cm-kcrతెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తనాలరంగం గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తేవాలని, సాగులో దిగుబడు పెరిగేలా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధను చేయాలని ఆయన సూచించారు.

వ్యవసాయశాఖపై ఆగస్టు 4న సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యకార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ ప్రియదర్శిని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ జీవితం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నదని, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునికీ కరణ పెరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే విత్తనోత్పత్తికి తెలంగాణ  ప్రాంతం అత్యంత అనువైనదని, దీనిని రైతు భాగస్వామ్యంతో దేశ విత్తనాలరంగం గా మార్చాలని కెసిఆర్‌ చెప్పారు.

పంటలు పండిచడమే కాకుండా, పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన మార్కెటింగ్‌ ప్రణాళికను అవలంభించాలని సిఎం సూచించారు. ఈ విషయంలో నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ రైతు ఆదర్శమన్నారు.

కృష్ణా, గోదావరి నదుపై కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహిస్తామని, దానికి అనుగుణంగా ఎక్కడ ఏ పంటలు వేయాలని అధికారులు రైతుకు సూచించాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్‌తో సహా అన్ని పట్టణా పరిసరాలలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని అలాగే రాష్ట్రానికి అవసరమైన పాను దిగుమతి చేసుకొనే పరిస్థితి రాకుండా, ఉత్పత్తి పెంచాలని సిఎం సూచించారు.

Other Updates