tsmagazineపాతాళంలోని నినాదాన్ని ఆశయ పతాకం చేసి… పుడమిని పూల బతుకమ్మను చేసిన ఘనుడని…ఆశయానికి ఆయువు పోసి వికాసాన్ని బోధించిన ఆచార్యుడతడని… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ఉన్నతంగా చిత్రిస్తూ… ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య ”జయశంకరుడు” పేరుతో ఓ దీర్ఘకవితను వెలువరించారు. ఆచార్య జయశంకర్‌ అన్నిపార్టీల కరపత్రమని… నాయకులెవరైనా ఆయనే మేనిఫెస్టో అని అంటూ కవి జయశంకర్‌ సార్‌ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని… విద్యార్థులకు ఉపాధ్యాయుడై… ఉపాధ్యాయులకు ఆచార్యుడై.. ఉద్యమానికి సిద్ధాంతమై… తెలంగాణ పెద్ద దిక్కై ఆచార్య జయశంకర్‌ వెలుగొందారని ఈ దీర్ఘకవిత ద్వారా తెలియజెప్పడానికి కవి సుబ్బయ్య చేసిన ప్రయత్నం ప్రశంసనీయం! ఆచార్య జయశంకర్‌ వ్యక్తిత్వాన్ని.. తెలంగాణ పట్ల ఆయనకున్న శ్రద్ధా భక్తులను… ఇందలి కవితా పంక్తుల్లో కవి అందంగా నిక్షిప్తం చేశారు. తెలంగాణ వాదాన్ని నరనరాన పుణికి పుచ్చుకున్న కవి సుబ్బయ్య.. ఉద్యమ కాలంలో తనదైన శైలిలో తన కవిత్వం ద్వారా జనాన్ని చైతన్యపరిచారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పట్ల జయశంకర్‌ చిత్తశుద్ధిని, కవి సుబ్బయ్య భావోద్వేగంతో ఈ చిన్న కావ్యంలో అక్షరబద్ధం చేశారు.

– దాస్యం సేనాధిపతి

Other Updates