గ్రంథాలయం ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి. మన చరిత్రలో, సంస్క తిలో, జాతీయ సంపదలో ఒక ముఖ్య భాగం. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజలను మేలుకోలిపె జాగృతజ్యోతులుగా, సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా, సాంఘిక ఉద్యమాలకు వ్యూహ నిర్మాణ స్థావరాలుగా గ్రంథాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. సామాజిక వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపడానికి, వాటిని సవరించడానికి, ప్రజలలో చైతన్యం పెంచడానికి, స్వాతంత్య్ర ఉద్యమానికి గాని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు ఈ గ్రంథాలయాలు కేంద్ర బిందువుగా ఉన్నాయి.

ఉద్యమాలు ఊపిరిలూదడానికి నాడు తెలంగాణ వ్యాప్తంగా మారు మూల పల్లెలలో సైతం అనేక గ్రంథాలయాలు స్థాపించారు.

తెలంగాణ ప్రాంతం అనేక సాంప్రదాయాలకు, సంస్కతులకు, అచార వ్యవహారలకు, భాషలకు నిలయం. అందుకే ధాశరథి ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నారు. నాడు ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన గ్రంథాలయోద్యమానికి వచ్చిన ఊతం తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమానికి రాలేదు. కారణం, నిరంకుశుడైన నిజాము ప్రభుత్వపాలన, నిరక్షరాస్యత. తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమంతో పాటు ప్రజా ఉద్యమాలు అనేక ఆటు పోటులకు గురికావలసి వచ్చింది. కనీసం నలుగురు ఒక చోట గుమికూడి మాట్లాడుకోవడానికి, రాజకీయాలు చర్చించుకోవాలి అన్నా, గ్రంథాలయం ఏర్పరుచు కోవాలన్నా ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. నాడు గ్రంథాలయాల స్థాపన ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషను రక్షించాలని, ఆక్షరాస్యతను పెంపొందించాలని. అందుకోసమే నాడు గ్రంథాలయాలకు ఆంధ్ర భాషా నిలయాలు అని నామకరణం చేయడం జరిగింది.

తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయాల స్థాపన 19 వ శతాబ్దం ద్వితీయ అంకంలో అరంభమై 20వ శతాబ్దంలో ఉచ్చ స్థితికి చేరుకున్నాయి. అవి ఎంతలా అంటే, అనధికార సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1901 నాటికి 120 గ్రంథాలయాలు ఉన్నాయి అని అంచనా.

శ్రీ కష్ణ దేవరాయాంద్ర భాషా నిలయ స్వర్ణోత్సవ సంచిక సమాచారం ప్రకారం 1927 నాటికి తెలంగాణ ప్రాంతంలో 63 పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో జిల్లాల వారిగా పరిశీలిస్తే హైదరాబాదు-7, సికింద్రాబాద్‌-4, వరంగల్లు-15,

కరింనగర్‌-9, నల్లగొండ-13, మహబూబ్‌ నగర్‌ -5, మెదక్‌ -5, నిజామాబాదు-1, అదిలాబాదు -1, రాయచూర్‌-1. గ్రంథాలయోద్యమం తప్ప ఏ ఉద్యమం లేని రోజుల్లో ఈ ఉద్యమం అన్ని ఉద్యమాలకు కాణాచి అయింది.

వాటిలో 1870లో వనపర్తిలో బ్రహ్మ విద్యావిలాసం పేరిట ముద్రాక్షరశాలను (గ్రంథాలయం), 1872లో సికింద్రాబాద్‌ -సోమసుందర మొదలియార్‌ మొట్టమెదటి గ్రంథాలయం, 1875లో సికింద్రాబాదు నందు మొట్ట మొదటి రీడింగ్‌ హాలు గ్రంథాలయం, చాదర్‌ఘాట్‌ వద్ద 1878లో యంగ్‌ మెన్స్‌ ఇంప్రువ్‌మెంట్‌ అసోసియేషన్‌ గ్రంథాలయం, శాలిబండ 1895లో భారతగుణవర్దక సంస్థ గ్రంథాలయం, హిందూ సొషల్‌ క్లబ్‌- 1892 (హైదరాబాదు), ఆల్బర్ట్‌ రీడింగ్‌ హాల్‌ గ్రంథాలయం 1896 (బొల్లారం), మౌల్వి అబ్దుల్‌ ఖయ్యుం మరియు నవాబ్‌ ఇమాదుల్‌ ముల్క్‌ చే 1891లో అసఫియా స్టేట్‌ సెంట్రల్‌ గ్రంథాలయం (తెలంగాణా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం). రావి చెట్టు రంగారావు, నాయిని వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాదులో కోఠి నందు 1901 సెప్టెంబర్‌ 1న శ్రీకష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం స్థాపన, హనుమకొండ లో 1904లో పింగళి వెంకట్రామా రెడ్డి రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపన, 1905లో సికింద్రాబాద్‌ ఆంధ్ర సంవర్దిని గ్రంథాలయం, 1906లో విజ్ఞాన చంద్రికా మండలి, 1910లో ఆంధ్ర భాషా నిలయం (గ్రంథాలయం- ఖమ్మం) ‘సంస్క త కళావర్ధిని గ్రంథాలయం 1913లో సికింద్రాబాద్‌, 1911లో మాడపాటి హనుమంతరావు రావుచే స్థాపించబడ్డ మహబూబియా ఆంధ్ర భాషా నిలయం ఎర్రుపాలెం ఖమ్మం, ఆది హిందు గ్రంథాలయం-1911 హైదరాబాదు, శ్రీ సిద్ది మల్లేశ్వర గ్రంథాలయం ‘1913లో రెమిడి చెర్ల-మధిర, పెండ్యాల సోమయాజుల, పెండ్యాల శేషాద్రి శర్మ, రావుల పాటి గోపాల సహకారంతో 1912లో నేలకొండ పల్లి, ఖమ్మం నందు స్థాపించబడ్డ విరాట్రాయాంధ్ర భాషా నిలయం, 1917లో భువనగిరి లక్ష్మినారాయణ విజయదశమి రోజున సూర్యాపేటలో శ్రీ ఆంధ్ర విజ్ణాన ప్రకాశీని గ్రంథాలయం స్థాపన, రాజా బహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయం (1918) హైదరాబాదు, 1918లో నల్లగొండ నందు ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయం (శబ్నవిషు వెంకట రమణ నరసింహ రావుచే స్థాపించబడింది), ఓరుగల్లు పట్టణంలో తూము రంగయ్య, ఆకారపు భద్రయ్య, కొండూరి బసవయ్య సహకారంతో శబ్దాను శాసన ఆంధ్ర భాషా మందిరాన్ని1918లో స్థాపన, 1922 గౌలిగుడా చమన్‌ నందు బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం (గ్రంధాలయం), 1926 అక్టోబర్‌ 1న సిద్ద్ధిఅంబర్‌ బజార్‌ రోడ్డున ఉస్మాన్‌ గంజ్‌ సమీపంలో కొండా వెంకట రంగారెడ్డి వేమన ఆంధ్ర భాష నిలయం ఎర్పాటు, 1930 మార్చి 5న జోగిపేటలో జోగినాథాంధ్ర గ్రంథాలయం బసవమాణయ్య, సులుగంటి శివప్ప, అరిగే ఆశయ్య సహకారంతో, చెన్నిపాడులో 1934లో సరస్వతి విలాసం గ్రంథాలయం, 1936 సెప్టెంబర్‌లో ఖమ్మంలో విజ్ణాననికేతనం సుగ్గుల అక్షయ లింగం గుప్త సహకారంతో కోదాటి నారాయణ రావు స్థాపన, రావి నారాయణ రెడ్డిచే 1942లో రైతు/బాపూజీ/చిలుకూరు గ్రంథాలయం. ఈ గ్రంథాలయాలన్నింటికి ప్రేరణ హైదరాబాద్‌లోని శ్రీ కష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయమే!

ఇలాంటి చరిత్ర ప్రసిద్ధి గాంచిన విజ్ఞాన మందిరాలు ఈ పోరాటాల గడ్డలో ఇప్పటికి శతవసంతాలు పూర్తి చేసుకున్న గ్రంథాలయాలు 25 కి పైగా వున్నాయి. ఈ గ్రంథాలయాలకు సమైక్య పాలనలో ఆలనా పాలన కరువైంది. మళ్లి వీటిని దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మే ప్రయత్నం వైపు తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఆడుగులు వేస్తున్నది.

తెలంగాణలో గ్రంథాలయాల అభివద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన వారిలో వట్టికోట ఆళ్వారు స్వామి ప్రథమ స్థానం ఆక్రమించగా, తరువాత కోదాటి నారాయణరావు, రావి చెట్టు రంగా రావు, సురవరం ప్రతాపరెడ్డి, బోవేరా.

రావి చెట్టు రంగారావు వికాసోద్యమ నాయకునిగా కార్యనిర్వహకుడిగా, సంఘసేవకుడిగా, సంస్కర్తగా, గ్రంథాలయ

ఉద్యమ నాయకునిగా ఈ తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేసిన వైతాళికులుగా, శ్రీకష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం, రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపనలో వారి పాత్ర, వారి జీవితం ముందు తరాల వారికి ఒక విజ్ఞాన ఘని, తెరచిన వోయి.

వట్టికోట అళ్వారు స్వామి ఒక తెలుగు రచయితగా, గ్రంథాలయ అభివద్ధి కర్తగా, పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా గుర్తింపు పొందారు. పుస్తకాలను (విజ్ఞానాన్ని) తన భుజాల మీద (పండ్లను ఏ విధంగా బుట్టలలో తీసుకవెళ్లి ప్రజలకు అమ్ముతారో) మోసుకపొయి పల్లె పల్లెన చేరవేస్తూ వ్యక్తి వ్యక్తికి పంచిపెడుతూ విజ్ఞానాన్ని పంచిన సాహితీ మూర్తి మన అళ్వారు స్వామి, మరీ ముఖ్యంగా తెలంగాణలో గ్రంథాలయ

ఉద్యమానికి, అభివద్ధికి వారు చెసిన సేవ ఎనలేనిది. వట్టికోట ఆళ్వారు స్వామి. పేరు గ్రంథాలయోద్యమ లోకంలో సరైన స్థానాన్ని అక్రమించకున్నా భారత సమాజంలో ఒక గాంధీజి పేరు ఎలా ప్రాకిందో అలా చరిత్ర పుటలలో, తెలంగాణ చరిత్రలో, సంస్క తిలో, సాహిత్యంలో, సాంప్రదాయాలలో, తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో వినిపించాల్సిన, కనిపించాల్సిన అవశ్యకత ఉంది, ఎందుంటే అంతటి ప్రజా సేవ వారిది, ఇతను చివరి క్షణం వరకు తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ స్థాపనకు, గ్రంధాలయాల అభివద్ధికి ఎనలేని సేవ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం వీరు గ్రంథాలయాలకు చేసిన సేవకు గుర్తుగా నగర కేంధ్ర గ్రంథాలయానికి వట్టి కోట అళ్వారు స్వామిగా నామకరణం చేసింది.

కోదాటి నారాయణ రావు స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా, గాంధేయవాదిగా, గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తగా ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. చిన్న తనం నుండే స్వాతంత్య్ర ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, సహకార ఉద్యమం, ఖాదీ ఉద్యమం, వయోజన విద్య వ్యాప్తికి జీవితాన్ని ధారపోశారు. ఇల్లు ఇల్లు తిరిగి గ్రంథాలయం స్థాపన కోసం చందాలు వసూలు చెసి మరీ ప్రారంభించారు. ఈ గ్రంథాలయాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి (మెగా ఫోనులో వాడ వాడల తిరుగుతు గ్రంథాలయానికి రమ్మని, గోడలపై పోస్టర్లు కూడ అంటించే వారు) వారు చేయని ప్రయత్నం లేదు. వీరు ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, అంధ్ర విజ్ఞాన నికేతనం, బాల సరస్వతి ఆంధ్రభాషా నిలయం లకు పక్కా భవనాలు నిర్మించడం వాటి అభివద్ధికి అనిర్వచనీయమైన సేవచేశారు.

తోటపల్లి గాంధీ, కరీంనగర్‌ గాంధీ, అని పేరు గాంచిన బోయిన పల్లి వెంకటరామారావు (బోవెరా) తెలంగాణాలో సాగిన జాతీయ ఉద్యమంలో పల్లె పల్లెకు గ్రంథాలయాలను స్థాపించి, గ్రంథాలయ ఉద్యమంలో వారి స్థానం అజరామయం. గ్రంథాలయాల మీద ప్రేమతో వారు చాలా సార్లు సభల్లో, సమావేశాలలో ”నన్ను నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినవి గ్రంథాలయాలే. నాకు నా తల్లి మొదటి జన్మ నిస్తే రెండవ జన్మని గ్రంథాలయాలు ప్రసాదించాయి” అని పలు మార్లు చెప్పే వాడు. అందుకే వారు మూడు దశాబ్దాలు పై గా జిల్లా గ్రంథాలయ పరిషత్‌ సభ్యులుగా, కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులుగా

ఉన్నప్పుడు కరీంనగర్‌ పరిసర గ్రామాలల్లో చాలా (దాదాపు 50) గ్రంథాలయాలు స్థాపించారు. 1976లో సొంతంగా ప్రభుత్వ భూమిని సేకరించి కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ భవనాన్ని సొంతంగా నిర్మించారు. 1939లో ఆంధ్ర విజ్ఞాన వర్దిని, పేరుతో గ్రంథాలయం తన సొంత గ్రామంలో స్థాపించారు.

సురవరం ప్రతాప రెడ్డి, రెడ్డి వసతి గహ తొలి వార్డెన్‌. తొలి గ్రంథ పాలకుడిగా సేవలందించారు.ఈ గ్రంథాలయంలో సురవరం రాక పూర్వం దాదాపు 1000 పుస్తకాలు ఉండేవి. 1926 నాటికి 11,000 గ్రంథాలు సేకరించారు. అయితే ఒక ప్రజా సంస్థలో 11,000 గ్రంథాలు ఉండటం గొప్ప విషయం.

నాడు అనేక గ్రంథాలయ వార్షికోత్సవాలకు, నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహా సభలకు అతిథిగా సురవరం హాజరైనారు.

సమైక్య పాలనలో మన తెలంగాణలో దాదాపు గ్రామ గ్రంథాలయాలు(105), బ్రాంచ్‌ గ్రంథాలయాలు (562), బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (1254), జిల్లా కేంద్ర గ్రంథాలయాలు (31), రీజనల్‌ గ్రంథాలయాలు (2), రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఉండగా,

ఉన్న పౌర గ్రంథాలయాలు అభివద్ధి చేసిన దాఖలాలు లేవు. ఉన్న చారిత్రిక విజ్ఞాన ఘనులు (గ్రంథాలయాలు) చితికి పోయి అచేతనంగా కాలం వెళ్ళబుచ్చాయి. మన తెలంగాణ రాష్ట్ర అవిర్బావం తరువాత తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ వాటికి పునర్జీవనం కలిపించే ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ (గ్లోబల్‌ లైబ్రరీస్‌, బిల్‌ మరియు మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు నాస్కామ్‌ ఫౌండేషన్‌ మద్దతుతో) స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పౌర గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపాలి అని, మారుతున్న కాలంతో పాటు అధునిక హంగులు, సౌకర్యాలు కల్పించాలి అని, ప్రతి మారుమూల పల్లెలోకి గ్రంథాలయాల సేవలు వ్యాపింపచేయాలనే కత నిశ్చయంతో. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలి అని దృఢ సంకల్పంతో పని చేస్తున్నది.

మారుతున్న కాలంతో పాటు గ్రంథాలయాలను అధునీకరించాలని ప్రతి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో అంతర్జాల సేవలను, కంప్యూటర్‌ సేవలను ఉచితంగా చదువరులకు అందిస్తున్నది. చదువరులకు అవసరమైన పుస్తకాలను (పోటీ పరీక్షలకు, దిన, మాస పత్రికలు, పీరియాడికల్స్‌) ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో తెస్తున్నవి.

నూతన జిల్లాల అవిర్బావం తరువాత ప్రతి జిల్లాలో పక్కా భవన నిర్మాణానికి స్థలాన్ని, నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినది. అదేవిధంగా కె. తారక రామారావు పురపాలక, ఐటి శాఖ మాత్యులుగా పనిచేసిన సమయంలో హైదరాబాదు మహానగరం చుట్టూ నాలుగు ప్రధాన గ్రంథాలయాలు నిర్మించాలని వాటికి నిధులు కేటాయించారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పౌర గ్రంథాలయాలలో పని చేస్తున్న గ్రంథపాలకులకు ఐపిఎల్‌ఎంతో కలసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం, సామర్ధ్య అభివద్ధి కొరకు, పలు వత్తి నిర్వహణ కార్యక్రమాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నది. మన రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో ఉన్న అపురూప సంపదను మెత్తం డిజిటలైజ్‌ చేస్తున్నారు. దీనికై తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఏంతో శ్రమిస్తున్నది.

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్వర్యంలో ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ కలసి మన రాష్ట్రంలో గత రెండు దఫాలుగా 2017 మార్చి 17, 18వ తేదీలల్లో పౌర గ్రంథాలయ చట్టాలపై దక్షిణ ప్రాంత రాష్ట్రాల సదస్సు ఐపిఎల్‌ఎం, డి ఇ ఎఫ్‌ మరియు అర్‌ అర్‌ ఎల్‌ ఎఫ్‌ సంయుక్తంగా హైదరాబాదులో నిర్వహించారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌, ఐపిఎల్‌ఎం, డి ఇ ఎఫ్‌ సంయుక్తంగా 2018 జనవరి 17, 18 తేదీలలో హైదరాబాదులో ”రీచింగ్‌ టు దీ అన్‌ రీచీంగ్‌” నినాదంతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. పౌర గ్రంథాలయాలను సామాజిక సాంస్క తిక, వికాస కేంద్రాలుగా, సమాచార కేంద్రాలుగా, విజ్ఞాన కేంద్రాలుగా, వత్తి కౌశల్య అభివద్ధి కేంద్రాలుగా ఉండాలని, జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి నిత్య చైతన్య కేంద్రాలుగ గ్రంథాలయాలను అభివద్ధి చేయడం వంటి అంశాలపై చర్చించడం జరిగింది.

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌, ఐపిఎల్‌ఎం, డి ఇ ఎఫ్‌ కలిసి జాతీయ స్థాయి పౌర గ్రంథాలయాల సదస్సు ను తెలంగాణలో వంద సంవత్సరాలు నిండిన గ్రంథాలయాలపై చర్చ, పబ్లిక్‌ లైబ్రరీస్‌ ట్రాన్స్ఫార్మింగ్‌: అవకాశాలు, మోడల్‌ లైబ్రరీలను రూపొందించడంలో సవాళ్లు అనే అంశంపై సెప్టెంబర్‌ 6, 7, 2018వ తేదిల్లో హైదరాబాదులో నిర్వహించారు. ఈ విజ్ఞాన ప్రపంచంలోని పౌర గ్రంథాలయాలను డిజిటల్‌ గ్రంథాలయాలుగా మార్చేందుకు చర్యలు, వ్యూహాలను అభివద్ధి చేయడం, సమాచార వ్యవస్థలు మైరుగైన సేవల అభివద్ధికి ఉన్న వనరులను ఉపయోగించడం వంటి అంశాలపై చర్చించడం జరిగింది.

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ వట్టికోట ఆళ్వారు స్వామి, బోవేరా, కోదాటి, రావి చెట్టు రంగా రావు, సురవరం ప్రతాపరెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి అనే తపన తో పని చేస్తున్నది.

గత దశాబ్ద కాలంగా గ్రంథాలయాలకు కొత్తగా పుస్తకాలు కొనే ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్న సందర్భంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షులు శ్రీధర్‌ చొరవతో రెండు దఫాలుగా గ్రంథాలయాలకు కావలసిన నూతన పుస్తకాలు కొనే పక్రియ నోటిఫికేషన్‌ జారీ చేసినారు.

Other Updates