magaప్రతి ఉగాదికి ఒక కవితా సంకలనాన్ని తీసుకురావడం భాషా సాంస్కృతిక శాఖకు ఒక ఆనవాయితీగా మారింది. 2016 దుర్ముఖి నామ సంవత్సర ఉగాది కవితా సంకల నాన్ని ‘మట్టి ముద్ర’ పేరిట ఏలె లక్ష్మణ్‌ సబ్బండ వర్ణాల జీవన చిత్రంతో వెలువడింది. 2016 సెప్టెంబర్‌లో వెలువడిన ఈ సంకలనంలో మొత్తం 64 కవితలున్నాయి. ఈ పుస్తకంలో ఒక చోట కవి రామా చంద్రమౌళి తెలంగాణ ‘ప్రజలు నిర్మిస్తున్న భూతల స్వర్గభూమి’గా పేర్కొన్నాడు. అవును ఇవ్వాళ తెలంగాణ నిర్మాణానికి ప్రజలే స్ఫూర్తి ప్రదాతలు. ఈ సంకలనానికి కె.వి .రమణాచారి ముందుమాట రాస్తూ ”రెండేళ్ళ తక్కువ కాలంలోనే దాదాపు 6 రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనాలను నిర్వహించడం, వాటిలో నాలుగింటిని ప్రామాణికమైన కవితా సంకలనాలుగా తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు” అని పేర్కొన్నారు.

Other Updates