tsmagazine

తెలంగాణది వినూత్నమైన పారిశ్రామిక విధానం. పుష్కలంగా మానవ వనరులు,తగినన్ని వసతులు, సౌకర్యాలు వున్నాయి. ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతను కల్పించి, విస్తృత ప్రచారం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం వుంది.అతి తక్కువ రోజుల్లో అనుమతులు, ఆయా రంగాలవారీగా రాయి తీలు, ప్రోత్సాహకాల గురించి, ప్రభుత్వ పరంగా చూపుతున్న చొరవతోపాటు భూముల లభ్యత, నీటి వసతులు.. విమానా శ్రయం, రహదారులు ఇతర సానుకూలత అంశాలు ఉన్నాయి. అలాగే రాజధాని హైదరాబాద్‌ ప్రపంచంలోని అన్ని అనుకూ లతలు గల నగరాల్లో ఒకటి. వీటితోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ, వివిధ రంగాల్లో అవకాశాల గురించి ప్రపంచ ఆర్థికవేత్తలందరికీ వివరించడంలో కృతకృత్యులమయ్యామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు దావోస్‌ పర్యటన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు

దేశాధినేతలు, ముఖ్యమంత్రులకు మాత్రమే అహ్వానం అందే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ లో పాల్గొనవలసిందిగా మంత్రి కె.టి రామారావుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ సదస్సులో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమావేశాల్లో కె.టి.రామరావు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ ఫ్లీనరీ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలు దేశాల అధినేతలు , రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సియివోలు, చైర్మన్లు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులకు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం వస్తున్నప్పటికీ, ఈ సారి తొలిసారిగా దావోస్‌ సదస్సుకు రాష్ట్రం తరపున మంత్రి కెటి రామరావు హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని వ్యాపారానుకూల వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

ప్లీనరీ అనంతరం మంత్రి పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఇండోరమా వెంచర్స్‌ చైర్మన్‌ అలోక్‌ లోహియాతో సమావేశం అయ్యారు. థాయ్‌ లాండ్‌ దేశానికి చెందిన ఈ గ్రూపు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని గ్రూపు చైర్మన్‌ అలోక్‌ లోహియా తెలిపారు. బ్యాంకాక్‌ నగరం కేంద్రంగా పనిచేస్తున్న ఈ టెక్స్‌ టైల్‌ యం.యన్‌.సి కంపెనీ టెక్స్లైల్‌ అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ది గాంచింది. తెలంగాణలో ఉన్న టెక్సటైల్‌ పరిశ్రమ అవకాశాలను వివరించిన మంత్రి, వరంగల్‌ మెగా టెక్స్టైల్‌ పార్క్‌లో దేశంలోనే అతి పెద్దదని, ఫ్యాబ్రిక్‌ టూ ఫైబర్‌ పద్దతిలో ఈ పార్కు ఉందన్నారు. ఇప్పటికే కొరియా నుంచి ఈ పార్కులో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇండోరమా సైతం ఈ పార్కులో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. వరల్డ్‌ ఎకానామిక్‌ ఫోరమ్‌ ప్రారంభ ప్లీనరీ అనంతరం మంత్రి కెటి రామారావు, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌, యంపి గల్లా జయదేవ్‌, ముకేష్‌ అంబానీతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు.
tsmagazine
రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై అయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, రాష్ట్రం పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు. ఉదయం ఏయిర్‌ ఏషియా గ్రూప్‌ సియివో అంతోనీ ఫెర్నాండెస్‌, ఉప కార్యనిర్వహానాధికారిణి ఏయిరీన్‌ ఒమర్‌ తో మంత్రి సమావేశం అయ్యారు. దేశంలో రానున్న రోజుల్లో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాబాద్‌ లోని విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు.

నోవార్టిస్‌ కంపెనీ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ పెట్రా లక్స్‌తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మసిటీ గురించి వివరించారు. హైదరాబాద్‌ నగరం ఇప్పటికే భారతదేశ లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా ఉన్నదన్నారు. నగరంలో నొవార్టిస్‌ కార్యకలాపాల విస్తరణపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. నోవార్టిస్‌ నగరంలో అర్‌ అండ్‌ డి, డాటా సపోర్ట్‌ మరియు అనాలిటిక్స్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, హైదరాబాద్‌ నగరంలో సంస్ధ అభివృద్ధి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్తగా, సూమారు మరో 150 మంది పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలోని జినోమ్‌ వ్యాలీ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని, పూర్తి వివరాలను నోవార్టిస్‌ త్వరలోనే అందిస్తుందని మంత్రి కె.టి.రామారావు తెలిపారు.

మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కార్యనిర్వహాక ఉపాద్యక్షులు కెన్‌ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. తమ కంపెనీ భారీ ప్రాజెక్టుల అవకాశాల కోసం చూస్తోందని మంత్రికి వారు తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపైన మిత్సుబిషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని మంత్రి కోరారు. మిత్సుబిషి ముందుకు వచ్చి జపనీస్‌ స్మాల్‌ అండ్‌ మిడియం ఎంటర్‌ ప్రైజేస్‌ పార్క్‌ ను తెలంగాణలో ఎర్పాటు చేయాలని కోరారు. మెన్నటి జపాన్‌ పర్యటనలో ఇలాంటి పార్కు ఎర్పాటుకు జైకా వంటి అర్ధిక సంస్ధలు నిధులు అందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని మంత్రి వారికి తెలిపారు.

కువైట్‌ కు చెందిన ఫవద్‌ అల్గానిమ్‌ కంపెనీ సియివో మహ్మమద్‌ అల్గానిమ్‌ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్‌ విద్యుత్పాదనలో అగ్రస్ధానంలో ఉందన్నారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పవర్‌, మెడికల్‌ డివైజేస్‌ మాన్యూఫాక్చరింగ్‌ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఇన్వెస్ట్‌ మెంట్‌ కార్పోరేషన్‌ అప్‌ దుబాయ్‌ సియివో మహ్మమద్‌ అల్‌ షయిభానీ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో టెక్‌ సెంటర్‌ ఎర్పాటు చేయాలని కోరారు.

ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘సమాజానికి సమర్థ సేవల కోసం డిజిటల్‌ మార్గం’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కే.టీ.ఆర్‌ ప్రసంగించారు. పలు దేశాల ఉప ప్రధానులు, కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రమంత్రిగా కేటీఆర్‌ ఒక్కరికే పాల్గొనే అవకాశం దక్కింది. ఇది తనకు అరుదైన గౌరవమని, ఈ సందర్భంగా కేటీఆర్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ”ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్‌ మాధ్యమాల ద్వారానే అందజేస్తున్నాం. డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సంక్షేమ పథకాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల విధానం అమలు చేస్తున్నాం. అన్ని దృవీకరణ పత్రాలు డిజిటలీకరించాం. గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తాం’ అని కేటీఆర్‌ చెప్పారు. ”తెలంగాణ రాష్ట్రమంతటికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. దానిని ఆసరాగా చేసుకొని ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటింటికీ కేబుల్‌ సౌకర్యం కల్పించడానికి ‘ఫైబర్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టు చేపట్టాం. దీని ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది” అని కేటీఆర్‌ వివరించారు.

హ్యూలెట్‌ ప్యాకర్‌ (హెచ్‌ పి) సంస్ధ ఉపాద్యక్షులు అనా పిన్కుజుక్‌ తో సమావేశం అయ్యరు. హెచ్‌ పి మరియు టి హబ్‌ ల భాగాస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్ని మంత్రి పిన్యూజుక్‌ ను కోరారు. దీంతోపాటు హైదరాబాద్‌ నగరంలో హెచ్‌ పి కార్యాకలాపాలను విస్తరించాలని విజప్తి చేశారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో సర్కూలర్‌ అవార్డు గెలుచుకున్న టిహబ్‌ సంస్ధ బనయన్‌ నేషన్‌ సహా వ్యవస్ధాపకుడు మని వాజిపేయ్‌ మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కెటి రామరావు మని బృందానికి అభినందనలు తెలిపారు. టి హబ్‌ సంస్ధకు ప్రపంచ గుర్తింపు దక్కడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

వరంగల్‌ నగరంలో టెక్‌మహేంద్ర
ఆ మరుసటిరోజు దావోస్లో మహీంద్ర గ్రూపు చైర్మన్‌ అనంద్‌ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరారు. పలు నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. ముఖ్యంగా వరంగల్‌ పట్టణంలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించాలన్న మంత్రి విజప్తిని అనంద్‌ మహీంద్ర, టెక్‌ మహీంద్ర కంపెనీ సియివో సిపి గుర్నానీలు అంగీకరించారు. వరంగల్‌ పట్టణంలో ఒక టెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ముందుగా 500 మందితో ఈ సెంటర్‌ ఎర్పడుతుందని, భవిష్యత్తులో విస్తరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండవ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమను తీసుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా వరంగల్‌ పట్టణంలో ఉన్న అవకాశాలు, టాలెంట్‌ పూల్‌ వంటి అంశాలను మంత్రి వివరించారు. మహీంద్ర సంస్ధ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమలను తీసుకెళ్లడంలో ప్రేరకంగా పనిచేస్తుందని, అనంద్‌ మహీంద్రకు, సిపి గుర్నానిలకు ధన్యవాదాలు తెలిపారు.

ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీ లో జరిగే అతిపెద్ద స్టార్ట్‌ అప్‌ అండ్‌ టెక్‌ ఈవెంట్‌ ను స్లష్‌ (ూకూఖూన) ఈ సారి నగరానికి తీసుకొస్తామని హమీ ఇచ్చారు. టి హబ్‌ ద్వారా నగరం ఇప్పటికే దేశ స్టార్ట్‌ అప్‌ కేపిటల్‌ ఉన్నదని, ఈ కార్యక్రమం నగర స్టార్ట్‌ అప్‌ ఈకో సిస్టమ్‌ కు గొప్ప ఊతం ఇస్తుందని మంత్రి తెలిపారు. త్వరలోనే అనంద్‌ మహీంద్ర తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ రావును కలువనున్నారు.

ఆ తర్వాత సిఏ సంస్ధ, గ్లోబల్‌ సియివో మైక్‌ గ్రెగోరీతో మంత్రి సమావేశం అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, నగరంలో తమ కంపెనీ వృద్ధి పట్ల తాము పూర్తి సంతృప్తికరంగా ఉన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌ నగరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి విజప్తికి గ్రెగరీ సానుకూలంగా స్పందించారు.
tsmagazine
ఫైజర్‌ వాక్సిన్‌ అధ్యక్షురాలు సుసాన్‌ సిలబెర్మన్‌ తో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సినేషన్‌ మ్యాన్యూఫాక్చరింగ్‌ హబ్బుల్లో ఒకటిగా ఉందని, దాదాపు 25 శాతం ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారు అవుతున్నాయని సుసాన్‌ కు తెలిపారు. నగరంలో ఉన్న జినోమ్‌ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మసీటీల గురించి వివరించారు. ఫైజర్‌ సంస్ధ వాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఎర్పాటు చేయాని కోరారు. ఇందుకోసం అవసరమై అధ్యయనానికి ఫైజర్‌ బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు.

ఎయిరో స్సేస్‌ దిగ్గజం లాక్‌ హీడ్‌ మార్టిన్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ అంబ్రోస్‌ సమావేశం అయ్యారు. సంస్ధ ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో టాటాల భాగస్వామ్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తోందని, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ స్పేస్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరం అయిన ఈకో సిస్టమ్‌ ఉందని తెలిపారు. ఈ రంగంలో ఉన్న ఎయిరోస్సేస్‌ పార్కులు, మార్స్‌ అర్బిటర్‌ ప్రయోగంలో హైదరాబాద్‌ యంయస్‌ యంఈల భాగస్వామ్యం వంటి అంశాలను మంత్రి వివరించారు. బల్గేరియా టూరిజం శాఖ మంత్రి నికోలినా అంగేల్‌ కోవాతో మంత్రి సమావేశం అయ్యారు. ఇరు ప్రాంతాల మద్య స్టార్ట్‌ అప్‌ , ఇన్నోవేషన్‌, టూరిజం రంగాల్లో ప్రొమోషన్‌ పైన చర్చించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ప్యానెళ్ల తయారీ సంస్ధ ట్రినా సోలార్‌ ఉపాద్యక్షులు రొంగ్‌ ఫాంగ్‌ యిన్‌, ఫీలీప్స్‌ సంస్ద ప్రతినిధులు, అబ్రాజ్‌ గ్రూపు మేజేజింగ్‌ పార్టనర్‌ కీటో డి బోయర్‌ లతో పాటు పలు కంపెనీలతో మంత్రి సమావేశం అయ్యారు. పారిశ్రామిక దిగ్గజాలను దావోస్‌ సదస్సులో కలిసారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ , అదాని గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదాని, బజాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌, హీరో మోటో కార్ప్‌ సియివో పవన్‌ ముంజాల్‌, ఉదయ్‌ కోటక్‌, వెల్‌ స్పన్‌ గ్రూపు చైర్మన్‌ బికె గోయెంకా, కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ వంటి ప్రముఖులను మంత్రి కలిశారు. ఇన్వెస్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘భారత్‌లో పరిశోధన, అభివృద్ధి విస్తరణ’ అంశంపై జరిగిన మరో సదస్సులో కూడా మంత్రి ప్రసంగించారు.
tsmagazine
కేంద్రకార్యదర్శి అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక ఆలోచనలు అభినందనీయమని కేంద్ర పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ అన్నారు. తెలంగాణ మాదిరే అన్ని దేశాలు మేధో హక్కుల పరిరక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు.

కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభుతో భేటీ: సదస్సుకు హాజరైన కేంద్ర పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభుతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వివిధ పథకాల కింద సాయం తదితర అంశాల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణలోని ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం కేటీఆర్‌ ప్రముఖ పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఛైర్మన్‌ తులసి తంతితో సమావేశమయ్యారు. తెలంగాణలో పవన్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని తులసితంతి చెప్పారు. దావోస్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు.

Other Updates