సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రచురిస్తున్న ‘తెలంగాణ’ మాసపత్రిక ఉర్దూ ఎడిటర్‌ హబీబుద్దీన్‌ ఖాద్రీ అకస్మిక మృతి పట్ల ఈ శాఖ కమీషనర్‌ అర్వింద్‌ కుమార్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఖాద్రీ సమాచార శాఖకు చేసిన సేవలు ఎనలేనివని, మంచి అధికారిని కోల్పొయిందని అన్నారు. ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌గా సమాచార శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఖాద్రీ ఉర్దూ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ పండుగ సందర్భంగా వీరు ఉర్దూ వాఖ్యాతగా పని చేశారు. ఆయన మృతి సమాచార శాఖకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కమీషనర్‌ తెలిపారు.

సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, ఎఫ్‌.డి.సి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ ‌ఎల్‌.ఎల్‌.ఆర్‌. కిశోర్‌ బాబు, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు డి.ఎస్‌.జగన్‌, ఎన్‌.వెంకటేశ్వర రావు, ‘తెలంగాణ’ తెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులు అష్టకాల రామ్మోహన్‌, ఇతర సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

సమాచార భవన్‌లో జరిగిన సంతాప సభలో కార్యాలయ సిబ్బంది ఖాద్రీ చిత్రపటం వద్ద నివాళుర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Other Updates