telanganaతెలుగు సమాజానికి ఎలాంటి విజ్ఞానం అవసరమో 110 ఏళ్ల క్రితమే గుర్తించి ”విజ్ఞాన చంద్రికా మండలి” ద్వారా గొప్ప ప్రచురణలను తీసుకొచ్చిన దార్శనికులలో ముఖ్యులు రావిచెట్టు రంగారావు.

రావిచెట్టు రంగారావు 107వ వర్ధంతి సందర్భంగా జులై 3న సాయంత్రం రవీంద్రభారతి సెమినార్‌ హాలులో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ వికాస సమితి సంయుక్తంగా.. ”రావిచెట్టు రంగారావు సామాజిక సేవ” అనే అంశంపై సదస్సును నిర్వహించింది.

ఈ సదస్సుకు అధ్యక్షతవహించిన తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, రావిచెట్టు రంగారావు తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక అని కొనియాడారు. ఈకార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ కార్యదర్శి తిరునగరి ఉడయవర్లును సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంపాదకులు కె. శ్రీనివాస్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates