nk-raoశ్రీ హెచ్‌.రమేష్‌బాబు

హైదరాబాదు సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వొక్కడే వంద మంది పెట్టుగా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడిన ఉద్యమకారుడు నాగులపల్లి కోదండరామారావు. ఎన్‌.కె.రావుగా హైదరాబాదు స్టేట్‌ అంతటా పరిచితులైన విద్యావేత్త, సంఘసంస్కర్త, మేధావి, న్యాయకోవిదులూ అయిన ఎన్‌.కె.రావు స్వదేశ భాషల పట్ల అమితమైన అభిమానం గల దేశభక్తుడు.

ఎన్‌.కె.రావు మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపురం తాలూకా చిక్కేపల్లి గ్రామంలో 1903లో జన్మించారు. పట్టాభిరామారావు, రావమ్మ ఆయన తల్లిదండ్రులు. ఆంధ్ర మహాసభ ద్వారా తెలంగాణ అంతటా గ్రంథాలయోద్యమ నాయకుడుగా పేరొందిన చిక్కేపల్లి రామచంద్రరావు వీరికి స్వయానా అన్నగారవుతారు. తండ్రి పట్టాభిరామారావు గ్రామ కరణం. ప్రాథమిక విద్యాభ్యాసం చిక్కేపల్లిలోనే జరిగింది. ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో, హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ హైస్కూల్లో విద్యనభ్యసించారాయన.

హైదరాబాదు సిటీ కాలేజీలో చదివి మెట్రిక్‌ పరీక్ష పాసయిన ఎన్‌.కె.రావు అప్పట్లో సిటీకాలేజీ ప్రిన్స్‌పాల్‌గా పని చేసిన నవాబ్‌ ఆజం జంగ్‌కి అత్యంత అభిమాన పాత్రుడైన విద్యార్థిగా ప్రశంసలందుకుని ఆయనకు సన్నిహితులైనారు. ఆ తరువాత కలకత్తా, మద్రాసు, అలహాబాదు నగరాల్లో చదివి బి.ఎస్‌.సి., ఎల్‌.ఎల్‌.బి. పట్టాలందుకున్నారు. ఇవన్నీ కూడా నవాబ్‌ ఆజంజంగ్‌ ఇప్పించిన స్కాలర్‌షిప్‌ వలన సాధ్యమైనవి. న్యాయవాదిగా ఎన్‌.కె.రావు తన వృత్తిలో సంచలన విజయాలు సాధించారు. ఎందరో న్యాయవాదులను, న్యాయవాద విద్యార్థులకు ఆయన గైడ్‌గా వ్యవహరించారు.

నిజాం పరిపాలనలో కొందరు అవినీతి అధికారులు తమ అధికారాలను దుర్వినియోగపరుస్తూ గ్రామాల నుండి వచ్చే సామాన్య ప్రజలు, వర్తకులు, రైతులను పీడిస్తూ బాధలకు గురి చేస్తుండేవారు. ఎన్‌.కె.రావు వారి పక్షాన నిలబడి వారి తరపున న్యాయం దక్కేలా వాదించి సాయం చేసేవారు. ఎన్‌.కె.రావు గారు తమ క్లైంట్ల తరపున వాదించడానికి కోర్టుకు వస్తున్నారంటే ప్రతివాదుల గుండెల్లో హడలు పుట్టేది.

1937లో నిజామాబాదులో హిందూ, ముస్లింల కలహాలు జరి?????? నిందితులపై కోర్టుల్లో కేసులు నమోదయినవి. కోర్టులో కేసు నడుస్తుండగా హైదరాబాదు స్టేటు సమాచార పౌర సంబంధాల డైరెక్టరు ఈ మతకలహాలపై ఒక ప్రకటన చేశారు. న్యాయస్థానం విచారణలో కేసు నడుస్తుండగా ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారి ప్రకటన చేయడమనేది కోర్టు ధిక్కార నేరం అవుతుందని ఈ విషయమై కోర్టులో వాదించారు. వాదోపవాదాలు జరి?????? హైకోర్టు ఫుల్‌బెంచ్‌ ముందు వారం రోజుల పాటు తన వాదనలు వినిపించారు. ఎన్‌.కె.రావు చివరికి న్యాయస్థానం ప్రభుత్వ సమాచారశాఖ డైరెక్టర్‌ ప్రకటన తప్పేనని కోర్టు ధిక్కార నేరం కిందికి వస్తుందని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఎన్‌.కె.రావు కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడిం?????? నిజాం నియంతృత్వ పాలనలో ఒక ప్రభుత్వాధికారిపై కోర్టులో ఒక అభియోగం మోపడమే సాధ్యం కాని ఆ రోజుల్లో దానిని నిరూపించి నిలువడం సామాన్య విషయం కాదు. కాని అలాంటి అసామాన్యమైన కార్యసాధకునిగా నిలిచారు ఎన్‌.కె.రావు.

అప్ప??? నిజాం స్టేట్‌ కింద బావుల కింద ఉన్న వ్యవసాయం చేసే రైతులు చెల్లించే శిస్తుల?? పెంచి ప్రజలపై భారం మోపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి జరిగిన ఉద్యమానికి ఎన్‌.కె.రావు గారు నాయకత్వం వహించారు. పొరుగు రాష్ట్రంలోని భూమిశిస్తు విధానాన్ని నిజాం ప్రభుత్వం కూడా అనుసరించాలని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడమే గాక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా నిజాం సర్కారు రెండు వంతుల శిస్తును తగ్గించింది. ఇదంతా ఎన్‌.కె.రావు కృషి ఫలితమే. 1938లో జరిగిన ప్రథమ స్టేట్‌ కాంగ్రెస్‌ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న వీరు ?????????? జైలుకెళ్లారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలో ఈయన నిర్వహించిన పాత్ర ప్రధానమైనది.

నిరంతర దౌర్జన్యాలకు గురవుతూ నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు, రైతుల తరఫున నిలబడి కోర్టులో కేసులు వాదించి న్యాయం సాధించి పెట్టిన ప్రజాన్యాయవాది ఎన్‌.కె.రావు.

తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి ఎన్‌.కె.రావు అందించిన సహకారం ఎంతైనా ఉంది. హైదరాబాదు నగరంలోని గౌలిగూడ ప్రాంతంలోని బాలసరస్వతి గ్రంథాలయం అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ సంస్థకు ఆయన చాలా కాలం కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాదు సిటీ చిక్కడపల్లిలో వరంగల్‌లో (చందా కాంతయ్య సాయంతో) ఆంధ్ర విశ్వవిద్యాలయాల స్థాపకులలో ప్రముఖులు ఎన్‌.కె.రామారావు, సీతారాంబాగ్‌లో ఏర్పాటయిన సంస్కృత పాఠశాలను స్థాపక సభ్యుడు ఎన్‌.కె.రామారావు గారే. నిజాం కాలంలో ఉర్దూ రాజభాష. ఉన్నవన్నీ ఉర్దూ బడులే. ఎందరో పేద విద్యార్థులకు ఆయన ఆర్థికంగా సాయపడి వారి చదువుకు సహకరించారు.

కోదండరామారావు గారికి రాజకీయాలపై తీవ్రమైన అభిప్రాయాలుండేవి. పోలీస్‌ యాక్షన్‌కు ముందు బొల్లారంలో భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌గా ఉన్న కె.ఎం. మున్షికి, స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యంగా స్వామి రామానంద తీర్థకి లైజన్‌ ఆఫీసర్‌గా పని చేశారు.

అప్పటి నిజాం స్టేట్‌లో తెలుగు, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషలు మాట్లాడేవారు. వీరిలో ఉర్దూ మాట్లాడేవారు పది మందికి మించి ఉండేవారు కాదు. ఉద్యోగులు తప్ప ఇతర వృత్తుల వారికి ఉర్దూలో ప్రావీణ్యం లేదు. ఇంకా వాణిజ్యం పరిశ్రమలు, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఉర్దూభాష అవసరమే లేదు. దాంతో తమకు అవసరం లేని ఇతర భాషలో చదువు??డానికి ఇష్టపడటం లేదని పూర్తి స్థాయి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని సంకల్పించారు. అందుకే 1935లోనే ఎన్‌.కె.రావు ఒక సర్వే చేసి హైదరాబాదు రాష్ట్రంలో చదువుకున్న వారి సంఖ్య అయిదు శాతమని తేల్చి చెప్పినారు. అదే కర్ణాటకలో పదకొండు శాతం, తిరువాంకూరు (కేరళ)లో 29 శాతంగా ఉన్నదని లెక్కలు తేల్చి ప్రభుత్వానికి ఎరుకపరిచారు.

1939లో ఖమ్మం పట్టణంలో వర్తక సంఘం ఏర్పడింది. ఈ వర్తక సంఘం అప్పట్లో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేక పోవడం వర్తక సంఘం ఏర్పడటం అనేది పోటీ ప్రభుత్వం వంటిది అనే ఆరోపణతో కోర్టులో కేసు పెట్టారు ప్రభుత్వ అధికారులు. ఫలితంగా వర్తక సంఘం సభ్యులకు శిక్ష పడింది. హైకోర్టుకు అప్పీలు చేయగా వర్తక సంఘం సభ్యులంద??? బేషరతుగా విడుదలయ్యారు. ఈ కేసుకు హైకోర్టులో వర్తక సంఘం తరపున వాదించి వాక్‌ స్వాతంత్య్రానికి, వ్యక్తి స్వేచ్ఛను హరించడం సర్కారు ఉద్దేశమని నిరూపించిన ఎన్‌.కె.రావు వాదనా పటిమ ఆ రోజుల్లో గొప్ప సంచలనం. ఈ ఖమ్మం జిల్లా వర్తక సంఘం కేసు హైదరాబాద్‌ స్టేట్‌ను అంతా ప్రభావితం చేసి అన్ని జిల్లాలలో వర్తకులంతా సంఘాలుగా ఏర్పడటం, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్‌ పార్టీలలో చేరి ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు.

గతంలో సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఆజం జంగ్‌ బహదూర్‌ ఆ తరువాత పదోన్నతులపై ఉన్నతాధికారిగా పని చేస్తున్నపుడు ఎన్‌.కె.రావుకు చాలా కమిటీల్లోకి నామినేట్‌ చేసి కీలకమైన అంశాలపై సలహాలు తీసుకున్నారు. ఆజం జంగ్‌ విద్యాశాఖ మంత్రి అయ్యాక ఎందరో పేద విద్యార్థులకు సర్కారు నుండి స్కాలర్‌షిప్‌లు అందేలా చూశారు. ఎల్‌.ఎన్‌.గుప్తా కూడా ఎన్‌.కె.రావుకి అత్యంత సన్నిహితులు. ఆయన ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎందరో పెన్షన్లు, ఆర్థిక సాయం అందేలా సిఫార్సులు చేశారు.

నిజాం కాలంలో, ఆ తరువాత ఆయన ”లా” క్లాసులు చెప్పారు. వనపర్తికి చెందిన ప్రసిద్ధ ప్రజావైద్యుడు డా.బాలకృష్ణయ్య హైదరాబాదులో వైద్యవిద్య చదువుకోవడానికి వీరందించిన సహాయ సహకారాలు ఎనలేనివి.

1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగి హైదరాబాదు స్టేట్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. నాడు కాంగ్రెస్‌ పార్టీలో దేశాయి – గోసాయి వర్గాలున్నా ఆయన ఇరుపక్షాల్లోనూ గౌరవాలందుకుని బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రి కావడంలో ఎన్‌.కె.రావు నిర్వహించిన భూమిక కీలకమైనది.

కానీ ఇంతలో కాలం ఎదురు తిరిగింది. అనుకోకుండా హైదరాబాదులో జరిగిన ఒక ప్రమాదంలో గాయపడి దవా ఖానలో చేరిపోవలసి వచ్చింది. వీటికి తోడు కాన్సర్‌, టి.బి.ల బారిన పడ్డారాయన. వికారాబాద్‌, అనంతగిరి, ఉస్మానియా, మద్రాసుల్లో చికిత్స పొందినా తిరిగి కోలుకోకుండానే 1952 డిసెంబర్‌ 5న కాలం చేశారు. అప్పటికి ఎన్‌.కె.రావు వయసు 50 ఏండ్లు. ఒకవేళ ఆయనేగనుక. అకాలంగా మరణించక పోయి వుంటే చాలా పదవులు వరించి వారి సేవలు మరిన్ని తెలంగాణ ప్రజలకు అందేవి. అచిరకాలం దేదీప్యమానంగా వెలుగవలసిన దీపం అర్ధాంతరంగా ఆరిపోయింది.

ఆజన్మ బ్రహ్మచారిగా జీవితమంతా తన మేధోసంపత్తిని, శక్తియుక్తులను ప్రజల పక్షాన నిలిచి పోరాడడానికి వినియో గించిన మహోన్నతుడు ఎన్‌.కె.రావు. కొందరు మనుషులు వొక కర్తవ్య నిర్వహణను లక్ష్యంగా చేసుకుని జీవిస్తారు. లక్ష్యసా ధన పూర్తవగానే నిశ్శబ్దంగా ఈ లోకం నుండి నిష్క్రమిస్తారు. అలాంటి మహనీయులతో ప్రాతఃస్మరణీయులుగా, దార్శనికుడిగా నిలిచిపోయిన వారు నాగులపల్లి కోదండరామారావు.

Other Updates