Untitled-2పార్లమెంట్‌ సాక్షిగా కోట్లాది ప్రజల చిరకాల ఆకాంక్ష ‘తెలంగాణా రాష్ట్రం’ అవతరించి నట్లుగానే, అదే పార్లమెంట్‌ భవనం సాక్షిగా 29వ రాష్ట్రంగా తెలంగాణా, దేశ రాజధాని ఢల్లీిలో బోనమెత్తింది. జనతంత్ర ఉత్సవంలో, 66వ గణతంత్ర దినోత్సవ సంబురాల్లో జనవరి,26, 2015న రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన తెలంగాణా శకటాన్ని దేశ రాష్ట్రపతి, దేశ ప్రధాని, ఆత్మీయ అతిథి(అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి)తో సహా 19దేశాల ప్రముఖులు, త్రివిధ దళాధిపతులు, కేంద్రమంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ఉన్నతాధికారులతోపాటు
రాజ్‌పథ్‌కు ఇరువైపులా గుమిగూడిన లక్షలాది జనం ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా బోనాల పండుగను చాటేలా రూపుదిద్దుకున్న ఈ శకటంతో పాటూ 25 మంది కళాకారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గోల్కొండకోట, దాని ముందు గోల్కొండ నవాబు సాక్షిగా ఇద్దరు బోనమెత్తిన మహిళల ప్రతిమలు, దీనితో పాటూ శకటం వెంట ఘటం, తొట్టెలతో, కొమ్ము, డప్పు వాయిద్యాల లయ బద్ధ సంగీతానికి అనుగుణంగా పోతురాజు, శివసత్తుల చిందులతో, జై తెలంగాణా నినాదాలతో ఆద్యంతం ప్రజలను ఆకట్టుకున్నది.
భిన్నత్వంలో ఏకత్వంగా అత్యంత వైభవంగా రాజ్‌పథ్‌లో సాగిన వేడుకల్లో తెలంగాణా కూడా ఒక రాష్ట్రంగా తొలిసారి పాల్గొనడం తెలంగాణా బిడ్డలను పులకరింపచేసింది.
పార్లమెంటు విజయ్‌చౌక్‌ నుంచి సాగిన తెలంగాణ శకటం, కళాకారుల ప్రదర్శన ఇండియాగేట్‌ మీదుగా లాల్‌ఖిల్లా వరకు సాగింది. దారిపొడవునా తెలంగాణ శకట ప్రదర్శనకి అపూర్వ ప్రశంసలు లభించాయి. ఈ మార్గంలో ఇరువైపులా నిలిచివున్న ప్రజలు, సాయుధదళాల అధికారుల నుంచి కరతాళధ్వనులు మిన్నుముట్టడంతో కళాకారుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. ఇతర వేడుకలతో పాటూ ఢల్లీిలోని అమరవీరుల స్మారక చిహ్నానికి ప్రముఖులు నివాళులర్పించే దృశ్యాలను టివిల్లో చూస్తున్న ప్రజలు తెలంగాణ ఆవిర్భావానికి కారకులయిన ఉద్యమనేతల త్యాగాలను, బలిదానాలను చెమ్మగిల్లిన కళ్ళతో మౌనంగా స్మరించుకున్నారు.
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేందుకు తెలంగాణ కళాకారులు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితర ప్రముఖుల ముందు తమ కళాకౌశలాన్ని ప్రదర్శించారు.
ఇందుకు ముగ్దులైన ప్రధాని నరేంద్రమోదీ, రక్షణశాఖామంత్రి మనోహర్‌ పారికర్‌లు కళాకారుల చెంతకువచ్చి, వారిని అభినందించడమేగాక, వారితో కలిసి ఫొటో కూడా దిగారు. తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి దేశ రాజధానికి తరలివచ్చిన ఈ కళాకారులు ఇందరు ప్రముఖులముందు ప్రదర్శన నిర్వహించడం వారి జీవితాలలో మరచిపోలేని సంఘటనగా మిగిలిపోతుంది.
దేశ ప్రముఖులముందు ప్రదర్శన ఇవ్వడం గర్వంగా ఉన్నదని భారత్‌ గ్రూప్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ రాఘవరాజ్‌ భట్‌ తెలిపారు. తెలంగాణా ప్రజలకు గర్వకారణంగా మిగిలిన ఇంతటి మధురానుభూతులకు కారకులు పార్లమెంటు సభ్యులు జితేందర్‌ రెడ్డి, కవితలు. వారు చూపిన చొరవతో ఆఖరి నిమిషంలో మనకు అనుమతి లభించింది. దీనికి ముందు అసలు ఈ ఆలోచనకు స్ఫూర్తి, రూపం ఇచ్చినవారు ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి కాగా, ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నా, నిరాశ చెందకుండా బండిని ముందుకు నడిపిన వారు సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్‌ డాక్టర్‌ చంద్రవదన్‌.
‘దక్కనీ తెప్‌ాజీబ్‌’ పేరిట బోనాలతో పాటూ తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను సవివరంగా ఆంగ్లంలో, రంగులతో ఆకర్షణీయంగా ముద్రించిన ఒక చిన్న పుస్తకాన్ని ఢల్లీి ఉత్సవాల్లో పాల్గొన్న దేశ, విదేశీ ప్రముఖులందరికీ ఈ సందర్భంగా పంచిపెట్టడం జరిగింది.

Other Updates