పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన మేధావులలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి నవాబు అలీ నవాజ్ జంగ్. ‘ముల్కీ’ నిబంధనలు అడ్డురాకపోతే ఆయన మరో ఆర్థర్ కాటన్ అయ్యేవారు, మరో విశ్వేశ్వరయ్య అనిపించుకునేవారు. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, పాలేరు, వైరా, తుంగభద్రా, రాజోలిబండ, కడెం, అలీసాగర్, మూసీ, మానేరు – అలీ నవాజ్ జంగ్ ప్రతిభకు నిలిచిన ప్రాజెక్టులు. ఇందులో ఏ రాయిని తట్టినా ఆయన రూపమే ప్రతిఫలిస్తుంది. అందుకే ఆయన ‘దక్కను భగీరథుడు’.
అలీ నవాజ్ జంగ్ అసలు పేరు మీర్ అహమద్ అలీ. ఆయన 1896 జులై 11వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన ప్రతిభను మెచ్చి నిజాం ప్రభుత్వం ఆయనకు ‘అలీ నవాజ్ జంగ్’ అనే బిరుదు ప్రసాదించింది. ఆ పేరే స్థిరపడిపోయింది.
అలీ నవాజ్ జంగ్ విద్యార్థి దశ నుండే గణిత శాస్త్రంలో అసాధారణ మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రామర్ స్కూల్, మదరసా ఆలియా, నిజాం కాలేజీలో చదువుకునే రోజులో బంగారు పతకాు గొచుకున్నాడు. తన తెలివి తేటతో నిజాం ప్రభుత్వం నుండి ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసించే ఉపకార వేతనాు పొందాడు.
ండన్‌లో ఆయన ప్రఖ్యాతి చెందిన కాప్రహిల్ ఇంజనీరింగ్ కళాశాలో చేరాడు. అక్కడ కూడా మొదటి నుంచి తెలివితేటు గ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఫీల్డ్ వర్క్‌లో ఆయనకు ‘ఇంజనీరింగ్ జీనియస్’ అనే పేరువచ్చింది. విద్య ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రాగానే పి.డబ్ల్యు.డి. శాఖలో అసిస్టెంటు ఇంజనీర్‌గా చేరి, తన ముప్పై యేళ్ళ సర్వీసులో అంచెంచొగా ఎదిగి ఆ శాఖ మంత్రి అయ్యాడు.
దక్షిణ భారత దేశంలోని నదీ గమనాను క్షుణ్ణంగా పరిశీలించిన అలీ నవాజ్ జంగ్ వరద నీటిని సద్వినియోగ పరిచే బెడ్ సిస్టమ్‌ని రూపొందించాడు. ఈ పద్ధతి ప్రకారం నిర్మించిన మొదటి ప్రాజెక్టు తుంగభద్ర ప్రాజెక్టు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) రూపక్పన చేసేటప్పుడు మరో 15 ఏళ్ళ వరకు పెరిగిపోయే జనాభాకు సరిపడే నీరు అందే విధంగా దీన్ని రూపొందించారు. అంతటి ముందు చూపు ఆయనది.
అలీ నవాజ్ నిర్మించిన మరో అద్భుత పథకం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఆయన జీవితకాంలో ఈ క ఫలించక పోయినా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మొత్తం పని అంటే ` స్థ నిర్ణయం నుంచి డ్యాం నిర్మాణం వరకు ` అన్నీ ఆయన రూపొందించిన పథకాలే. ఢల్లీిలోని ‘హైదరాబాద్ హౌస్’ నిర్మాత కూడా ఆయనే. అలీ నవాజ్ జంగ్ రూపొందించిన మరో పథకం గోదావరి లోయ ప్రాజెక్టు పథకం. దీన్నే ఇప్పుడు శ్రీరాం సాగర్ అంటున్నారు. పథకం ప్రకారం పూర్తి అయితే ఈ ప్రాజెక్టు కింద 20 క్ష ఎకరాు సాగులోనికి రావాలి. రామగుండం వద్ద పెద్ద పారిశ్రామిక నగరం నిర్మించాని ప్లానులోని భాగం. ఇచ్చట సిమెంటు, ఆయిు, వనస్పతి, సిరామిక్సు, టెక్స్‌టైల్స్, రేయాన్ మొదలైన పరిశ్రమలే గాక దక్షిణ బస్తరు నుంచి ఇనుము ఆధారంగా పెద్ద ఉక్కు పరిశ్రమ కూడా నిర్మించవచ్చునని అంచనా. కాని ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం యీ పథకాను చేపట్టలేదు.
ప్రాజెక్టు నిర్మాణ రంగంలో క్లిష్ట సమస్యలెదురైనపుడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అలీ నవాజ్ జంగ్ సేవను ఉపయోగించుకుంది. శుక్కుర్ ప్రాజెక్టు (పాకిస్తాన్`సింధ్) నిర్మాణంలో బ్రిటిష్ ప్రభుత్వానికి క్లిష్టతర సమస్యు ఎదురైనపుడు ఆయన సేవను తీసుకుంది.
అప్పటి మద్రాసు, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వా మధ్య నీటి తగాదాు ఏర్పడినప్పుడు హైదరాబాద్ ప్రతినిధి వర్గానికి అలీ నవాజ్ జంగ్ నాయకత్వం వహించారు. జంగ్ యిచ్చిన సూచనకు మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ అంగీకారం తెపడంతో మద్రాసు ఇంజనీర్ల కన్నా అలీ నవాజ్ జంగ్‌దే పై చేయి అయింది.
నదీ జలా వినియోగం అశేష ప్రజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలిగానీ, రాష్ట్రా సరిహద్దు గీతతో కాదని ఆయన వాదించేవారు. ఫీల్డ్ మీదికి వస్తే ఆయన చండశాసనుడే, ఏ చిన్న తప్పునీ క్షమించలేక పోయేవారు. తప్పు సరిదిద్దగానే తృప్తి పడేవారు.
1947 అక్టోబరు 28వ తేదీన భారత ప్రభుత్వంతో మంతనాు జరపడానికి వెళ్లిన హైదరాబాద్ ప్రతినిధి వర్గంలో ఆయన సభ్యుడు. హైదరాబాద్ సంస్థానం బాగోగు అది భారత దేశంలో విలీనం కావడంలోనే ఉందని ప్రకటించి ఆయన గొప్ప సంచనం సృష్టించారు. దీనిపై ఉగ్రులైన రెండు వే మంది రజాకార్లు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ప్రాణాకు జంకక నిజం చెప్పిన జాతీయవాది.
స్వతంత్ర భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించింది. ప్రధాని నెహ్రూ ఆయనను తొలి ప్రణాళికా సంఘం సభ్యుల్లో ఒకరిగా నియమించారు.
నీటిని సద్వినియోగపరచడంలో జాగ్రత్త వహించక పోతే ప్రపంచమంతటా తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని ఆయన హెచ్చరించేవాడు. ప్రణాళికు రూపొందించడంలో గొప్ప నిపుణుడని ఆయనకు పేరుండేది. అంచనాకు మించిన పనులెన్నడూ చేయించలేదు. కనుక అలీ నవాజ్ జంగ్ రూపొందించిన పథకాన్నీ సకాంలో డబ్బు కొరత లేకుండా పూర్తి అయ్యాయి. నీటిపారుద రంగంలో ప్రపంచ నిపుణుడుగా ఆయనకు రావసిన పేరు రాలేదని అలీ నవాజ్ జంగ్‌తో సన్నిహితంగా ఉన్నవారు చెప్పుకుంటారు. 1949లో ఆయన మరణించారు.
ప్రముఖ సాగునీటిరంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహద్దూర్‌కు తెంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మరింత గుర్తింపు భించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆయన సేవను శ్లాఘించారు. అలీ నవాజ్ జంగ్ కకాం గుర్తుండి పోయేలా ఆయన పుట్టిన రోజు జులై 11ని తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెంగాణ ఇంజనీర్స్ డే’ గా జరుపుకుంటున్నది.
(తెంగాణ ఇంజనీర్స్ డే జులై 11)