ts governer”శాసనమండలి, శాసనసభ సమావేశాలలో జరగబోయే చర్చలు అర్థవంతంగా, ప్రజల నమ్మకాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నిలబెట్టుకునేలా ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటాయని ఆశిస్తున్నాను.భారతదేశంలోనే నూతన రాష్ట్రమైన తెలంగాణ శీఘ్రంగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన అనేక వినూత్న చర్యలను చేపట్టింది. దేశమంతటా గుర్తింపును పొందింది”.అని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రశంసించారు.

(బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి మార్చి 10న రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నర్సింహన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు)

గత ముప్పది మూడు నెలలుగా అనేక రంగాలలో నా ప్రభుత్వం చేపట్టిన అనేక క్రియాత్మక చర్యల ఫలితాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరా, మిషన్‌ కాకతీయ ద్వారా చిన్నతరహా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, మిషన్‌ భగీరథ ద్వారా గృహాలకు త్రాగునీటి సరఫరా, సులభతర వాణిజ్య విధానంలో మొట్టమొదటి స్థానం పొందడం ఈ ఫలితాలకు కొన్ని ఉదాహరణలు.

ప్రజాహిత పరిపాలక సంస్కరణలను ప్రారంభించాలనే ఉద్దేశంతో నా ప్రభుత్వం గత సంవత్సరం దసరా శుభదినాన 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం జిల్లాల సంఖ్యను 31కి పెంచింది. నూతన జిల్లాలతోపాటుగా, 25 నూతన రెవిన్యూ డివిజన్లు, 125 నూతన మండలాలు, 5 నూతన పోలీస్‌ కమిషనరేట్లు, 23 నూతన పోలీసు సబ్‌ డివిజన్లు, 28 సర్కిల్‌ కార్యాలయాలు, 94 నూతన పోలీసు స్టేషన్లను ూడా ఈ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయడమయింది. ‘మీ జిల్లాను తెలుసుకోండి-మీ జిల్లాను ప్రణాళీకరించండి’ అనే ఉద్దేశంలో భాగంగా జిల్లా యంత్రాంగం సూక్ష్మస్థాయి ప్రణాళికద్వారా అనేక జిల్లా నిర్ధిష్ట అభివృద్ధి వ్యూహాలను చేపట్టిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

నూతనరాష్ట్ర ఆవిర్భావంనుండి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరగుదలలో గణనీయమైన వృద్ధి జరిగిందని గుర్తించడం అత్యంత సంతృప్తినిస్తున్నది. 2016-17 ముందస్తు అంచనాల ప్రకారం, 11.5 శాతం అఖిలభారత అంచనా వృద్ధి రేటుతో పోల్చితే ప్రస్తుత ధరలకు జీఎస్‌డీపీ 13.7 శాతం చెప్పుకోదగ్గ పురోభివృద్ధి చెందే అవకాశమున్నది. 2011-12 సుస్థిర ధరల ప్రకారం, 7.1 శాతం ప్రతిపాదిత జాతీయ వృద్ధి రేటుకుగాను 10.1 శాతంగా వృద్ధి నమోదైంది.

ముందస్తు అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరలకు 2016-17లో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి రూ. 6.54 లక్షల కోట్లుగా వుంటుందని అంచనా వేయడమయింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు చేరివున్న ప్రాథమికరంగం అనుూల వర్షాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేపట్టిన క్రియాశీలక చర్యలవల్ల 17.2 శాతం పురోభివృద్ధిని నమోదుచేసే అవకాశం ఉంది. ఈ రంగానికి సంబంధించి 9 శాతంగా ఉన్న అఖిలభారత వృద్ధి రేటుకంటే ఈ వృద్ధి అత్యధికంగా వుంది. పరిశ్రమలు, తయారీరంగం చేరివున్న మాధ్యమిక రంగానికి సంబంధించి 8.7 శాతంగా ఉన్న అఖిల భారత వృద్ధి రేటు కంటే ఎక్కువగా 9.8 శాతానికి పెరిగే అవకాశం వుంది. 11.9 శాతం అఖిలభారత వృద్ధి రేటుతో పోల్చితే సేవారంగం 14.6 శాతానికి వృద్ధి చెందే అవకాశం వుంది.

ఇంధనరంగంలో అనేక ఏండ్ల నిర్లక్ష్యాన్ని అంతం చేస్తూ నూతన రాష్ట్ర ఏర్పాటు నూతన అధ్యాయానికి నాంది పలికింది. విద్యుత్తు కోతలను అధిగమించి, నిరంతర విద్యుత్తు సరఫరా అందేలా చేయడమే గత 33 నెలలుగా ఈ రంగంలో సాధించిన అత్యంత చెప్పుకోదగ్గ విజయం.

విద్యుత్తుతో నడిచే వ్యవసాయ పంపు సెట్‌లపై తెలంగాణ రైతులు అత్యధికంగా ఆధారపడి ఉన్నారు. గతంలో లో-ఓల్టేజీ సమస్యలతో వ్యవసాయానికి రోజుకు అతికష్టంగా నాలుగైదు గంటలు కరెంటు ఇచ్చేవారు. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి. సమయానికి నీరందక పంటలు ఎండిపోయేవి. ఈ కష్టాలు కడగండ్లతో తెలంగాణ రైతాంగం పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు వవర్‌ హాలిడేలు, గృహ, వాణిజ్య అవసరాలకు నాలుగు నుంచి ఎనిమిది గంటలు మించిన విద్యుత్తు కోతలతో ప్రభావితమయ్యాయి.

నా ప్రభుత్వం, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రణాళికబద్ధమైన, సమన్వయ, సంఘటిత చర్యలు తీసుకుని ఈ సంక్షోభాన్ని అధిగమించింది. కరెంటు కోతలకు కాలం చెల్లించి. నా ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. తత్ఫలితంగా, ఈ ఏడాది రబీలో (యాసంగి) ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. దిగుబడి అధికంగా వచ్చి ధాన్యరాశులతో మార్కెట్‌యార్డులు కళకళలాడుతున్నాయి. విద్యుత్తు మిగులు రాష్ట్రంగా చేస్తూ పవర్‌హాలీడేల స్థానే పవర్‌ ఎవ్రీ డే, ఎనీ టైవ్‌ుగా చేయడమే ఉద్దేశ్యం.

ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ 9500 నుంచి 10వేల మెగావాట్లకు చేరుతుందని ఆశించినప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేసేందుకు సంబంధిత ఏజెన్సీలు సంసిద్ధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి స్థాపక ఉత్పాదక సామర్థ్యం 6574 మెగావాట్లు. నా ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో అదనంగా 4190 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సమూర్చింది. ఈ ఏడాది చివరి వరకు మరో 4130 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని చేూర్చుతుంది. తద్వారా రాబోయే మూడేళ్లలో, మొత్తం 16,306 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది.

తెలంగాణ నూతన రాష్ట్రమైనప్పటికీ సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నది. సింగిల్‌ విండో వితౌట్‌ గ్రిల్స్‌ అనే ప్రసిద్ధి చెందిన వినూత్న విధానం ద్వారా నా ప్రభుత్వం 15 రోజులలో అనుమతులను ఇచ్చే శాసనాధికారంతో పెట్టుబడిదారు అనుూల పారిశ్రామిక విధానమైన టీఎస్‌ఐపాస్‌ చట్టాన్ని రూపొందించింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బంగారు బాటలు వేసింది.

ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అపూర్వమైన పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతున్నాయి. రెండు లక్షల ఇరవైవేల మందికి ఉద్యోగావకాశాల సామర్థ్యంతో 3,451 పరిశ్రమలద్వారా దాదాపు 54వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి.

సర్వీసు రంగం ఇటీవలి దశాబ్దాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అభివృద్ధి సాధనంగా రూపొందుతున్నది. పారిశ్రామిక-అనుూల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలవల్ల రాష్ట్రంలో అనేక ఐటి/ఐటిఇఎస్‌ యూనిట్లు వచ్చాయి. దేశంలోని ఐటీ ఎగుమతులలో రాష్ట్రం దాదాపు 12 శాతం వాటా కలిగివుంది. దేశంలోని ఐటీ రంగంనుండి వస్తున్న మొత్తం ఆదాయంలో హైదరాబాదు రెండవ స్థానాన్ని పొందింది. 2015-16లో రాష్ట్రం నుండి ఐటీ ఎగుమతుల విలువ రూ. 75,070 కోట్లు. ఈ రంగం నాలుగు లక్షల మందికి పైగా నేరుగా ఉపాధులను సమూరుస్తున్నది.

నా ప్రభుత్వం, ఐసిటి పాలసీ, ఎలక్ట్రానిక్‌ పాలసీ, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ పరిశ్రమ నిమిత్తం ఇమేజ్‌ పాలసీ, వినూత్న పాలసీ, గ్రామీణ సాంతిేక పాలసీ, డేటా ంద్రాల పాలసీ, ఓపెన్‌ డేటా పాలసీ, సైబర్‌ భద్రతా పాలసీ, డేటా అనలిటిక్‌ పాలసీలను ప్రకటించింది. ఈరంగంలో మన పూర్వ వైభవాన్ని ఈ పాలసీలు తీసుకువస్తాయి.

టి-హబ్‌ ఏర్పాటులో అసాధారణ విజయాలను సాధించిన తర్వాత నా ప్రభుత్వం 3.5 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రదేశంతో టి.హబ్‌ రెండవ దశను అభివృద్ధి చేసేందుకు ప్రణా ళికను రూపొందించింది. దాదాపు 4000మంది ఐటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం ఇంక్యుబేషన్‌ స్థలాన్ని టి-హబ్‌ సమూర్చుతుంది.

సామాజిక ప్రజాస్వామ్యం పునాదిపైనే రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అని డాక్టర్‌ అంబేద్కర్‌ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయాన్ని సాధించడానికి వీలుగా పేద, వెనుకబడిన వారిపై నా ప్రభుత్వం దృష్టిని ంద్రీకరిస్తున్నది.

సంక్షేమంలో అగ్రగామి

నిస్సహాయులకు, నిరుపేదలకు సామాజిక భద్రత చేూర్చే సమగ్ర సంక్షేమ చర్యలను నా ప్రభుత్వం చేపట్టింది. అభివృద్ధి ఫలాలు సుదూర ప్రాంతంలోని నిరుపేద కుటుంబానికి చేరినప్పుడే పరిపాలనకు సార్థకత అని నమ్మే నా ప్రభుత్వం అడుగడుగునా మానవీయత ప్రతిఫలించేలా అనేక సంక్షేమ చొరవలను ప్రారంభించింది. సంక్షేమ చర్యలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని తెలియజేయుటకు నేను సంతోషిస్తున్నాను.

గత విధానాలకు భిన్నంగా నా ప్రభుత్వం ఆసరా పథకం క్రింద పేదలకిచ్చే పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచింది. రాష్ట్రం ఏర్పడకముందు సామాజిక భద్రతా పింఛన్ల క్రింద 29 లక్షలమందికి పింఛన్లు మంజూరు చేస్తే, ఇప్పుడు నా ప్రభుత్వం ప్రారంభించిన పింఛను, సహాయ పథకాల క్రింద ప్రస్తుతం మొత్తం 36 లక్షలమంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. గతంలో వార్షిక వ్యయమైన 835 కోట్ల రూపాయలతో పోల్చుకుంటే, దీని నిమిత్తం ఇప్పుడు నా ప్రభుత్వం 4729 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. ఒంటరిగా జీవిస్తున్న స్త్రీల దుస్థితిని నివారించి వారు గౌరవప్రదంగా జీవించడానికి ప్రతీ నెలా వెయ్యి రూపాయల భృతిని అందించాలని ప్రభుత్వం మరో మానవీయ నిర్ణయాన్ని తీసుకున్నది.

రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా, ఎలాంటి ఆకలి చావులు లేకుండా చూడాలని నా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ సరఫరా పరిమాణాన్ని పెంచడం ద్వారా దీనిని సాధించడానికి ఆహార భద్రతా పథకాన్ని చెప్పుకోదగ్గ రీతిలో పటిష్టపరచడమైంది. కుటుంబ సభ్యులతో సంబంధంలేకుండా ప్రతీ వ్యక్తికి నాలుగునుండి ఆరు కిలోలకు బియ్యం సరఫరా సీలింగును పెంచడమైంది.

నా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకం క్రింద పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది.

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం ద్వారా వివాహంకాని పేద ఆడపిల్లలకు ఆర్థిక సహాయాన్ని నా ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకంవల్ల బాల్య వివాహాలు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గాయి.

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా నా ప్రభుత్వం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించింది.

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అమరులైన కుటుంబాలకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతోపాటు అట్టి ప్రతీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడమవుతున్నది.

వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు, జర్నలిస్టులకు, ¬ంగార్డులకు, గీత కార్మికులకు, మత్స్య కారులకు రూ. 5లక్షల ప్రమాద బీమా కల్పించింది.

నా ప్రభుత్వం పదవీ విరమణ చేసిన సైనిక సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి వుంది. వారికి, వారి వితంతువులకు రెండు పింఛను పథకాలను విస్తరించడం, గ్యాలంటరీ అవార్డు గ్రహీతలకు నగదు బహుమతులను గణనీయంగా పెంచడం, రాష్ట్ర, జిల్లాస్థాయి రెండింటిలో సైనిక సంక్షేమబోర్డులను పటిష్ఠ పరచడంవంటివి ఈ విషయంలో తీసుకుంటున్న కొన్ని చర్యలు.

ఉద్యోగి అనుకూల చర్యలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగులకోసం తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు మంజూరు, 43 శాతం ఫిట్‌మెంట్‌, హెల్త్‌కార్డులువంటి ఉద్యోగి అనుూల చర్యలను చేపట్టింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వరంగంలో ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి వుంది.

గతంలో చోటు చేసుకున్న వ్యవసాయ దుస్థితిని అధిగమిస్తూ రాష్ట్రంలో వ్యవసాయరంగం పునరుద్ధరణకు సిద్ధంగా వుంది. సాగునీటి ప్రాజెక్టులను చేర్చుతూ, చెరువులను పునరుద్ధరిస్తూ వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికోసం ఒక మహత్తర ప్రణాళికను నా ప్రభుత్వం ప్రారంభించింది.

రాష్ట్రంలో వ్యవసాయ నిల్వ సౌకర్యాల కొరత తీవ్రంగా ఉన్నదని తెలుసుకొని, నా ప్రభుత్వం నాబార్డు సహాయంతో 330 ప్రాంతాలలో 17,057 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు 138 గిడ్డంగులను పూర్తి చేయడమయింది.

వ్యవసాయరంగంలో అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి, ప్రతీ గ్రామీణ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలనే అంతిమ లక్ష్యంతో రాష్ట్రమంతటా విస్తరించిన ప్రధాన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటిగా, నా ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యాలను కల్పించి, స్థిరీకరించే పనిని చేపట్టింది. అపుడు మాత్రమే వ్యవసాయరంగంలో ప్రస్తుతమున్న అనావృష్టి పరిస్థితులు, దుస్థితి శాశ్వతంగా తొలగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశించడమైంది.

2017, జనవరి 31వ తేదీన ప్రారంభమైన భక్త రామదాసు ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని దాదాపు 58,958 ఎకరాలను సాగు చేయడానికి రూపొందించడమయింది. ఈ ప్రాజెక్టును 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేయడమయింది. ఇంతవరకు ఎండిపోయిన భూములలో ఇది భవిష్యత్తులో పుష్కలమైన పంటలకు మార్గాన్ని సుగమం చేసింది.

ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన మిషన్‌ కాకతీయ క్రింద గ్రామీణ ప్రాంతాలలో పర్యావరణ విధానాన్ని పునరుద్ధరింపజేసేందుకు వీలుగా 46,531 చెరువులను పునరుజ్జీవింపజేసి, పూర్వస్థితికి తీసుకురావడానికి నా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మన రాష్ట్రంలో 33 శాతం మేరకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు నా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘తెలంగాణకు హరితహారం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.

2015 జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం 15.86 కోట్ల మొక్కలను, రెండవ సంవత్సరం 40 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఈ సంవత్సరం 46 కోట్ల మొక్కలను నాటడానికి చర్యలు తీసుకోవడమవుతున్నది.

ఒక నిర్ధిష్ట విధానంగా రోడ్డు అభివృద్ధిని చేపట్టడమయింది. ఈ అభివృద్ధి నిర్వహణలో గతంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగి, రాకపోకలు మెరుగుపడతాయి.

రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి తగినన్ని నిధులు సాధించడంలో నా ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. గత ఏడు దశాబ్దాలుగా తెలంగాణాలో నిర్మించిన 2,527 కి.మీ. జాతీయ రహదారులకుగాను గత రెండున్నరేళ్లలో రాష్ట్రం 2872 కి.మీ. జాతీయ రహదారులను సాధించింది.

ఫలితంగా, జాతీయ రహదారుల మొత్తం పొడవు 5399 కి.మీ. పెరుగుతుంది. 3.81 కి.మీ. జాతీయ సగటుకుగాను రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు పొడవు 4.7కి.మీ.కు పెరిగింది.

2017 చివరినాటికి రాష్ట్రంలో ప్రతి గృహానికి రక్షిత త్రాగునీటిని సమూర్చేందుకు మిషన్‌భగీరథ వంటి బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నా ప్రభుత్వం కట్టుబడివుంది. రాబోయే మూడు దశాబ్దాలకు మొత్తం జనాభా నీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని ఈ బృహత్తర ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించడమయింది.

గౌరవనీయులైన ప్రధానమంత్రిగారు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని గత సంవత్సరం ఆగస్టులో గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో ప్రారంభించారు. ఈ ప్రధాన ప్రాజెక్టు నీతి ఆయోగ్‌, హడ్కో మరియు అనేక రాష్ట్రాలనుంచి ప్రశంసలు పొందింది.

నా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థనంతటిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం జీే నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యా వ్యవస్థను ప్రారంభించడమైంది. ఇందులో భాగంగా ఎస్సీలకోసం 103 నైవాసిక విద్యా సంస్థలను, ఎస్టీలకోసం 51 నైవాసిక పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మైనారిటీలకు మంజూరైన 200 నైవాసిక పాఠశాలల్లో, 71 నైవాసిక పాఠశాలలు ఇప్పటి పనిచేయడం ప్రారంభించాయి. రాబోయే విద్యా సంవత్సరంనుండి 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో వెనుకబడిన తరగతులకోసం నైవాసిక పాఠశాలలను ఏర్పాటు చేయడమవుతుంది. మొట్టమొదటిసారిగా, నా ప్రభుత్వం షెడ్యూల్డు కులాల మహిళలకోసం 30 నైవాసిక డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. వీటిలో 23 వైవాసిక డిగ్రీ కళాశాలలు ప్రారంభమయ్యాయి.

ప్రజారక్షణ, భద్రతలు నా ప్రభుత్వంయొక్క అత్యంత ప్రాధాన్యతా అంశాలు. ఈ విషయంలో రక్షణ, భద్రత కల్పించడం పెట్టుబడులను ఆకర్షించడంలో బహువిధ ప్రభావం వుంటుంది. నేరాలను నియంత్రించడానికి తమ ప్రయత్నాలలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ నైపుణ్యాలను నిరంతరంగా పెంపొందించు కుంటున్నారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానంలో ఆధునిక టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించడమవుతున్నది. ప్రజలకు రక్షణ, భద్రతను కల్పించడానికి ఆధునిక సాంతిేక పరిజ్ఞాన ఆధారిత కమాండ్‌, కంట్రోల్‌ ంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. షీ టీములను నియోగించడమయింది. ఇవి మహిళలపై వేధింపులను నియంత్రించడంలో ఈవ్‌ టీజర్లకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తున్నాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సామాజిక ఆధారిత సాంప్రదాయక వృత్తులకు కొత్త రూపమివ్వడం ముఖ్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నా ప్రభుత్వం, గొర్రెల కాపరులు, మత్స్యకారులు, నేతకారులు, క్షురకులు, ఇతర చేతి వృత్తిదారుల కార్యకలాపాల పునరుద్ధరణకు ఒక పథకం నమూనాను (బ్లూప్రింట్‌) తయారుచేసింది.

చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల అమలు ఫలితంగా, రాష్ట్రంలోని మత్స్య పరిశ్రమ రంగం భారీగా అభివృద్ధి చెందింది.

వెనుకబడిన తరగతుల సమస్యలు, సామాజిక స్థాయిని పరిశీలించడానికి ఒక కమిషన్‌ను ూడా ఏర్పాటు చేయడమయింది. బాగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికోసం వారి కష్టాలను తొలగించేందుకు నా ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నది. ఆర్థిక సహకారం ద్వారా సామాజిక జీవన స్రవంతిలోకి ఈ తరగతుల సముద్ధరణకోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడమయింది.

పట్టణ ప్రాంతాలలో సుమారు 40 శాతం జనాభా నివసి స్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. హైదరాబాదును విశ్వ నగరంగా అభివృద్ధి చేయడానికి నా ప్రభుత్వం సంఘటిత చర్య లను చేపడుతున్నది. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ఈ సంవత్సరంలో పూర్తవుతుందని ఆశించడమయింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరా, మురుగు పారుదల, రవాణా, నిర్మాణ సౌకర్యాలు వంటి ప్రాథమిక సేవలస్థాయిని పెంచేందుకు నా ప్రభుత్వం కట్టుబడి వుంది.

ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి పర్యాటకంలో భారీ అవకా శాలు ఉన్నాయి. తెలంగాణాలో పర్యాటక ప్రాముఖ్యతను గుర్తిం చి, నా ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వివిధ క్రియాత్మక చర్యలను ప్రారంభించింది. రాష్ట్రం లో పర్యాటక తీర్థయాత్రలను అభివృద్ధిపరచడానికి నా ప్రభుత్వం మౌలిక సదుపాయాల స్థాయిని పెంచడం ద్వారా యాదాద్రి, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి, ధర్మపురి, బాసర, ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది.

2014లో నేను ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ ప్రభుత్వం రాజకీయ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకత సుపరిపాలన అందిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా మాటలు అక్షర సత్యాలుగా మారుస్తూ గడిచిన రెండున్నరేళ్లుగా అవినీతి రహిత పాలన సాగుతున్నది. మా ప్రభుత్వ ఒరవడి ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలపట్ల ప్రజల నమ్మకాన్ని పెంచుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

Other Updates