thubప్రారంభోత్సవ సభలో రతన్‌ టాటా ప్రశంసల జల్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టి- హబ్‌ నవ భారతానికి నాంది అని ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సంస్థల గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రశంసించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐ.టి ప్రాంగణంలో నిర్మించిన టి-హబ్‌ భవనం కాటలిస్ట్‌ ను నవంబర్‌ 5న రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తో కలసి రతన్‌ టాటా ప్రారంభించారు.

రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె. తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రతన్‌ టాటా మాట్లాడుతూ, టి- హబ్‌ అద్భుత నిర్మాణమని , ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యువతను ఆకట్టుకొనే ఇంటీరియర్‌ డిజైన్లతో భవనాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు.

నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, సైంటిస్టులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. పరిశ్రమల స్థాపనకు కావల్సింది డాలర్లు కాదు. మంచి ఆలోచనలు వుంటే చాలు అని రతన్‌ టాటా అన్నారు. నవశకానికి ఈ టి- హబ్‌ నాందిగా నిలుస్తుందనే విశ్వాసం నాకుంది. ఈ- కామర్స్‌, లైఫ్‌ సైన్సె స్‌, మెడికల్‌, ఈ రిటైలింగ్‌ రంగాలలో ఇప్పుడు మంచి అవకాశాలు వున్నాయి. వీటిని ఒడిసిపట్టుకోవాలి. ప్రపంచ లీడర్లుగా ఎదగాలి. అని రతన్‌ టాటా అన్నారు.

”కొత్త ఆలోచనలతో ఓ ఉద్యోగి బాస్‌ వద్దకు వెళ్తాడు. బాస్‌ ఏమంటాడంటే, నువ్వు కాస్త అనుభవం సంపాదించిన తర్వాత నన్ను కలువు అంటాడు. లేదా, ఇంకా చాలా తెలుసుకోవాలని సలహా ఇస్తాడు. దాంతో ఈ ఉద్యోగి ఆలోచన ఆగిపోతుంది. అడుగు ముందుకు వేసేందుకు ఆర్థిక స్తోమతా వుండదు. కాబట్టి ఆ ఆవిష్కరణ అక్కడితో ముగిసిపోతుంది. ఇవాళ టి- హబ్‌ ద్వారా అలాంటి ప్రతిబంధకాలకు పరిష్కారం దొరికింది. ఇక్కడ ఆలోచనలతో వచ్చిన వారికి మార్గ దర్శనం చేసేందుకు మెంటర్లు ఉన్నారు. వెంచర్‌ క్యాపిటలిస్టులు సయితం రెడీగా వున్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకొని దూసుకు వెళ్ళాలి” అని రతన్‌ టాటా సూచించారు.

టి-హబ్‌ భవనంలోని అన్ని అంతస్తులను రతన్‌ టాటా పరిశీలించారు. ఈ కాటలిస్ట్‌ భవనాన్ని చూసిన తర్వాత, దేశం కొత్త కోణం వైపు చొరవ తీసుకుంటున్నదనే భావన కలిగింది. ఎంటర్‌ పెన్యూర్లు, ఇన్నోవేటర్లు, పారిశ్రామిక వేత్తలకు ఇదో గొప్ప అవకాశం. సాంకేతికత ఆలంబనగా చేసుకొని భవిష్యత్తులో కీలక భూమిక పోషించగల ఆవిష్కరణలకు ఈ టి- హబ్‌ ఒక వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైన స్టార్టప్స్‌ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో రతన్‌ టాటా ముచ్చటిస్తూ, కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన 17 నెలల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం టి- హబ్‌ వంటి గొప్ప ఆవిష్కరణను తేవడం అభినందనీయ మన్నారు. ఎన్నో మంచి లోచనలు ప్రోత్సాహం లేక కళాశాలల్లోనే ఆగిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్స్‌పల్స్‌ టి-హబ్‌ ను సందర్శించేలా చేసి, యువత ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. యువత ఆలోచనల నుంచి గొప్ప ఆవిష్కరణలను తెచ్చేందుకు టి-హబ్‌ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. టి- హబ్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌

నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్‌ మారుతోందని, ఇటువంటి ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టి- హబ్‌ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె. తారక రామారావు చెప్పారు.

కొత్తగా ఏర్పాటుచేసిన టి- హబ్‌ లో వినూత్న రీతిలో, డ్రోన్‌ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్నోఫెస్ట్‌ ను నవంబర్‌ 21న మంత్రి కె.టి ఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగాా ఆయన మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలకు చిరునామాగా టి- హబ్‌ ను ప్రారంభించిన నెలరోజుల్లోపే చక్కని కార్యక్రమానికి వేదిక కావడం సంతో షకరమన్నారు. ఇన్నోఫెస్ట్‌ లో జరిగిన ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరమైనవని అన్నారు.

ఇన్నోవేట్‌ , ఇంక్యుబేట్‌, ఇన్‌ కార్పోరేట్‌ అనే మంత్రాన్ని గుర్తుంచుకొని డిఫైన్‌, డిజైన్‌, డెలివరీ అనే అంశాలతో యువత ముందుకేళ్లాలని కె.టి.ఆర్‌ పిలుపు నిచ్చారు. ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చే అమెరికన్లు వాటిని ప్రజల్లోకి తీసుకొనివెళ్ళడానికి అవసరమైన ప్రచారానికి ప్రముఖ స్థానం కల్పిస్తారని, అందుకే వారి ఆవిష్కరణలు ప్రముఖంగా వుంటాయన్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులలో ఒకరు, ప్రముఖ ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ మోబన్‌ దాస్‌ పాయ్‌ మాట్లాడుతూ, టెక్నాలజీతో భవిష్యత్‌ ముఖచిత్రం మారనున్నదని అన్నారు. వేదిక్‌ స్కాలర్‌ సుదర్శన శర్మ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకంటే ముందు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం భీజాలు వున్నాయన్నారు.

స్టార్టప్‌లకు సరైన వేదిక తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివద్ధికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని మోహన్‌ దాస్‌ పాయ్‌ కితాబిచ్చారు.

గచ్చిబౌలిలోని టి-హబ్‌ కార్యాలయంలో నవంబర్‌ 21న రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె.తారక రామారావుతో మోహన్‌ దాస్‌ పాయ్‌ సమావేశమై తెలంగాణలో ఐ.టి పరిశ్రమ అభివ ద్ధిపై చర్చించారు. స్టార్టప్‌ల అభివద్ధికి తెలంగాణ రాష్ట్రంలో అనువైన వాతావరణ పరిస్థితులు వున్నందున, దేశంలోనే అత్యుత్తమ డిస్టినేషన్‌ గా మార్చేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పాటుచేసుకోవాలని మోహన్‌ దాస్‌ పాయ్‌ సూచించారు.

టి- హబ్‌ లోని సౌకర్యాలను, టి-హబ్‌ లక్ష్యాలను తెలుసుకున్న పాయ్‌ తెలంగాణ ప్రభుత్వ ముందుచూపును కొనియాడారు. సాంకేతిక రంగంలో పరిశోధనలు పెంచేందుకు ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు పాఠశాల స్థాయిలోనే ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టాలని పాయ్‌ సూచించారు. దేశంలో మంచి ఆలోచనలకి నిధులు పెట్టేందుకు వచ్చే సంస్థలు, వ్యక్తులకి కొదువ లేదని, భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇండియా ఆస్పిరేషన్‌ ఫండ్‌ సైతం నిధులు చేకూర్చేందుకు సిద్ధంగా వున్నదని ఆయన తెలిపారు. ఈ తరానికి యువకులే హీరోలు కావాలని, వారివిజయగాథలే పలువురికి స్ఫూర్తినిస్తాయని ఆయన తెలిపారు. యువకులకు సహకారం అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, వారికి ప్రోత్సాహం అందించే దిశగా టి- హబ్‌ ఏర్పాటుచేయడం గొప్ప ముందడుగని ఆయన అన్నారు.

గత 16 నెలలలో రాష్ట్రంలో ఐ.టి పరిశ్రమ అభివద్ధికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి కె. తారక రామారావు వివరించారు. పరిశోధనల కోసం టి- హబ్‌ ఏర్పాటుచేసి నల్సార్‌, ట్రిబుల్‌ ఐ.టి, వంటి అత్యుత్తమ సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో ముందుకుపోతున్నామన్నారు.

యువకులకు, విద్యార్థులకు దిశానిర్దేశం చేసి, ఉద్యోగులుగా మార్చేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్‌ (టాస్క్‌) ని ఏర్పాటుచేశామని మంత్రి కె.టి.ఆర్‌ తెలిపారు. వీటితోపాటు గేమ్‌ పార్క్‌ , డాటా ఎనాలిటిక్స్‌ పార్కుల రూపకల్పన విషయంలో చురుగ్గా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. మోహన్‌ దాస్‌ పాయ్‌ చేసిన సూచనలను తెలంగాణలో ఐ.టి పరిశ్రమ అభివ ద్ధికి వినియోగించు కుంటామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐ.టి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తోపాటు టి-హబ్‌ సిఇఓ కృష్ణన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రేట్‌ ఐడియా.. గవర్నర్‌

కొత్త రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే స్టార్టప్‌ ల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. నూతన ఒరవడికి టి- హబ్‌ నాందిగా నిలవాలని, లక్ష్యసాధనలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇక్కడ జరిగే ఆవిష్కరణలు ప్రజలకు మేలుచేసేవిగా వుండాలని, గ్రామీణ యువత నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేలా ద ష్టి సారించాల్సిన అవసరం వుందని అన్నారు.

”మంత్రి కె.తారక రామారావు మదిలో రూపుదిద్దుకున్న టి- హబ్‌ గ్రేట్‌ ఐడియా. ఇలాగే మిగతా మంత్రులు కూడా వినూత్నంగా ఆలోచించాలి ”అని గవర్నర్‌ అన్నారు.

స్టార్టప్‌ల రాజధాని హైదరాబాద్‌

హైదరాబాద్‌ను భారతదేశపు స్టార్టప్‌ల రాజధానిగా రూపొందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ సాంకేతిక సేవలను అందిస్తున్నారని, ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడగల సత్తా ఉన్నా, గర్వించదగిన ఎంటర్‌ పెన్యూర్లుగా ఎదగలేక పోతున్నారని ఆయన అన్నారు. అవకాశాలు లభిస్తే గూగుల్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, వంటి వాటిని కూడా మన భారతీయులు ఆవిష్కరించ గలరని , ఇప్పుడు టి- హబ్‌ ద్వారా ఆకల నిజం కాబోతున్నదని తారక రామారావు పేర్కొన్నారు.

”ఇది కేవలం ప్రారంభం మాత్రమే.టి హబ్‌ ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం తరఫున కావాల్సినవన్నీ చేస్తాం. హైదరాబాద్‌ ను స్టార్టప్‌ల రాజధానిగా తీర్చిదిద్దుతాం. టి-హబ్‌ ఒక్క తెలంగాణా వారికి మాత్రమే కాదు. భారతీయు లందరిదీ. ఢిల్లీ, బెంగళూరు, మీరట్‌..ఇలా అందరిదీ. అద్భుతమైన ఆలోచనలు వున్నవారికి అపరిమితమైన అవకాశాలను టి- హబ్‌ అందిస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకొని రాబోయే ఐ.టి విప్లవానికి హైదరాబాద్‌ ను వేదిక చేయాలి. ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు దేశంలో ప్రభుత్వ పరంగా కొత్త రాష్ట్ర మైనప్పటికీ తెలంగాణ చొరవ తీసుకొని టీ- హబ్‌ ను ఏర్పాటు చేసింది” అని మంత్రి కె.తారక రామారావు చెప్పారు.

టీ-హబ్‌ లో భాగస్వాములయ్యేందుకు ఇప్పటికే అమెరికా, యూరప్‌ల నుంచి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని, సా’ర్టప్‌ లకు కొండంత అండగా నిలిచే రతన్‌ టాటా ఈ కార్యక్రమానికి రావడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రతన్‌ టాటా, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌లకు మంత్రి కె.టి.ఆర్‌ ప్రత్యేక కతక్షతలు తెలిపారు.

మహానగరం సిగలో మరో మణిహారం

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ మహానగరం సిగలో మరో మణిహారం చోటుచేసుకుంది. అదే గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటిలో కొలువుదీరిన టీ- హబ్‌. ఈ భవనానికి కెటలిస్టు గా పిలుస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐ.టి పరిశ్రమ అభివ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రా మిక విధానం ప్రపంచ వ్యాప్తంగా ఐ.టి దిగ్గజాలను, పలు స్టార్టప్‌ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక శైలితో ఈ టీ-హబ్‌ భవనాన్ని నిర్మించింది. యువతరం ఆలోచనలకు మరింత పదును పెట్టే యువత కలల సౌధం ఈ భవనం.

ఐ.టి ప్రపంచంలో హైదరాబాద్‌ మహానగరం ఖ్యాతిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేందుకు అంతర్జాతీయ స్థాయిలో సిద్ధమైన ఇంక్యుబేటర్‌ సెంటర్‌ టి-హబ్‌. వినూత్న ఆవిష్కరణలు చేసేవారిని, వారికి ఆర్థికంగా సహకరించే పారిశ్రామిక వేత్తలను అనుసంధానంచేసి, యువత కలలను నిజం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ టీ- హబ్‌కు శ్రీకారం చుట్టింది. మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటుచోసిన తొలి ఇంక్యుబేటర్‌గా ఇది చరిత్ర స ష్టించింది.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, సకల సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించారు. ‘ ప్రపంచంలో ఎవరైనా సరే ఆలోచనలతో వస్తే ఆవిష్కరణలతో వెళ్ళవచ్చు’ అన్న టీ-హబ్‌ నినాదం యువతరాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ట్రిపుల్‌ ఐటి, ఐ.ఎస్‌.బి, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యా సంస్థల సాంకేతిక సహకారంతో, పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా, మరెందరో ఐ.టి రంగ ప్రముఖులు, వెంచర్‌ క్యాపిటలిస్టుల ఆర్థిక అండదండలతో , ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ టీ- హబ్‌ సాధారణ కార్యాల యాలకు భిన్నంగా సకల సదుపాయాలతో రూపొం దింది. ఈ భవనంలో ఒకవైపు ఇంటీరియల్‌ డిజైన్‌ , మరోవైపు మనసును ఆలోచనలవైపు మళ్లించే చక్కటి సూక్తులు, సరికొత్త ఆలోచనలను పాదుకొలిపే ఆవిష్కరణల సమాచారం ఓ మహాద్భుతం. అడుగడుగునా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ భవనంలో ఆహ్లాదకర వాతావరణం, పనిసంస్కతిని ప్రతిబింబిస్తోంది.

ముఖ్యంగా యువతరం టీ- హబ్‌ పట్ల విశేషంగా ఆకర్షితు లవుతున్నా రనడానికి ప్రారంభోత్సవం నాడు యువకులు చేసిన సందడే నిదర్శనం. ప్రారంభోత్సవానికి విచ్చేసిన టాటా గ్రూపు ఛైర్మన్‌ రతన్‌ టాటా యువతీ యువకులతో జరిపిన సంభాషణా కార్యక్రమంలో వారు చూపించిన ఆసక్తి, వారు ప్రశ్నించిన తీరు యువతలో వచ్చిన చైతన్యానికి అద్దం పట్టేదిగా వుంది. టీ- హబ్‌ పట్ల యువతరానికిగల విపరీతమైన ఆకర్షణను ఇది వెల్లడిచేసింది.

Other Updates