kcrతెలంగాణలో పారిశ్రామిక ప్రగతి వేగంగా జరగాలన్న తలంపుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌ ఐపాస్‌ విధానం అనుకున్నట్టుగానే ఎందరెందరో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నది. అందుకనుగుణంగా పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి కదిలివస్తున్నారు. టిఎస్‌ఐపాస్‌ను ప్రకటించినప్పటి నుండి, ఇప్పటి వరకు కేవలం నాలుగు నెలల్లోనే 69 పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, ప్రభుత్వం అనుమతులిచ్చింది.

త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్న టిఎస్‌ఐపాస్‌ విధానం ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నది. ఇందుకు నిదర్శనమే అంతర్జాతీయంగా పేరుగాంచిన భారీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం.

‘టిఎస్‌ఐపాస్‌’ వంటి పారిశ్రామిక విధానం ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు రాలేదని పలు కార్పోరేట్‌ కంపనీలు ప్రశంసిస్తున్నాయి. గడచిన నాలుగు నెలల్లో 5455 కోట్ల పెట్టుబడితో 69 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 15,538 మందికి ఉపాధి లభించనున్నది.

పరిశ్రమలకు త్వరితంగా అనుమతులిచ్చేందుకు సీఎంవోలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో చేేజింగ్‌ సెల్‌ పనిచేస్తున్నది. ఈ సెల్‌ ద్వారా పదిహేను రోజుల్లో అనుమతులివ్వవలసి వుండగా, ఆ ప్రక్రియను 13 రోజుల్లోనే పూర్తి చేసి అనుమతులను అందజేస్తున్నారు.

పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన దరఖాస్తులన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవడానికి చేజింగ్‌ సెల్‌తో పాటు, ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు.

టిఎస్‌ఐపాస్‌ నాలుగో విడతలో నవంబర్‌ 21 రోజు అనుమతి పొందిన సంస్థలు ఎంఆర్‌ఎఫ్‌ (900 కోట్లు), స్నైడర్‌ ఎలక్ట్రిక్‌ (150 కోట్లు) క్రాంతి ఎడిఫైన్‌ (74.10 కోట్లు), ఫైనింగ్‌ సన్‌ (73.60 కోట్లు), హల్దీరామ్‌ స్నాక్స్‌ ( 64 కోట్లు), శ్రీరామ్‌ పవర్‌ లిమిటెడ్‌ (55 కోట్లు), మెఘా ఫ్రూట్స్‌ (41.66 కోట్లు), ప్రికా సొల్యూషన్స్‌ (33.65 కోట్లు), జినోమ్‌ వావీటెక్‌ (45.83 కోట్లు), సరైవాలా ఆగ్రో (25.35 కోట్లు), జీఎంఆర్‌ (27.40 కోట్లు), లోకేష్‌ మిషన్‌ (22.00 కోట్లు),) బోటెక్‌ ఇండియా (17.10 కోట్లు), స్పార్క్‌ మాన్‌ సోలార్‌ (16.20 కోట్లు), జీఎస్‌కె (12.63 కోట్లు), లోహియం ఎడిబుల్‌ (12.12 కోట్లు), పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించనున్నారు.

Other Updates