బీ. శైలజ (ఎం.డి. వికలాంగుల కార్పోరేషన్)
దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. మొదటినుంచీ దివ్యాంగుల సంక్షేమానికి పభుత్వం పెద్దపీట వేసింది. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. పింఛన్లతో ఆదుకున్న సీేఆర్ సర్కారు… వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు చేయూతనిచ్చారు. ఈసారి దివ్యాంగుల సంక్షేమ కోసం కోట్లు వెచ్చించిన సర్కారు… మరిన్ని పథకాలను తీసుకువస్తోంది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 93 కోట్లు టాేయించింది.
తొలిసారిగా భారీగా…
తొలిసారిగా వికలాంగుల సహకార సంస్థ నుంచి దివ్యాంగులకు చేయూతనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా రూ. 7.84 కోట్లు వెచ్చించి దివ్యాంగులకు వివిధ పథకాలను వర్తింప చేస్తున్నారు. ముందుగా 500 మంది దివ్యాంగులకు మోటరు సైకిళ్లను కొనుగోలు చేశాం. డిగ్రీ, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు తొలి పాధాన్యతగా వాహనాలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి జిల్లాల వారీగా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశాం. కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు తక్కువగా ఉండటంతో… ఎక్కువగా ఉన్న జిల్లాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఫ్లోరైడ్ కారణంగా దివ్యాంగులుగా మారుతున్న నల్గొండ జిల్లాకు ఎక్కువగా టాేయించాం. రూ. 3.48 కోట్లతో దివ్యాంగులకు వంద శాతం సబ్సిడీతో 500 వాహనాలను కొన్నాం. పూర్తి సబ్సిడీతో దివ్యాంగులకు వాహనాలను అందిస్తున్న పభుత్వం మాదే. గతంలో 20 నుంచి 30 శాతం సబ్సిడీతో ఇచ్చేవారు. దానికి బ్యాంకులతో లింకు పెట్టేవారు. బ్యాంకు నుంచి ఒ చెప్తేనే… మంజూరు చేసేవారు. కానీ.. ఈసారి మాతం పూర్తిస్థాయిలో సబ్సిడీతో వాహనాలను అందించాం. మరో రూ. 25 లక్షలతో బ్యాటరీ వీల్‌ఛైర్లు, 400 ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నాం. అదే విధంగా దివ్యాంగ విద్యార్థులకు 200 లాప్‌టాప్‌లు, 500 వినికిడి పరికరాలు, దివ్యాంగుల విద్యార్థుల కోసం రూ. 1.36 కోట్లతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేశాం. వీటిని విడుతల వారీగా జిల్లాల్లో పంపిణీ చేస్తున్నాం.
ఉపకారణాల పంపిణీ
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 28న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పండుగ వాతావరణంలో నిర్వహించాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ¬ం శాఖ మంతి నాయిని నర్సింహారెడ్డి, మంతులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ తిేరెడ్డి వాసుదేవారెడ్డి, ఛైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజర్ సుశీలారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ ఎండీ బీ. శైలజా, కార్యదర్శి జగదీశ్వర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ, దివ్యాంగులకు తిచక్ర వాహనాలను ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవారెడ్డి చాలా కష్టపడుతున్నాడని అభినందించారు. అనంతరం ¬ం మంతి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఏదైనా చేయాలంటే దివ్యాంగుల చేయాలని, సీఎం సీేఆర్ దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడ్తున్నారన్నారు. దివ్యాంగులకు తెలివి ఎక్కువగా ఉంటుందని, వారికి పోత్సాహం అందిస్తే విజయాలు సాధిస్తారన్నారు.
మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి తెలంగాణ సర్కారు అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలను 100 శాతం ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం మనదేనని, ప్రస్తుతం డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని, రెండో విడుతలో నిరుద్యోగులకు ూడా అందిస్తామన్నారు. వికలాంగులకు గతంలో 3 శాతం మాతమే రిజర్వేషన్లు ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం 5 శాతానికి పెంచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో దివ్యాంగులకు మొదటి పాధాన్యత ఇస్తామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ దివ్యాంగులు ఏదైనా చేయాలంటే ప్రభుత్వం అండగా ఉంటుందని, బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తామన్నారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులను భాగస్వామ్యం చేస్తామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు చేూర్చి దివ్యాంగులకు అండగా ఉంటామని ప్రకటించారు.