ts-kcrదళితులకు అందించే సామాజిక సంక్షేమ పథకాలన్నీ దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో డిసెంబరు 18న నిర్వహించిన ‘యునైటెడ్‌ క్రిస్మస్‌`2014’ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని క్రైస్తవులపై వరాలజల్లు కురిపించారు.

క్రిస్టియన్లకోసం హైదరాబాద్‌ నగరంలో 10 కోట్ల రూపాయలతో ఓ భవనం నిర్మిస్తామని ఈ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కొద్ది రోజులకే నిధులు, భూమి కేటాయించడంతోపాటు ఈ భవనానికి డిసెంబర్‌ 23న శంకుస్థాపన కూడా చేశారు.

క్రిస్మస్‌ సందర్భంగా రెండు రోజులు సెలవును ప్రకటించి అమలు చేశారు. జనవరి 1వ తేదీ కూడా సెలవు ప్రకటించారు. దళితులకు అమలుచేసే మూడెకరాల భూమి సహా అన్ని ప్రభుత్వ పథకాలు దళిత క్రైస్తవులకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతోపాటు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

‘యునైటెడ్‌ క్రిస్మస్‌`2014’ వేడుకల్లో పాల్గొన్న చంద్రశేఖరరావు పావురాలు, బెలూన్లు ఎగురవేసి, కేక్‌ కట్‌ చేశారు.

Other Updates