తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం, హైదరాబాద్ ఆర్టిస్ట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చిత్రాల ప్రదర్శనను ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కతిని విశ్వవ్యాప్తం చేసేందుకు కషి చేద్దామని, ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని, బతుకమ్మ పండుగకు ముందే ఈ చిత్రాల ద్వారా వేడుకను జరిపిన అనుభూతి కలిగిందన్నారు. కళలు
సజీవమని, ఏ రంగంలోని కళలైనా అవి మన సంస్కతిని ప్రతిబింబించేలా నిలుస్తా యన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని అన్ని కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనం దరిపై ఉందన్నారు. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని, త్వరలోనే హైదరాబాద్‌లో మహిళా చిత్రకారులతో అంతర్జాతీయ స్థాయి చిత్ర కళాప్రదర్శన ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహం అందేలా కషి చేస్తానన్నారు. హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా చిత్రకళల ప్రదర్శనలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ పరంగా స్థలం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఓ చిత్రకారుడు వేసిన బతుకమ్మ పోస్టల్ స్టాంప్ చిత్రం చూశాక కేంద్రం ద్వారా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయించాలనే ఆలోచన కలిగిందని, దీనికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ కవిత తెలిపారు.
గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ బతుకమ్మ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ సంస్కతికి ప్రతీక అయిన బతు కమ్మ వేడుకలను కళాకారులు తమ చిత్రాల ద్వారా విశ్వవ్యాప్తం చేస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీ డైరెక్టర్ కే లక్ష్మి, హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, పలు వురు చిత్రకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వ కుంట్ల కవిత బతుకమ్మల మధ్య ఉన్న చిత్రాన్ని ఓ కళాకారుడు ఆమెకు బహుకరించారు.
ఆకట్టుకొన్న చిత్రకళాప్రదర్శన
బతుకమ్మ పేరిట ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాప్రదర్శన అందరినీ ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 187 మంది చిత్రకారులు బతుకమ్మ వేడుకను ప్రతిబింబించే విధంగా గీసిన 200 చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.