powerప్రభుత్వరంగ సంస్థలపై ద ష్టి పెట్టిన కేసీఆర్‌

ఆర్టీసి, విద్యుత్‌ సంస్థలను ఆదుకున్న ప్రభుత్వం.. చార్జీల సవరణల్లో కనిపించిన మార్పుల ప్రభావం

శ్రీ గటిక విజయ్‌ కుమార్‌

ఆర్టీసీ నిండా నష్టాల్లో మునిగిపోయింది. ఎప్పుడూ ప్రైవేటీకరణ కత్తి ఆర్టీసీ మెడకు వేలాడుతూనే ఉండేది. ఆర్టీసీ భారాన్ని ఎలా వదిలించుకోవాలనే విషయంలోనే ప్రభుత్వం సమీక్షలు నిర్వహించేది. నివేదికలు తెప్పించుకునేది. విద్యుత్‌ సంస్థల వ్యవహారాన్ని ఇఆర్సి చూసుకునేది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రైవేటు సంస్థలకు బంగారు బాతులా ఉండేది. సామాన్యులకు కరెంటు కోతలు, లో ఓల్టేజి సమస్యలు. ఇదీ తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితి.

ఆల్విన్‌, హెచ్‌ఎంటి, ప్రాగా టూల్స్‌, నిజాం సుగర్స్‌, రిపబ్లిక్‌ పోర్జ్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు సమైక్య పాలనలో మూత పడ్డాయి. ఆర్టీసీ కూడా అదే బాటలో ఉన్న పరిస్థితి.

కానీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం మరోలా ఆలోచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించారు. ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఆలోచించే దక్పథంలోనే తేడా

ప్రదర్శించారు. ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుంది.

ఆర్టీసికి అండదండ

తెలంగాణలో ఆర్టీసీ పదివేలకు పైగా బస్సులు నడుపుతోంది. రోజూ 90 లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తోంది. ఆర్టీసీ బస్సులు 34 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. 95 డిపోలు. 56వేల మంది ఉద్యోగులు. విద్యార్థులు, ఉద్యోగులు, పల్లె ప్రజలు, నగర ప్రజలు అంతా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు.

ఇన్ని అనుకూలతలున్నప్పటికీ తెలంగాణ ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎందుకు? ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేసుకున్నారు. రాష్ట్రంలోని డిపో మేనేజర్ల నుంచి ఎం.డి. వరకు అందరినీ పిలిపించి రోజంతా చర్చించారు. అసలు విషయాలు తెలుసుకున్నారు. ప్రజలకు సేవలందించే ఆర్టీసీని గత ప్రభుత్వాలు కేవలం ఓ వ్యాపార సంస్థగా భావించి, లాభనష్టాలను బేరీజు వేసుకుని ఆలోచించాయి. నష్టాల్లో నడుస్తోందని తేల్చి దాని మానాన దాన్ని వదిలేశారు.

కానీ కేసీఆర్‌ మాత్రం ఆర్టీసీని ఓ వ్యాపార సంస్థగా కాకుండా, ప్రజలకు రవాణా సౌకర్యం అందించే సేవాసంస్థగా పరిగణించారు. అందుకే ఆర్టీసీ నష్టాలకు కారణాలను విశ్లేషించి, ప్రభుత్వ పరంగా చేయాల్సినంత చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి ప్రస్తుతం రెండు వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. ప్రతీ ఏటా రూ.700 కోట్ల నష్టం వస్తోంది. 95 డిపోల్లో 90 డిపోలు నష్టాల్లోనే ఉన్నాయి. ఉద్యోగుల వేతనాలు కూడా పెంచినందున అదనపు భారం కూడా మోయాల్సి వస్తున్నది. అయితే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, తీసుకున్న నిర్ణయాల ప్రభావం వల్ల కూడా ఆర్టీసికి నష్టం వస్తున్నది. ఈ విషయంలోనే కేసీఆర్‌ ఆలోచించిన విధానానికి, గత పాలకులు ఆలోచించినదానికి తేడా ఉంది.

విద్యార్థులకు, జర్నలిస్టులకు, ఇతరులకు ఇచ్చే బస్‌ పాసుల వల్ల ఆర్టీసికి ఏటా రూ.500 కోట్ల నష్టం వస్తున్నది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకు న్నారు. హైదరాబాద్‌ నగరంలో బస్సుల వల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జిహెచ్‌ఎంసి భరించే విధంగా నిర్ణయం తీసుకు న్నారు. దీని వల్ల ఆర్టీసికి ప్రతీ ఏటా రూ.190 కోట్ల వరకు జిహెచ్‌ఎంసి నుంచి డబ్బులు అందుతున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల ఆర్టీసీకి ఏటా వచ్చే రూ.700 కోట్ల నష్టం తగ్గిపోనున్నది. ఈ నిర?యాలే కాకుండా, రూ.300 కోట్ల తక్షణ సాయం కూడా ఆర్టీసికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బస్సుల కోసం రూ.350 కోట్ల అప్పును ప్రభుత్వం ఆర్టీసికి సమకూరుస్తున్నది. ఇంతే కాకుండా సరుకు రవాణా, కొరియర్‌ సేవలను కూడా అందించాలని, వాణిజ్య ప్రకటనలు సేకరించాలని, మినీ బస్సులు ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఈ నిర్ణయాల వల్ల ఆర్టీసీ లాభాల బాటన నడవనుంది. ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో కూడా ప్రభుత్వమానవీయ దక్పథం బయటపడింది. సామాన్య పల్లె జనం ఎక్కువగా పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణిస్తారు. ఆర్టీసీలో 50 శాతం ప్రయాణికులు పల్లె వెలుగుకు సంబంధించిన వారే. అలా పల్లె వెలుగులో ప్రయాణించే వారికి ఎక్కువ భారం ఉండవద్దనే ఉద్దేశ్యంతో టికెట్‌ కు కేవలం రూపాయి మాత్రమే పెంచారు. సాధారణ ప్రయాణికులపై భారం మోపకుండానే, ప్రభుత్వ సాయం ద్వారా ఆర్టీసీ కోలుకునే విధంగా ప్రభుత్వం చొరవ చూపడం చరిత్రలో ఎన్నడూ లేదు.

విద్యుత్‌ సంస్థలకు చేయూత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వచ్చిన మొదటి సమస్య విద్యుత్‌ సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అధిగమించడంతో పాటు భవిష్యత్తులో కోతలు లేని విద్యుత్‌ అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజునుంచే చర్యలు ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. గతంలో ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలే విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు వస్తే ప్రజలకు మేలు కలుగుతుందని, విద్యుత్‌ సబ్సిడీలు మరింతగా అందించవచ్చని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఎన్టీపిసి, జెన్‌ కో, సింగరేణి ద్వారానే విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్ని వత్తిడులు వచ్చినా ప్రైవేటు రంగంలో విద్యుత్‌ ఉత్పత్తిని అంగీకరించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలే విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల తాత్కాలికంగా కొంత ఆర్థిక భారమైనప్పటికీ భవిష్యత్తులో రాష్ట్రానికి మేలు అని తలచారు. అదే ప్రైవేటు సంస్థలు బాగుపడితే లాభం వారికే అందుతుంది. ప్రభుత్వసంస్థలు బాగు పడితే దాని ఫలితం ప్రజలకు అందుతుందని సిఎం కేసీఆర్‌ భావించారు.

విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించడానికి, కోతల్లేని విద్యుత్‌ అందించడానికి, నాణ్యమైన విద్యుత్‌ కోసం, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్‌ అందించడం కోసం విద్యుత్‌ సంస్థలు సంస్థాగతంగా చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్లు నిర్మించాల్సి వచ్చింది. ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచింది. ఈ నిర?యాల వల్ల తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి చాలా మెరుగయింది. సంస్థాగత సామర్థ్యం పెరిగింది. కోతల్లేని విద్యుత్‌ అందుతున్నది. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడంలో కోతల్లేని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని, ఎప్పటికప్పుడు అవసరమైన ఆర్థిక సాయం అందించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఇటీవల చార్జీలు పెంచిన సందర??ంలో కూడా వంద యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారిపై ఎలాంటి అదనపు భారం లేకుండా చేయడం ప్రభుత్వ దక్పథాన్ని తేటతెల్లం చేస్తున్నది.

త్వరలోనే సింగరేణిపై సమీక్ష

తెలంగాణలోని మరో ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రభుత్వానికి ఎక్కువ రాయల్టీ ఇవ్వడంతో పాటు దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఈ సంస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా, కొత్త గనులు ప్రారంభించడం ద్వారా రాష్ట్రానికి ఎంతో ఉపయోగ ముంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. త్వరలోనే సింగరేణిపై పూర్తి సమీక్ష నిర్వహించి అనేక నిర?యాలు తీసుకోనున్నారు.

తెలంగాణలో ఉన్నవి మూడు ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసి,సింగరేణి, విద్యుత్‌ సంస్థలపై ప్రభుత్వం దష్టి పెట్టి వాటిని గాడిలో పెట్టడం వల్ల అంతిమంగా ప్రజలకే మేలు కలుగుతుంది.

Other Updates