maga1969 ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రజ్వలింపజేయడానికి ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి పకూనుకున్నారు. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయిన తెలంగాణ విద్యార్థులు 1970 మార్చి-ఏప్రిల్‌లో పరీక్షలు రాసిన తర్వాత మరోదశ ఉద్యమాన్ని ప్రజాసమితి ప్రారంభించాలని నిర్ణయించింది.1970 ఏప్రిల్‌ 22నుంచి 25 వరకు వంతుల వారీ నిరాహారదీక్షలు, ఏప్రిల్‌ 22 నుంచి 30 వరకు సత్యాగ్రహం, మే 1 నుచి సామకూహిక సత్యాగ్రహం నిర్వహించాలని డా|| చెన్నారెడ్డి ఏప్రిల్‌ 19న పిలుపునిచ్చారు.

తెలంగాణ ఐక్య సంఘటన అధ్యక్షుడు, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుడు వి.బి. రాజు, విధానసభలో ఐక్య సంఘటన, ప్రతిపక్షనాయకుడు నకూకల రామచంద్రారెడ్డి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

వి.బి. రాజు: ఏప్రిల్‌ 19న వి.బి. రాజు పత్రికా గోష్టిలో మాట్లాడుతకూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమై 15 మాసాలు గడిచినవి. ఎన్నో ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు సంభవించినవి. ప్రధాని, రాష్ట్రపతి ఇంకా ఇతరులు హైదరాబాద్‌ వచ్చి పరిస్థితి చకూసి సానుభకూతి తెలిపిపోయారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కాదని, సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలని అంగీకరించడం కకూడా జరిగింది. ఈ సమస్యతో దేశమంతటికీ సంబంధించిన సమస్యలు ముడివడి ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యాని పరీక్షగా ఇది పరిణమించిందని మేము అభిప్రాయపడుతున్నాము. కొన్ని రాజకీయకాంక్షలు ఉద్భవించినపుడు ప్రజాస్వామిక యంత్రాంగాన్ని ఉపయోగించడమా లేక ఉద్యమాన్ని అణచివేయడానికి అదేపనిగా పోలీసులను ఉపయోగించడమా అన్నది ప్రశ్న. తమ అభిప్రాయాలను ప్రకటించుకునే హక్కు ప్రజలకున్నది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తున్నది. అటువంటప్పుడు వేలం ప్రజా ఉద్యమాన్ని అణచడమే విధానంగా పెట్టుకుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం నశిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రిజర్వు పోలీసులను పంపి రాజకీయోద్యమాన్ని అణచి దమననీతిని కొనసాగించడాని రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పడడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వి.బి. రాజు అన్నారు. ప్రజాస్వామ్యం అభివృద్ధికి ఈ విధానం ఎంతమాత్రం తోడ్పడదని, ఈ విషయాన్ని నొక్కి చెప్పడాని తాము సత్యాగ్రహం చేస్తున్నామని రాజు అన్నారు.

తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకత్వం సమస్య పరిష్కారానికి పకూర్తి బాధ్యత తీసుకోవాలి. ఏదైనా సాధించడానికి ముందు సర్వవిధాలా త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలని తాము స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు రాజు తెలిపారు.

తెలంగాణ ఐక్య సంఘటన ఏప్రిల్‌ 18న నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా రెండు తీర్మానాలు ఆమోదిం చింది. తెలంగాణా ప్రజాసమితి ఆధ్వర్యాన సాగుతున్న ఉద్యమాన్ని పకూర్తిగా బలపర్చడానికి సంబంధించిన తీర్మానం ఒకటి. టియకూఎఫ్‌ సభ్యులు ప్రజా సమితి నాయకత్వంలో సాగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కనీస కార్యక్రమం ప్రాతిపదికపై విధానసభ ప్రతిపక్షాల ఐక్య సంఘటన ఏర్పాటుకు సంబంధించినది మరొక తీర్మాణం.

అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వి.బి. రాజు ప్రయత్నం రెండవ తీర్మాణం లోతుల్లోకి వెళ్ళితే..

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం, లేదా రాష్ట్ర భవితవ్యంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపించడానికి ఆమోదించడం, బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోగల ప్రభుత్వం స్థానే అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదుర్చుకోవడం. ఈ రెండు అంశాలను కకూడా కనీస కార్యక్రమంలో చేర్చాలని ఈ తీర్మానం సకూచించింది.

పత్రికా విలేకర్ల గోష్టిలో వి.బి. రాజు రెండవ అంశాన్ని వివరిస్తకూ బ్రహ్మానందరెడ్డి తెలంగాణా సమస్యపై ఒక ప్రత్యేక వైఖరి అవలంభించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించ లేకుండా ఉన్నారు. తెలంగాణ సమస్య పరాయి సమస్య కాదు. ప్రజా సమస్య. ఈ సమస్యను పరిష్కరించడాని అఖిలపక్ష ప్రభుత్వం ఆవశ్యకత అని అన్నారు.

తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడానికై మితవాద కమ్యకూనిస్టుపార్టీ పకూనికపై ఏప్రిల్‌ 17న సీపీఐ పార్టీ ప్రతినిధులు రాజు బహద్దకూర్‌ గౌర్‌, సీహెచ్‌ రాజేశ్వరరావు తెలంగాణ ఐక్య సంఘటన నేతలు వి.బి. రాజు, నకూకల రామచంద్రారెడ్డిల మధ్య 18న చర్చలు జరిగాయి. స్పష్టమైన ప్రతిపాదన ఏదీ ఇంకా రకూపొందలేదని, తిరిగి చర్చలు కొనసాగుతాయనీ వి.బి. రాజు చెప్పారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కమ్యకూనిస్టు పార్టీ అంగీకరించిందనీ, రాజకీయ రంగంలోనకూ, పరిపాలనా రంగంలోనకూ తెలంగాణకు రక్షణలు అవసరమని కూడా వారన్నారని, అయితే తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయం బాధ్యత తెలంగాణా ప్రజల వదిలివేయాలని ఐక్య సంఘటన కోరుతున్నదని వి.బి. రాజు అన్నారు.

నగరంలో నిషేధాజ్ఞలు

తెలంగాణ ప్రజా సమితి తుది పోరాటానికి పిలుపునివ్వడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ గతంలో విధించిన నిషేధాజ్ఞలను ఏప్రిల్‌ 20 నుంచి 25 వరకు పొడిగించారు. గత 15 నెలలుగా ఈరకమైన నిషేధాజ్ఞలు అమల్లో వుంటకూ వచ్చాయి. సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిషేధించారు. నలుగురికి మించి తిరగడం, లాఠీలు, ఇతర ఆయుధాలు ధరించడాన్ని నిషేధించింది ప్రభుత్వం.

magaపోటీ ప్రజాసమితి రద్దు

1969 మే 22న డా|| మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తకూ పోటీ ప్రజాసమితిని స్థాపించిన అప్పటి విద్యార్థి కార్యాచరణ కమిటీ నేత యం. శ్రీధర్‌రెడ్డి తన ప్రజాసమితిని రద్దు చేసుకుంటున్నట్లు 1970 ఏప్రిల్‌ 14న ప్రకటించారు.

1970 మార్చి 8న శ్రీధర్‌రెడ్డి ప్రజాసమితి అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైనారు. ఆ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేందుకు ఒక కొత్త పార్టీని నిర్మించే నిమిత్తం యువజనులకు శిక్షణా శిబిరం నిర్వహించాలని తీర్మానాన్ని ఆమోదించారు. వంచనకు, విధ్వంసానికి దారితీస్తున్న రాజకీయాలకు విరుద్ధంగా వివేచనతోకూడిన రాజకీయాలను, ఆశయ ప్రాముఖ్యాన్ని, అనుసరించవలసిన ఎత్తుగడను ఆ శిక్షణా కారక్యక్రమంలో బోధించాలని కూడా నిర్ణయించారు. వచ్చే 6 నెలల్లో 101 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనకూ సదస్సులు నిర్వహించి క్రొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయించారు.

ఐదువారాలు గడవక ముందే పార్టీ పెడతానన్న శ్రీధర్‌రెడ్డి ప్రజాసమితినే రద్దు చేసుకోవడం వెనుకగల కారణాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ ప్రజల సమస్యల విషయంలో శ్రద్ధ చకూపకపోగా వారికి జరిగిన అన్యాయాలకు చాలావరకు కారకులైన వృత్తి రాజకీయ నాయకులు ఆ తర్వాత విద్యార్థులు, ప్రజలు స్వయంగా ముందుకువచ్చి ఉద్యమం లేవదీసిన తర్వాత ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థంకోసం ఉద్యమంలో చేరినారు. ప్రజలు కూడా నిస్వార్థులైన కొత్త నాయకత్వంపైకంటే వృత్తి రాజకీయ నాయకులపైనే ఆశలు పెట్టుకొని వారినే అనుసరిస్తున్నారు. విద్యార్థులు ఇప్పటి చాలా త్యాగం చేశారు. చదువులు చెడగొట్టుకున్నారు. ఇంకా పెడదారినపడి ఇదే పరిస్థితి కొనసాగడం ఎంతమాత్రం వాంఛనీయంకాదు.

తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరాలంటే ఉద్యమంలో హింసా చర్యలను నాయకత్వం పకూర్తిగా నిరోధించగలగాలి. అప్పుడే లక్ష్యాన్ని సాధించగలం. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలము. ప్రత్యేక రాష్ట్రం సాధించిననాడు సామాన్యునికి దానివల్ల క్షేమం కలగాలి. దరిద్రునికీ, ధనికునికీ మధ్యగల అంతరాన్ని తొలగించలేకపోతే అటువంటి రాష్ట్రంవల్ల సామాన్య మానవునికి ఎట్టి ప్రయోజనం ఉండబోదు.

తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ప్రజలు తమ అభిప్రాయాన్ని సవ్యంగా వ్యక్తం చేసేట్టుగా చేయడానికి గ్రామీణ ప్రజలలో ప్రచారానికి తాను పకూనుకుంటానని శ్రీధర్‌రెడ్డి పత్రికా ప్రకటన జారీ చేశారు.

ప్రజా సమితి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే మార్చి 8, 9 తేదీల్లో జరిగిన సదస్సులో నిర్ణయించామని, ప్రజాసమితిని ఏకపక్షంగా రద్దు చేసే అధికారం శ్రీధర్‌రెడ్డికి లేదంటకూ పోటీ ప్రజాసమితి ఉపాధ్యక్షుడు వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థి నేతల బెయిల్‌ నిరాకరణ

వివిధ సందర్భాల్లో అరెస్టు కాబట్టి జైళ్లలోవున్న విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్‌, మరోనేత గౌరీశంకర్‌, హైస్కకూల్‌ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జలీల్‌పాషా మరికొందరు విద్యార్థి నేతలకు కోర్టులు బెయిల్‌ నిరాకరించి నవి. డా|| మర్రి చెన్నారెడ్డి తెలంగాణ తుదిఘట్టానికి పిలుపు నివ్వడంతో ప్రభుత్వం, న్యాయస్థానాలు అప్రమత్తమైనాయి.

తెలంగాణ ఉద్యమంలో అంతిమఘట్టం

-వంతులవారీ నిరశన దీక్షలు ప్రారంభం

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు ప్రారంభించిన ఉద్యమంలో చివరిఘట్టంగా ప్రజాసమితి ఏప్రిల్‌ 22నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో మొత్తం 13 నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పరిచినారు.

ప్రజాభిప్రాయ సేకరణద్వారా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరే తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ వి.బి. రాజు (ఎంపీ), జీవీ సుధాకర్‌రావు (ఎమ్మెల్సీ), ఎం.ఆర్‌. శ్యాంరావు (ఎమ్మెల్సీ), ఎస్‌.బి. గిరి, నకూకల సరోత్తమరెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్లు , ప్రజాసమితి కార్యకర్తలు మొత్తం 300 మంది జంట నగరాల్లోని వివిధ కేంద్రాలలో నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ శిబిరాలను డా|| చెన్నారెడ్డి సందర్శించారు. ఈ రిలే నిరాహారదీక్షలు ఏప్రిల్‌ 26 దాకా కొనసాగుతాయని డా|| చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రజా సమితి తమ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా మున్ముందు పరిపాలనా యంత్రాంగాన్ని స్థంభింపజేయాలని, రైల్వే లైన్లపై కకూర్చొని రైళ్ళ రాకపోకలను అడ్డగించాలని సకూచించినందున సికిందరాబాద్‌, నాంపల్లి, కాచిగకూడ రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసు సిబ్బందిని పెంచారు.

(తెలంగాణ జిల్లాల నిరశన దీక్షలు-వచ్చే సంచికలో…)

వి.ప్రకాశ్‌

Other Updates