dasariధురమైన పాటల దండ దాశరథి సినిమా పాటలు పుస్తకం. సినిమా మాధ్యమం ఆబాల గోపాలానికి అందుబాటులో వుండే గొప్ప సాధనం. ఆ సాధన మాధ్యమం ద్వారా ఏది అందించినా కోట్లాది మందికి చేరువవు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మహాకవి దాశరథి రాసిన సినీపాటలు జన బాహుళ్యంలోకి వెళ్ళి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని కూర్చున్నాయి. దాశరథి రచనా మాధుర్యం మంత్ర ముగ్దుల్ని చేసే పాటలు. అవి ప్రేక్షకుల నాలుకల్లో నర్తిస్తునే ఉంటాయనడంలో అనుమానం వుండదు.

అసలు దాశరథి అన్నపేరు విన్నంతనే చాలు ఆణిముత్యాల్లాంటి పాటలు మనముందు వచ్చి మనల్ని గిలిగింతలు పెడతాయి.

గోదారి గట్టుంది.. గట్టుమీద సెట్టుందీ

నన్ను వదలి నీవు పోలేవులే

చిలిపి నవ్వుల నిను చూడగానే

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

బాబూ వినరా.. అన్నాదమ్ములాకథ ఒకటి

నీవెవరో.. నీలో నాలో నిజమెవరో

గోరింక గూటి చేరావు చిలకా

తల్లివి నీవే తండ్రివి నీవే

మమ్ములాలించు పాలించవా దేవా

పాపాయి నవ్వితే మల్లెపూలు

మొదలైన 123 పాటల దండ ఈ పుస్తకం. సంకలన కర్త .ప్రభాకర్‌ ఏర్చి కూర్చి అల్లారు. ఎంతో చక్కని పాటలతో ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం ఓ చల్లని లోగిలి వంటిది. గాయకులకు, ఔత్సాహికులకు బంగారు కోవెల వంటిదని చెప్పవచ్చు. రసానుబంధాలు పెనవేసుకున్న అనేక పాటలు గాయనీ గాయకులు చక్కగా పాడుకోవడానికి ఎంతో వీలుగా వుంది.

ప్రతిపాట తాలూకు పూర్తి వివరాలు ఇందులో పొందుపరచడం ఎంతో ఉపయోగకరం అని చెప్పవచ్చు. నిర్మాణ సంస్థపేరు, చిత్రం పేరు, సంవత్సరం, రచయిత పేరు, సంగీత దర్శకునిపేరు, గానం చేసిన గాయనీ గాయకుల పేర్లు ప్రతి పాటకు వుండటం వల్ల రిసెర్చ్‌ చేసే వారికి ఓ చక్కని రిఫరెన్స్‌ పుస్తకంగా ఉపయోగపడుతుంది. ఇది ఓ హస్త భూషణం అని చెప్పవచ్చు.

మొదట్లో పలువురి ముందుమాటలు, అంకితంతో పాటు చివరిపేజీల్లో దాశరథి గురించి పూర్తి వివరాలు పొందు పరచడం ద్వారా వారి విశేషాల సమాచారం చక్కగా తెలుస్తుంది. దాశరథి కృష్ణమాచార్య నవ్వుతున్న ఫోటో మౌనవ్రతం రంగాల్లో ముద్రించారు.

Other Updates