టీఎస్ ఐ ఐ సీ మరియు జిహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టిన రూ.220 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం పరిశ్రమల , ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐ ఐ సీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీలు కొండా విష్వేశ్వేర్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూ డి గాంధీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, టీఎస్ ఐ ఐ సీ ఎండీ ఈ వి నర్సింహ రెడ్డి, సీఈ లక్షింకాంత్ రెడ్డి, జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాబ్లీహిల్స్ నుండి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి వరకు దుర్గం చెరువు మీదుగా రూ.184 కోట్లతో నిర్మించే తీగల వంతెన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చులో టీఎస్ ఐ ఐ సీ, జీహెచ్ ఎంసీ చెరి సగం భరించనున్నాయి. ఆలాగే రూ.2 కోట్లతో చేపట్టే దుర్గం చెరువు సుందరీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం గచ్చిబౌలిలో ని బయో డైవర్సిటీ వెనుక వైపు రోడ్డు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి టీఎస్ ఐ ఐ సీ రూ.16 కోట్లు వ్యయం చేస్తోంది. అలాగే గౌలిదొడ్డి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుండి గోపన్ పల్లి వరకు రూ.18 కోట్లతో చేపట్టిన రోడ్డు ఆధునీకరణ పనులకు మంత్రి కేటీఆర్, మహేంద్ర రెడ్డి, టీఎస్ ఐ ఐ సీ చైర్మన్ బాలమల్లు శంకుస్థాపన చేశారు.
హోం
»