”ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు… ప్రతిపక్షాలకు పెద్ద పని దొరికేది… ఖాళీ కుండలతోనూ, బిందెలతోనూ హైదరాబాద్ జలమండలి కార్యాలయం ముందు మంచినీళ్లు రావడంలేదని పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేయించేవారు…. గత
నాలుగేళ్లుగా ఇలాంటి ఒక్క సంఘటన జరుగలేదు…ఇందుకు కారణం… హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందుతున్నది…” అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కే.టి. రామారావు ఎన్నోసార్లు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. ఇది నిజం.. హైదరాబాద్ నగరంలో నేడు ప్రతిరోజూ సుమారు 430 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఒక కోటి మందికి పైగా ప్రజలకు అందించడం జరుగుతున్నది. అంతే కాదు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 193 గ్రామాలకు కూడా మంచినీరందించే బాధ్యతను మంత్రివర్యులు తారక రామారావు జలమండలికి ఇచ్చారు. ఈ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
గత నాలుగేళ్ళ కాలంగా హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఎంతో కషి చేస్తున్నది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా టి.ఎస్. ఐ పాస్ ను నెలకొల్పి, వేలాది మందికి ఉపాధి కల్పించే దిశగా అనేక పరిశ్రమలకు రాయితీలతో కూడిన అనుమతులు ఇవ్వడం జరుగుతున్నది. ప్రజల తక్షణ అవసరాలను దష్టిలో ఉంచుకుని ఆధునిక ఫ్లై ఓవర్లు, సబ్ వేలు, అండర్‌పాస్‌లు, నాలాల ఆధునీకరణ, రోడ్ల వెడల్పు లాంటి అనేక మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఎన్నో అభివద్ధి పనులు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు లేదా జి.హెచ్.ఎం.సి, లేదా హైదరాబాద్ మెట్రో రైల్, హెచ్.ఎం.డి.ఏ ద్వారా నగరం మొత్తంగా రోజూ వారీ పనులు జరుగుతున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో కొత్త సంస్థలు నగరానికి వచ్చాయి. ఐ.టి హబ్‌లో ఐ.టి.రంగ పరిశ్రమలు
విస్తతంగా పెరిగిపోయాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలు పెరిగి పోయాయి. వేలాది మంది యువత నగరంలో ఏదో ఒక పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం నగరం చుట్టూరా వ్యాపించిపోయింది. ఆకాశ హర్మ్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీల సంస్క తీ పెరిగింది. విశాలమైన భవనాలు, పరిశ్రమలు పెరిగాయి. మనీ సర్క్యూలేషన్ పెరిగింది. భవిష్యత్ లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. నగరంతో పాటుగా జనాలు పెరుగుతున్నారు. నివసించే ఏరియా విస్తతమైపోతున్నది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో సుమారు 32 గ్రామ పంచాయితీలు/నగర పంచాయితీలను ప్రభుత్వం ఇటీవలే మున్సిపాలిటీలుగా ప్రకటించింది. ఇవన్నీ నగరాన్ని అనుకునే వున్నాయి. భవిష్యత్‌లో వీటికి కూడా జలమండలి ద్వారా మంచినీటిని సప్లై చేసే అవసరం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ప్రస్తుతమిస్తున్న 430 మిలియన్ గ్యాలన్ల నీరు భవిష్యత్‌లో రోజుకి 1000 మిలియన్ గ్యాలన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
ఈ నేపథ్యంలో అందరికి ఆహారం, గహ అవసరాలు ఎలా ఉన్నప్పటికీ, తాగడానికి మాత్రం అందరికీ మంచినీరు అవసరం. నీరు లేకపోతె మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో హైద్రాబాద్ జలమండలికి అందరికీ మంచినీటిని అందించాల్సిన బాధ్యత వుంది. ఇందుకోసం గతంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూరు ల నుండి నగరానికి తరలించే నీటిని గత రెండు సంవత్సరాలుగా వాడకుండా వాటిని అత్యవసర సమయాల్లో వాడటం కోసం అలాగే ఉంచడం జరిగింది. ప్రభుత్వ ముందుచూపులో ఇదొక పెద్ద విజయంగా భావించాలి. గత రెండు సంవత్సరాలుగా ఈ జలాశయాల్లోని నీరు భూగర్భ జలాల పెంపుదల కోసం చక్కగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం నగర ప్రజలకు అందిస్తున్న మంచినీరు కష్ణా, గోదావరి నదుల్లోంచి తీసుకుని వస్తున్న నీరు మాత్రమే. సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి తీసుకుని వస్తున్న ఈ నీటిపై ప్రభుత్వానికి ప్రతి వేయి లీటర్లకు సుమారు 45 రూపాయాలు ఖర్చు అయితే, ప్రజలకు ప్రభుత్వ సబ్సిడీతో ఇస్తున్న రేటు కేవలం 10 రూపాయలు మాత్రమే.
పెరుగుతున్న జనాభాకు అవసరమైనన్ని రిజర్వాయర్లు అన్ని ప్రాంతాల్లో నిర్మించడానికి ప్రభుత్వానికి భారీ వ్యయంతో పాటుగా, స్థల సేకరణ సమస్యగా మారింది. ఇప్పటికే 1900 కోట్ల హాడ్కో రుణ సహాయంతో 56 నూతన రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతున్నది. లక్షలాది గ్యాలన్ల నీరుండే కెపాసిటీ గల ఈ రిజర్వాయర్లను నగరంలోని అన్ని ప్రదేశాలకు నీరందించే విధంగా వివిధ ప్రదేశాల్లో నిర్మించడమైంది. వీటిలో సుమారు 40 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాగా, మిగితావి వివిధ దశల్లో వున్నాయి. ప్రపంచ బ్యాంక్ సహకారంతో కొత్త్తగా మరో 10 రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది. ఇవి కూడా భారీ కెపాసిటీతో కూడుకున్నవే. అలాగే, మరికొన్ని రిజర్వాయర్లను రాష్ట్ర నిధులతో నిర్మించడం జరిగింది. నగరం చుట్టూర నిర్మించిన ఈ రిజర్వాయర్ల అన్నింటి లక్ష్యం ఒక్కటే…. అందరికీ మంచినీరు అందించాలనే ఆశయంతో జలమండలి పనిచేస్తున్నది. నగరంలో సుమారు 330 బస్తీలుంటే, అక్కడకు ఉచితంగా నీటి ట్యాంకర్లను పంపించడం జరిగేది. అత్యంత ఖర్చు, సమయం, రవాణాలో నీళ్లు వధాగా పోవడంతో పాటుగా వచ్చిన నీళ్లను పట్టుకోవడానికి మహి ళలు కొట్లాటలకు దిగడం తదితరమైనవెన్నో శాశ్వతంగా పరి ష్కరించే దిశలో ఇటీవల అన్ని బస్తీల్లో సుమారు 70 కిలోవీటర్ల కొత్త పైప్ లైన్స్ వేయడం జరిగింది. ఉచిత ట్యాంకర్లపై అవుతున్న వ్యయాన్ని ఒక్కసారిగా తగ్గించడం జరిగింది.
రిజర్వాయర్ల సంఖ్య పెరగడంతో పేదలకు ఒక రూపాయికే కొత్త నల్లా కనెక్షన్స్ ఇచ్చే విధంగా జలమండలి చర్యలను ముమ్మరం చేసింది. కొత్తగా రిజర్వాయర్లు నిర్మించిన అన్ని ప్రాంతాల్లోని పేదలకు మంచినీళ్లు అందించే విధంగా వారి ఇంటికి పైప్ లైన్ వేయడానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తూ రిజిస్ట్రేషన్ కింద వారి నుండి కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేయడం జరుగుతున్నది హడ్కో రుణ సదుపాయంతో నగరంలో లక్షలాది లీటర్ల కెపాసిటీ గల 56 రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వీటిలో సగానికి పైగా పూర్తి కాగా, మిగితావి ఈ సంవత్సరం ఆఖరుకు పూర్తి చేయడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి 193 గ్రామాలకు సైతం జలమండలి నీరందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
గోదావరి కష్ణ నదుల నీటిని కలుపుతూ హైదరాబాద్ చుట్టూరా 178 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఒక రింగ్ మెయిన్ నిర్మించే ప్రతిపాదనతో ప్రభుత్వం వుంది. ఒక్కోసారి వర్షాభావ పరిస్థితులు కావచ్చు లేదా విద్యుత్ సమస్య తలెత్తినపుడు గోదావరి లేదా కష్ణా పైప్ లైన్ ఆగిపోతే నీటికి సమస్య రాకుండా ఉండేందుకు ఒక నది వైపు సమస్య తలెత్తినప్పుడు రెండవ నది నీరు రెడీగా ఉంటుంది కావున రెండు నదుల నీటిని ఒకే పైప్ లైన్లో కలిపి నగరం చుట్టూరా రింగ్ మెయిన్ నిర్మించినపుడు, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఆశయం. మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర అన్ని పైప్ లైన్‌ల నీటితో రింగ్ మెయిన్‌కు అనుసంధానం చేయడం వలన నగరం చుట్టూరా నీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భారీ ప్రణాళికతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక జల వలయం లేదా జలనిధిగా చెప్పుకోవచ్చు. అలాగే, నగరానికి రెండు వైపులా రెండు 10 టి.ఎం.సి ల నీటి లభ్యత గల రిజర్వాయర్లు నిర్మించినపుడు ఇక హైదరాబాద్ నగరానికి రాబోవు రెండు దశాబ్దాల వరకు నీటి కొరత ఉండదు. ఇందుకు, గోదావరి నీటితో శామీర్‌పేట్‌కు దగ్గరలోని కేశవపురంలో 10 టి.ఎం.సి. రిజర్వాయర్ కోసం భూ సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో వైపు కష్ణా నీటితో చౌటుప్పల్ దగ్గరలోని దేవాలమ్మ నగరంలో రెండో రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని రూపొందించింది. నగరం మొత్తం ఒక వాటర్ గ్రిడ్ కిందకు తీసుకురావాలనేది యోచన. ప్రజల మౌలిక సదుపా యాల కింద అనేక రిజర్వాయర్లను, రోడ్ రిస్టోరేషన్ పనులను వేగవంతంగా పూర్తిచేస్తున్నందుకు జలమండలికి ‘హడ్కో’ అవార్డును ప్రకటించింది. కేంద్ర మంత్రి హరదీప్ పూరి చేతుల మీదుగా 25 ఏప్రిల్, 2018న జలమండలి ఈ అవార్డును తీసుకున్నది.
ఒక వైపు తాగు నీటి సమస్య పరిష్కారం కోసం కషి చేయడంతో పాటుగా మరోవైపు మురికి నీటి సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో క షి చేస్తున్నది. హైదరాబాద్ నగరంలో రోజుకు 1400 మిలియన్ గ్యాలన్ల మురుగును మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇందులో కేవలం 700 మిలియన్ గ్యాలన్ల మురికి నీటి శుద్ధికి మాత్రమే సివెరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు వున్నాయి. ఒక మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నెలకొల్పడానికి కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. మన నగరంలో ప్రస్తుతం 12మురుగు నీటి శుద్ధి కేంద్రాలు వున్నాయి. మరో 12 కేంద్రాలు త్వరలోనే నెలకొల్పే ప్రతిపాదనలతో ప్రభుత్వం వుంది.
మంచినీరు ఇవ్వడమే కాదు… మంచి నీటి పరిరక్షణలో కూడా జలమండలి చర్యలు తీసుకున్నపుడే భావి తరాలకు మనం నీరందించిన వారమవుతాం. జలం జీవం పేరుతొ భూగర్భ జలాల పరిరక్షణ కోసం వందలాది ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 14 స్వచ్ఛంద సహకార సంస్థల సహకారంతో నగరంలోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో జలం జీవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరి గింది. రాబోయే దశాబ్ద కాలంలో తాగడానికి నీళ్లు లేకుండా భూగర్భ జలాలు అడుగంటబోయే దేశాలు, రాష్ట్రాలు గురించి ఐక్య రాజ్య సమితి పలు హెచ్చరికలు చేసింది. మన దేశంలో బెంగళూరు నగరం ఈ లిస్టులో వుంది. హైదరాబాద్ నగరానికి ఆ ముప్పు రాకుండా ఉండాలంటే ప్రజలందరూ ఐకమత్యంతో వీలయినన్ని ప్రదేశాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం వలన వర్షంకాలంలో వచ్చే ప్రతి వర్షపు నీటి చుక్క భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల అభివద్ధికి తోడ్పడుతుంది. ప్రజల్లో జలసంరక్షణపై మరింత అవగాహన పెంచే ఉద్దేశ్యంతో జూబిలీ హిల్స్ లోని బట్టర్ ఫ్లై పార్క్ లో ఒక థీమ్ పార్క్‌ను జలమండలి ఏర్పాటు చేస్తున్నది. వాన నీటి సంరక్షణను ఎన్ని విధాలుగా చేయవచ్చునో ఈ థీమ్ పార్క్‌లో ప్రదర్శిస్తారు,
భూగర్భంలో గల మురుగునీటి పైప్ లైన్లలో లీకేజీలను పరీక్షించడానికి గ్రౌండ్ పెనెట్రక్షన్ సిస్టమ్ (జి.పీ.ఆర్) , నీటి సరఫరా, నాణ్యత, పంపింగ్ వంటి వాటిని ఆటోమేషన్ ద్వారా నియంత్రించడం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ ట్యాంకర్‌ల రవాణా విధానం, ట్రెంచ్ లెస్ టెక్నాలజీ ద్వారా డ్రైనేజీ పైపుల మరమ్మత్తులు, మినీ ఎయిర్ టెక్ యంత్రాలతో పారిశుద్ధ్య నిర్వహణ, రోబో విధానం ద్వారా కూడా మ్యాన్ హోల్స్ నిర్వహణ, టాంపర్ ప్రూఫ్ మీటర్ల ఏర్పాటుపై పరిశీలన తదితర సాంకేతిక విధానాలతో జలమండలి గత నాలుగేళ్లలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. వచ్చే కొద్దిరోజుల్లో జలమండలి జలాన్ని కూడా మార్కెట్‌లో ప్రవేశ పెట్టడానికి చర్యలు తీసు కోవడం జరుగుతున్నది. నీళ్ళని పంపింగ్ చేయడానికి విద్యుత్ పై జలమండలి సుమారు 70 నుండి 80 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ వ్యయాన్ని తగ్గించుకో వడం కోసం పైప్ లైన్లలో టర్బౖెెన్స్ ఏర్పాటు లేదా సోలార్ విద్యుత్‌తో సాంకేతిక విధానాన్ని ఉపయోగించడానికి ప్రణాళికల్ని వేసింది.
ఎం. దాన కిశోర్, ఐ.ఏ.ఎస్.