storysగూఢచారి వదిన పేరిట వెలువరించిన ఈ పుస్తకంలో మొత్తం పది కథలున్నాయి. రచయిత ఊహాత్మకంగా అల్లిన కథలలో, సమాజం పట్ల మనుషుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. అవి ఎలా వుండాలో ఉటంకిస్తూ సాగుతాయి దాదాపు అన్ని కథలు.

మనుషులలో నానాటికీ కరువైపోతున్న ఆధ్యాత్మిక చింతన, అంతగా అంతరించి పోలేదని చాటి చెప్పడానికి ప్రయత్నం చేశారు రచయిత ‘దేవి హత్మ్యం’ అనే ఒక కథ ద్వారా ప్రదేశం పరంగా అమెరికాను ఎంచుకున్నా భారతీయ సాంప్రదాయాలను, కుటుంబ బాంధవ్యాలను తెలియజెప్పే కథగా ఈ పుస్తకానికి పేరుపెట్టిన ‘గూఢచారి వదిన’ పాఠకులను ఆకర్షించేవిధంగా మలచగలిగారు రచయిత యెల్ది సుదర్శన్‌ పద్మశాలి.

‘మారుతి’ అనే ఒక కథ చదివితే రామాయణ ఇతివృత్తాన్ని తలపింపజేస్తుంది. అయినా ఈ కథలో ప్రస్తుత సమాజ దృక్కోణాన్ని స్పృషించగలిగారు రచయిత. ఇలా పదికథలలో రచయిత సమాజంలోని వివిధ కోణాలను ఎత్తి చూపుతూ ప్రవాస తెలంగాణీయుడుగా తనలోని సృజనశైలిని కథలలో పొందుపరచగలిగారు. అయితే కధా కథనంలో అక్కడక్కడా కొంత పట్టు సడలినట్లనిపించినా, హాయిగా చదివించ గలిగే ఈ ‘గూఢచారి వదిన’ కథా సంకలనం ఒక మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు.

ఇది ఈ రచయిత వెలువరించిన రెండవ కథా సంకలనం. పరాయి గడ్డపై స్థిరపడిన తేటతెలుగు తెలంగాణ వ్యక్తి కలం నుండి జాలువారిన పది కథలు వేటికవే విభిన్నంగా వున్నాయి.

ఈ పుస్తక ప్రచురణకు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారమందజేసింది.

– ఎం.కె.

Other Updates