప్రజాసమితి పిలుపునిచ్చింది. తెలంగాణ భూభాగాన్ని ప్రదర్శించే పటాలతో పతాకాలను మోటార్ వాహనాల ముందు భాగాలపై ఎగురవేస్తూ ఊరేగింపు జరిపారు. ఆర్.టి.సి, విద్యుశ్చక్తి బోర్డుల్లోను, ఇతర ప్రభుత్వాఫీసులలోనూ, ఉద్యోగుల వాహనాలపైన తెలంగాణ మ్యాపుల జెండాలను ప్రదర్శించారు. జంటనగరాలలో గత కొద్ది రోజులుగా రోడ్లమీద తిరిగే వాహనాలమీద ఎర్రరంగులో తెలంగాణ పటాన్ని ప్రదర్శించారు. జంటనగరాలలో తెలంగాణ పతాక దినం సందర్భంగా విస్తృతంగా ప్రదర్శనలు జరిగాయి. షాపులు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు, దీప స్తంభాలు, వాహనాలపైన 9 జిల్లాలను చూపే ప్రత్యేక రాష్ట్ర పటాన్ని ఎగురవేసారు. కోఠి, సుల్తాన్‌బజార్, ఇస్లామియా బజార్, గ్రామర్ స్కూల్ ూడలి, మహాత్మాగాంధీ విగ్రహం, మారేడ్‌పల్లిలతో సహా జంటనగరాల్లో అనేక ప్రదేశాల్లో ప్రజాసమితి నాయకులు ఈ జెండాలు ఆవిష్కరించారు. ఇస్లామియా బజార్‌లో ఎం.పి. జిఎస్ మేల్కొటే ప్రత్యేక తెలంగాణా పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పతాకాన్ని లాక్కున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పతాకాలను ఎగురవేసారు ఉద్యమకారులు.
తెలంగాణ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరిన
ఆంధ్రా విశ్వవిద్యాలయం
హైయ్యర్ సెకండరీ పాఠశాలలతో సహా వివిధ సంస్థలలో విద్యాభ్యాసం చేస్తున్న తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంత విద్యాసంస్థలలో, పై తరగతులలో చేరదలచినట్లయితే ప్రవేశ పరీక్షల్లో పాల్గొని సీట్లు పొందవచ్చునని, దరఖాస్తులను పంపాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర, వెంకటేశ్వర యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే తెలంగాణ విద్యార్థులకు ఆగస్టు 8, 9 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ కళాశాలల్లో సీట్లు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆంధ్ర విద్యార్థులకిస్తున్నారనే విమర్శకు సమాధానంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. నిజానికి ఎవరైనా తెలంగాణ విద్యార్థి ఆంధ్రలో చదవడానికి బోతే అవమానాల పాలు జేసి, వేధించి వెనక్కి పంపారు ఆంధ్రులు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.
తెలంగాణ మంత్రుల రాజీనామాలు ఆమోదం
జూన్ 28న రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులు గవర్నర్ (ముఖ్యమంత్రి) సలహాపై పదవుల్లో కొనసాగుతున్నారు. జూలై 14న వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రాజీనామా చేసిన మంత్రులలో జె.వి.నరసింగ రావు, పి.వి.నరసింహారావు, శీలం సిద్ధారెడ్డి, ఇబ్రహీం అలీ అన్సారీ, అరిగె రామస్వామి, వి.బి.రాజు, .వి. నారాయణ రెడ్డి, బి.వి. గురుమూర్తిలు ఉన్నారు.
37 రోజుల ఎన్.జి.ఓల సమ్మె విరమణ
తెలంగాణ ఎన్.జీ.ఓలు జూన్ 10 నుండి చేస్తున్న సమ్మెను జూలై 16న విరమించాలని నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణ కోసం .ఆర్. ఆమోస్ నాయకత్వంలో టి.ఎన్జీవోలు ఈ సమ్మె నిర్వహించారు. సమ్మె వద్దన్న ¬ం మంత్రి చవాన్ విజ్ఞప్తిని వీరు (ప్రారంభించినప్పుడు) తిరస్కరించారు.
టీఎన్జీఓలతో బాటు సమ్మెలో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగులు ూడా తమ సమ్మెను విరమించారు. యూనియన్ నాయకులు, జిల్లాల నుండి వచ్చిన వారు రోజంతా చర్చలు జరిపి విరమణ నిర్ణయం తీసుకున్నారు.
విరమణ నిర్ణయ ప్రకటనలో ‘ప్రత్యేక తెలంగాణలో మాత్రమే మా సమస్యలు పరిష్కారం కాగలవని మేము మరల ఒకసారి స్పష్టం చేస్తున్నాము’ అని పేర్కొన్నారు.
టి.ఎన్.జి.ఓ. సంఘాధ్యక్షుడు ఆర్ ఆమోస్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల అధికారులు సమ్మె విరమణకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్.జి.ఓలు ూడా సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు.
తెలంగాణా ఎన్.జి.ఓలపై సమ్మె కాలంలో పెట్టిన సుేలను ఉపసంహరించుకుంటున్నట్లు జూలై 17న ప్రభుత్వం ప్రకటిం చింది. సమ్మె కాలాన్ని ఎర్న్‌డ్ లీవ్‌గా పరిగణిస్తామని ప్రకటనలో పేర్కొన్నది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన, 151 సి.ఆర్.పి.సి. కింద, 1969 అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్ కింద అరెస్టయి ఉద్యోగాల నుండి తొలగించబడిన వారి విషయంలో ఆ ఉత్తర్వులను రద్దు చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు.
బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గ పునర్నిర్మాణం
8 మంది తెలంగాణ మంత్రుల రాజీనామాల ఆమోదం తర్వాత జూలై 18న బ్రహ్మానంద రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్నిర్మించారు. రాజీనామా చేసిన 8 మందిలో అనారోగ్య కారణాల వలన గురుమూర్తిని, తెలంగాణ సంరక్షణల గురించి మాట్లాడుతున్న వి.బి.రాజును, రాష్ట్రపతి పాలన కోరినందుకు .వి. నారాయణ రెడ్డిని, అరిగె రామస్వామిని పక్కన బెట్టి మిగిలిన నలుగురికి మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చాడు బ్రహ్మానందరెడ్డి. వీరిలో జె.వి. నరసింగరావుకు ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చాడు. కొత్తగా తెలంగాణా నుండి ఆంధ్ర సెటిలర్ అయిన జలగం వెంగళరావుకు ¬ం శాఖను టాేయించాడు. ఖమ్మంలో రవీంద్రనాధ్‌చే బలవంతంగా 1969 జనవరి 23న దీక్ష విరమింపజేసినందుకు, తన అనుచరులచే ఖమ్మం తెలంగాణా ప్రజాసమితి కార్యాలయంపై దాడి చేయించినందుకు, ఖమ్మం తెలంగాణ ఉద్యమకారులలో పోటీ సంఘం పెట్టించి చీలికలు తెచ్చినందుకు తన వ్యతిరేక వర్గానికి చెందిన వెంగళరావుకు మంత్రి పదవిని నజరానాగా ఇచ్చాడు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ నుండి కొత్తగా రోడామిస్త్రీ, వాసుదేవరావు, వి. పురుషోత్తం రెడ్డి, జి. సంజీవరెడ్డిలకు మంత్రి పదవులు లభించాయి.
నిరసనగా జూలై 19 తెలంగాణ బంద్
రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులు, కొత్తగా మంత్రి పదవులు పొందిన తెలంగాణ శాసనసభ్యుల వైఖరికి నిరసనగా తెలంగాణా ప్రజాసమితి, తెలంగాణా విద్యార్థి కార్యాచరణ సంఘం జూలై 19న తెలంగాణ బంద్‌ను నిర్వహించారు.
- రాజమండ్రి జైలులో ఉన్న డాక్టర్ చెన్నారెడ్డి తదితరులు తమ విడుదల కోసమై హైకోర్టులో దాఖలు చేసుకున్న హైబియస్ కార్పస్ పిటీషన్‌పై డివిజన్ బెంచ్ జూలై 21న విచారణ ప్రారంభించింది.
- 1969 ఆగస్టు 8 నుండి ఉస్మానియా కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు వి.సి. రావాడ సత్యనారాయణ రేడియోలో జూలై 24న ప్రకటించారు. విద్యార్థులలో చీలికలుండరాదని, తరగతులకు హాజరు కావాలని అన్నారు. అంతకు ముందు జూలై 24 ఉదయం ఓ.యు.క్యాంపస్‌లో కళాశాలల పునఃప్రారంభం విషయంలో రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురు విద్యార్థులు గాయపడినారు. విద్యార్థి సంక్షేమ మండలి, .ప్రభాకర్ (కార్యదర్శి) కళాశాలలను వెంటనే తెరవాలని కోరినారు. తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది.
- తెలంగాణ పాఠశాలలన్నింటినీ వారం రోజుల్లో తెరిపిస్తామని విద్యాశాఖ మంత్రి పి.వి.నరసింహారావు జూలై 24న ప్రకటించారు.
- తెలంగాణ సమస్యకు పరిష్కారం సూచించడానికి ప్రాంతీయ సంఘం (రీజనల్ కమిటీ) 22 మంది సభ్యులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో తెలంగాణ మంత్రులు, వివిధ ప్రాంతాల శాసనసభ్యులను సభ్యులుగా నియమించారు అధ్యక్షుడు చొక్కారావు.
- 35 రోజులుగా సమ్మె చేస్తున్న ఉస్మానియా ఉద్యోగులు, 38 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యుచ్చక్తి బోర్డు ఉద్యోగులు తమ సమ్మెలను విరమించారు.
- జంటనగరాలలో తెలంగాణ రాష్ట్రం కోసం, నాయకుల విడుదల కోసం సత్యాగ్రహం చేస్తున్న ఆందోళనకారులను (6 జట్లు) జూలై 22న పోలీసులు అరెస్టు చేశారు. జులై 24న లోక్‌సభ స్పీకర్‌కు ఎం.నారాయణ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఇచ్చిన లేఖలో 21 మంది సభ్యులతో పార్లమెంటరీ కమిటీని నియమించాలని ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ప్రత్యక్ష అధ్యయనం చేసి 26, ఆగస్టు 1969న లోక్‌సభకు నివేదిక ఇవ్వాలని కోరినారు. ఈ లేఖపై సుమారు 40 మందికిపైగా వివిధ రాషా్టలకు చెందిన యం.పి.లు సంతకాలు చేశారు. వీరిలో వాజపాయ్‌ూడా ఉన్నారు.