తెలంగాణా-సాహిత్య-చరిత్రవిమర్శక్షేత్రంలో కృతశ్రములైన ఆచార్య ఎస్వీ రామారావు లేఖిని నుండి తెలంగాణ సాహిత్య చరిత్ర వేలువడడం ఎంతో మోదావహమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన శుభ సమయంలో ఇది వేలుగు చూడటం ఇంకా ఔచిత్యంగా ఉన్నది. కవినో, ప్రక్రియనో ఆధారం చేసుకొని యుగవిభజన చేయక శతాబ్దాన్ననుసరించి కాలవిభజన చేసి నూతన పంథాను త్రొక్కినారు డాక్టర్‌ రావుగారు.

తెలంగాణ సాహిత్యాన్ని అతి ప్రాచీన కాలం నుండి అత్యాధునిక యుగం వరకు సంగ్రహంగా, సమగ్రంగా ఈ గ్రంథంలో పరిచయం చేయడం జరిగింది. మల్లియ రేచక కవిజనాశ్రయం తొలి ఛందోగ్రంథం, తొలి తెలుగు వీరశైవకవి శివతత్త్వసారకర్తయైన మల్లికార్జున పండితారాధ్యుడు, తొలి దేశి పురాణం బసవపురాణం, తొలిచరిత్ర కావ్యం పండితారాధ్య చరిత్ర, తొలిశతకం వృషాధిపశతకం, తొలి ఉదాహరణం, తొలి రగడ మొదలైన దేశి ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు అని ప్రకటిస్తూ కూడా ‘‘పరమత ద్వేషం, మండజంగము పద్ధతి మున్నగు దురాచారావర్ణన, అనంతర కాంలో నిరసనకు గురియై తెలుగు సాహిత్యంలో ఒకడుగా మిగిలిపోయినాడు.. రచనలో దేశిపాలు పెచ్చుపెరిగి అది అతని మతప్రచారమునకు తోడ్పడినదేకాని ఆంధ్రసాహిత్యమున ప్రామాణిక కవితా లక్షణమును సంపాదించుకొనగలిగినది కాకపోయినది’’ అన్న ఒక విమర్శకుని ఉక్తిని ఉద్ధరించటం వీరి విమర్శక దృష్టిని చాటుతుంది.

తొలి తెలుగు రామాయణం (గోన బుద్ధారెడ్డి), తొలి తెలుగు జంటకవులు కాచరెడ్డి, విఠలరెడ్డి (ద్విపద ఉత్తర రామాయణ కర్తలు), తొలి వచక సంకీర్తనకారుడు శ్రీకంఠ కృష్ణమాచార్యుడు, తొలి తెలుగు మార్గపురాణకర్త మారన (మార్కండేయ పురాణం), తొలి తెలుగు పద్య రామాయణం భాస్కర రామాయణం, తొలి తెలుగు భాగవత (దశమస్కంధ) కర్త మదికి సింగన, తొలి తెలుగు యక్షగానం కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అంటూ తెలంగాణాలో తొలిగా వేలువడిన అసంఖ్యాక ప్రక్రియలను, గ్రంథాలను పరిచయం చేసినారు గ్రంథకర్త.

చిత్రభారత కర్తయైన చరిగొండ ధర్మన్నను గూర్చి రాస్తూ, ‘శతలేఖి నీ పద్యసంధాన ధౌరౌయు, ఘటికా శతగ్రంథ కరణధుర్యు। అన్న భట్టుమూర్తి బిరుదు ధర్మన్న బిరుదుకు అనుకరణలే అని నిరూపించినారు.
తొలి అచ్చ తొగు కావ్యం యయాతి చరిత్ర, తొలి నిరోష్ఠ్యరామాయణం (మరింగంటి సింగరాచార్యు), తొలి వచన చరిత్రకారుడు ఏకామ్రనాథుడు (ప్రతాపచరిత్ర), తొలి ఆంధ్ర శబ్ద చింతామణి టీకాకర్త, భర్తృహరి సుభాషిత త్రిశతి ఆంధ్రీకర్త, తొలిత్య్రర్థికావ్యకర్త ఎకూచి బాసరస్వతి, కాకునూరి అప్పకవి, చింత పల్చికపూు, మరింగంటి కవు, హోసదుర్గం కవు`ఇట్లు పర:శతంగా మనకీగ్రంథంలో దర్శనమిస్తారు. బేతవోు జమీందారు తడకమళ్చీ వేంకటకృష్ణారావు (1830`90) లీలావతి గణితాన్ని, తొగు పద్య కావ్యంగా అనువదించినారు. ఇతని ‘కామరూపకథ’ తొలి తొగు నవగా భావింపబడుతున్నది. చెర్విరా బాగయ్య సుగ్రీవవి జయం రెండు లక్షల ప్రతులు అమ్ముడుపోయినవట! ఇట్టి ఆశ్చర్య విషయాలెన్నో ఈ గ్రంథంలో తొస్తవి.

తెలంగాణ విముక్తి కవిత, రజాకార్ల దురంతాలు, దిగంబర కవిత్వం, నవ్యసంప్రదాయ కవిత్వం, గజళ్ళు, రుబాయలు, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, విప్లవ కవిత్వం మొదలైన అత్యాధునిక సర్వప్రక్రియలు తెలంగాణలో వ్యాప్తిలోకి వచ్చినవి. ఇందు పరిచయం కావింపబడినవి.

‘హాుని గాథా సప్తశతి తెలుగుదేశంలో వెసిన ప్రథమ కవితా సంకనమని, కొండాపుర నివాసి గుణాఢ్యుడు వ్రాసిన బృహత్కథ తెలుగు నేలలో వెలిసిన తొలికథా కావ్యమని’ ఆచార్య రామారావు ఈ గ్రంథారంభంలో తెలిపినారు. అయితే హాసాతవాహన చక్రవర్తి రాజధాని ప్రతిష్ఠానం (పైఠన్‌) మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలోనిది. పూర్వం ఈ ప్రాంతంలో మహారాష్ట్రీ ప్రాకృతం వ్యవహారంలో ఉండేది. ఆచార్య దండి కావ్యాదర్శంలో మహారాష్ట్రిని ప్రకృష్టమైన ప్రాకృతంగా పేర్కొని, గాథాసప్తశతి, సేతుబంధాదికావ్యాు అందు రచింపబడినట్లు చెప్పినాడు. మహారాష్ట్రీయే కాక్రమంలో రూపాంతరం పొంది, తృతీయ ప్రాకృతంగా`నేటి మరాఠీ భాషగా పరిణమించిందని భాషాతత్త్వవేత్త అభిప్రాయం. హాుని ఆస్థానంలో గుణాఢ్య, శర్వవర్మ పండితుల మధ్య చెలరేగిన వివాదం కారణంగా గుణాఢ్యుడు ప్రతిజ్ఞమేరకు సంస్కృత, ప్రాకృత, దేశ భాషనుత్యజించి, అచటి గోదావరి తీరపు అరణ్యం చేరుకొని, పైశాచీ ప్రాకృతంలో బృహత్కధను వ్రాసినాను. ఈ కథకు ఆధారం కథాసరి త్సాగరాదిగ్రంథాలు. గుణాడ్యుడు కొండాపురం వాడని ఇదివరకెట్టి ప్రమాణం కూడా లభించలేదు. కనుక తెలుగు నేల నుండి బృహత్కథ వచ్చినట్లు చెప్పటం నిరాధారం.

ఒకటి రెండు ఇట్టి అభిప్రాయభేదాలున్నా రెండువేల సంవత్సరాలు తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించిన ఆచార్య రామారావు గారు బహుధా ప్రశంసార్హు. ఈ గ్రంథం తుదికి ఎంతో శ్రమించి, శ్రద్ధతో కూర్చిన కవి, కావ్య సూచికలు అసంఖ్యాకంగా కవుల, కావ్యాలు మెలుగుకు వచ్చి తెలంగాణ సాహిత్య విశ్వరూపం దర్శనమిస్తున్నది.
`గంగాపురం హరిహరనాథ్‌

Other Updates