తెలంగాలో-ఫోటోనిక్స్‌-వ్యాలీతెలంగాణలో ఫోటోనిక్స్‌ వ్యాలీóతో రాష్ట్రం ప్రపంచ పటంలో పారిశ్రామికంగా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలోని ప్రప్రథమ ఫోటోనిక్స్‌ వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావుల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఫోటాన్‌ ఐసి కార్పొరేషన్‌ (అమెరికా)ల మధ్య ఫిబ్రవరి 14న ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఫోటాన్‌ ఐసి కార్పొరేషన్‌ సిఇవో బీరేంద్రరాజ్‌ దత్‌, రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి హర్పిత్‌ సింగ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సిలికాన్‌ ఫోటోనిక్స్‌, కాంపౌండ్‌ సెమీ కండక్టర్‌ ఫోటోనిక్స్‌ టెక్నాలజీ సాయంతో అధునాతన తరం ఫోటోనిక్స్‌ చిప్స్‌ తయారీకి అనుకూల వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫోటాన్‌ఐసి కార్పొరేషన్‌ అంగీకరించాయి. పర్యావరణ అనుకూల వాతావరణంలోనే ఉత్పత్తి సాధ్యమవుతున్నందున ఫోటోనిక్స్‌ వ్యాలీ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై ఫోటాన్‌ఐసి కార్పొరేషన్‌ 90 రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది.

సమాచార సరఫరాకు ఉపయోగించే ఫైబర్‌ ఆప్టిక్‌, ప్రస్తుత చిప్‌ టెక్నాలజీకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే ఫోటోనిక్స్‌. దీని సాయంతో కాంతి కిరణాల ఆధారంగా ఒకచోటనుంచి మరో చోటికి వేగంగా సమాచార సరఫరా వీలవుతుంది. డాటా ఆధారిత సేవల సంస్థకు, వాటి ఆఫీసు వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఫోటోనిక్స్‌ సేవలు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్‌ ఆధారిత కార్యకలాపాల్లో వేగం సమస్య తొలగిపోతుంది. తదుపరి తరం ఉత్పత్తుల రూపకల్పనలో ఫోటోనిక్స్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగకరంగా మారుతుంది.

Other Updates