నాటిప్రతాపరుద్రుడిల నాటగతెల్గుపతాక, ఇప్పుడీ
నాటమరొక్కమారికపునర్జననంబయి ”చంద్రశేఖరుం”
డౌటనిజంబు! కానియెడ, ఆతడొనర్చు తెలుంగుసత్సభల్‌
పాటవమెట్లుచాటునుప్రపంచమునన్‌ బహుళార్థకీర్తితో?

ఎప్పుడొక్రీస్తుపూర్వమున ఈ తెలగాణ మహాధరిత్రిపై
అప్పటినామధేయమగు ”అశ్మకదేశము”నందుపుట్టియున్‌,
మెప్పునుపొందెడిన్తెలుగు మేలిమిభాషగవిశ్వమెల్లటన్‌ –
గొప్పగచాటగా జరుపుకొంటిమిగా దెజగన్మహాసభల్‌!

ఎంత కవిత్వముపారెను –
ఎంతెంతగలోతుచర్చలెన్నియొజరిగెన్‌
సంతత మైదుదినములు! ని
రంతరముశతావధాన రసముస్రవించెన్‌!

ఒకటఘనసాహితీ, సాంస్కృతికపు చిందు –
ఒకటతెలగాణమధురవంటకపువిందు –
ఒకటవజ్రవాహనప్రయాణికులకందు!
సందడేసందడి తెలుగుసభలయందు!!

లెక్కకుమించియున్జనులు లీలతెలుంగుమహాసభల్గనన్‌ –
”ఇక్కడ ఈ సభింక, మరిఎక్కడ ఆ సభ?” యంచు, మేనికిన్‌
రెక్కలుగట్టుకొంచు పలురీతులవేదికలన్నిజేరుచున్‌
మిక్కిలిసంతసంబున అమేయజయంబునుగూర్చినారహో!

డా. ఆచార్య ఫణీంద్ర

Other Updates