నల్లసూరీళ్ళు1రాష్ట్ర జనాభాలో సగభాగం రోడ్లమీదనే ఉంటుంది. ప్రతిరోజు 90 లక్షల మందికి పైగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరో కోటి మంది వరకు ప్రైవేటు వాహనాల్లో రాక పోకలు సాగిస్తున్నారు. గడప దాటి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాల్సిందే. ఆ రోడ్డు సౌకర్యంగా లేకపోతే అన్నీ అవస్థలే. కానీ ఈ విషయంలో గత పదేళ్ల నుండి తెలంగాణలో ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. ఫలితంగా తెలంగాణలోని రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు సరికదా, ఉన్నరోడ్లు రిపేరుకు కూడా నోచుకోలేదు. దీంతో తెలంగాణ లోని రోడ్లన్నీ గుంతలమయంగా, ప్రమాదానికి నిలయంగా తయారయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నుండి మొదలు కొని జాతీయ రహదారుల వరకు ఒకే పరిస్థితి. ఈ దుస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణలో రోడ్లను బాగు చేయాలని నిర్ణయించారు. పంచాయతిరాజ్‌ రోడ్ల నుండి మొదలుకొని ఆర్‌ అండ్‌ బి రోడ్ల వరకు, సింగిల్‌ రోడ్లు మొదలుకొని ఫోర్‌ లేన్‌ రోడ్ల వరకు, మట్టి రోడ్ల నుండి మొదలుకొని ఎక్స్‌ప్రెస్‌ హైవేల వరకు అన్ని రోడ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. రహదారులు ఆర్థిక ప్రగతికి సూచికలు మాత్రమే కాదు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు సాధనాలు అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ భావిస్తున్నారు.

పంచాయతిరాజ్‌ రోడ్లు
శ్రీ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతిరాజ్‌ పరిధిలో వున్న 20 వేల కిలోమీటర్ల రహదారులను రూ. 600 కోట్లతో మరమ్మత్తు చేస్తారు.
శ్రీ వచ్చే రేండేళ్లలో బిటి రోడ్ల మరమ్మత్తులకు రూ. 2400 కోట్లను ఖర్చు చేస్తారు.
శ్రీ రూ. 1450 కోట్ల ఖర్చుతో 4146 కిలోమీటర్ల మెటల్‌ రోడ్లను మరమ్మత్తు చేస్తారు.
శ్రీ రూ. 700 కోట్ల పాతబకాయిలను వెంటనే చెల్లిస్తారు.
శ్రీ కల్వర్టులు, బ్రిడ్జిలను బాగు చేయడానికి రూ. 250 కోట్లు ఖర్చు పెడతారు.
శ్రీ రోడ్డు సౌకర్యం లేని 1614 అవాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారు.
ఆర్‌ అండ్‌ బి పరిధిలో
శ్రీ రూ. 2400 కోట్లతో 10 వేల కిలోమీటర్ల రహదారుల
మరమ్మత్తు.
శ్రీ జిల్లా కేంద్రాలకు డబుల్‌ లైన్‌ రోడ్డు లేని 149 మండల కేంద్రాలకు 2000 కిలోమీటర్ల మేర డబుల్‌ లైన్‌ రోడ్డు నిర్మాణానికి
రూ. 2589 కోట్లు.
శ్రీ 1500 కిలోమీటర్ల మేర సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చడానికి రూ.1500 కోట్లు.
శ్రీ గోదావరి, కృష్ణా నదులపై వంతెనలు నిర్మించడానికి రూ. 1445 కోట్లు.

శ్రీ బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి రూ. 1500 కోట్లు.
శ్రీ నిజామాబాద్‌ – డిచ్‌ పల్లి , ఖమ్మం – సూర్యపేట రహదారులను నాలుగు లైన్ల రోడ్లుగా మార్చడానికి రూ. 410 కోట్లు.
శ్రీ వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, గజ్వేల్‌ చుట్టూ రింగ్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 1500 కోట్లు.
శ్రీ పెండిరగ్‌ బిల్లుల చెల్లింపుకు రూ.50 కోట్లు.
శ్రీ 206 కిలోమీటర్ల పొడవున్న రాజీవ్‌ రహదారి అభివృద్ది. రాజీవ్‌ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వంకర టింకర గా అనేక మలుపులతో నిర్మించారు. అనుకున్నంత వేగంగా వాహనాలు వెల్లడం లేదు. గ్రామాల మధ్య నుండే రహదారి వెళ్లడం వల్ల అటు వాహనాలకు ఇటు గ్రామస్థులకు ఇబ్బంది అవుతున్నది.
శ్రీ 750 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్‌ రహదారిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీ ప్రజ్ఞాపూర్‌, కుక్కునూర్‌ పల్లి, గౌరారం, వంటిమామిడి, తుర్కపల్లి, దుద్దెడ, ములుగు, కొడకండ్ల,రామునిపట్ల, ఇబ్రహింనగర్‌ తదితర చోట్ల బైపాస్‌ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
శ్రీ షామీర్‌ పేట, సిద్దిపేట, ఎల్కతుర్తి వద్ద ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు.
శ్రీ 68 చోట్ల బస్‌ బే, బస్‌ షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు.
శ్రీ సిద్దిపేట, సుల్తానాబాద్‌, పెద్దపల్లి మధ్య రెండు చోట్ల రోడ్‌ సైడ్‌ ఎమినిటీస్‌ ఎర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ రెండు చోట్ల దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో కెఫెటేరియా, పార్క్‌ ఏరియా, పెట్రోల్‌ బంక్‌, టాయిలెట్లు, కార్‌ పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
శ్రీ రాజీవ్‌ రహదారిని ఆదిలాబాద్‌ జిల్లా చాందారా వరకు పొడిగించాలని నిర్ణయించారు.

జిల్లా కేంద్రాలన్నింటికి నాలుగు లైన్ల రోడ్లు
ప్రతి జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్‌ కు నాలుగు లైన్ల రోడ్డు ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఇప్పటికే నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి.
శ్రీ హైదరాబాద్‌ – వరంగల్‌ రహదారి ప్రస్తుతం యాదగిరి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డుగా ఉంది. దానిని వరంగల్‌ వరకు పొడిగిస్తారు. వరంగల్‌, జనగాం, ఆలేరులో బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు.
శ్రీ వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలో అటవీ శాఖ అనుమతి లేక పోవడం వల్ల ఆగిపోయిన జాతీయ రహదారి పనులకు అనుమతి వచ్చింది. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయి.
శ్రీ ఖమ్మం పోవడానికి సూర్యాపేట వరకు ఫోర్‌ లైన్‌ రోడ్డు ఉంది. సూర్యాపేట నుండి ఖమ్మం వరకు కొత్తగా ఫోర్‌ లైన్‌ రోడ్డు వేస్తారు.
శ్రీ హైదరాబాద్‌ – నిజామాబాద్‌ రహదారి డిచ్‌ పల్లి వరకు ఫోర్‌ లైన్‌ రోడ్డు వుంది. డిచ్‌ పల్లి నుండి నిజామాబాద్‌ వరకు ఫోర్‌ లైన్‌ రోడ్డు వేస్తారు.
నాలుగు ఎక్స్‌ ప్రెస్‌ హైవేలు
వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌ కు వచ్చే ప్రయాణికులు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తున్నది. వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్లగొండ లాంటి జిల్లా కేంద్రాల నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు గంటన్నర లోపే చేరుకుంటున్నప్పటికీి అక్కడి నుండి నగరంలోకి ప్రవేశించడానికి రెండు గంటలు పడుతున్నది. దీనివల్ల జిల్లాల నుండి వచ్చే ప్రయాణీకులే కాకుండా నగరంలోని వారు కూడా ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి జిల్లా కేంద్రాల రహదారులకు అనుబంధంగా పివి. నర్సింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవే తరహాలో నాలుగు ఎక్స్‌ ప్రెస్‌ హైవేలను నిర్మిస్తారు. వరంగల్‌ నుండి వచ్చే వారి కోసం ఔటర్‌ రింగు రోడ్డు నుండి ఉప్పల్‌ వరకు, కరీంనగర్‌ నుండి వచ్చే వారి కోసం ఔటర్‌ రింగురోడ్డు నుంచి జూబ్లి బస్‌ స్టేషన్‌ వరకు, బోధన్‌, మెదక్‌ ప్రాంతాల నుండి వచ్చే వారికోసం ఔటర్‌ రింగురోడ్డు నుంచి ప్యారడైజ్‌ వరకు, నల్లగొండ నుండి వచ్చే వారి కోసం ఔటర్‌ రింగురోడ్డు నుండి ఎల్బినగర్‌ వరకు ఎక్స్‌ ప్రెస్‌ హైవేలను నిర్మిస్తారు.

మరో మూడు జాతీయ రహదారులు
రాష్ట్రంలోని మూడు స్టేట్‌ హైవేలు నేషనల్‌ హైవేలుగా అప్‌ గ్రేడ్‌ అవుతున్నాయి. జగిత్యాల – కరీంనగర్‌ – వరంగల్‌, కురవి – ఖమ్మం – కోదాడ, నిజాంపేట్‌ -నారాయణఖేడ్‌ – బీదర్‌ రహదారులు ఇటీవలే జాతీయ రహదారులుగా అప్‌ గ్రేడ్‌ అయ్యాయి.

Other Updates