lal-bahadur-shastriశ్రీ జి.వి.ఆర్‌.

లాల్‌ బహదుర్‌ శాస్త్రి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మినిష్టరుగా క్నోలో ఉంటున్నప్పుడు మొగల్‌ సరాయ్‌లో ఉంటున్న ఆయన మిత్రుడు అపాయింట్‌మెంట్‌ కోరాడు. రాత్రి తొమ్మిది గంటకు భోజనం చేసి రావసిందని లాల్‌ బహదుర్‌ సమాధానమిచ్చాడు. అది ఆశ్చర్యంగా తోచింది మిత్రుడికి.
లాల్‌ బహదుర్‌ భోజనానికి కూర్చున్న సమయంలో మిత్రుడు అతని ఇంటికి వచ్చాడు.
మినిష్టర్‌ అయ్యాక కూడా వదినెగారే వంట చేస్తున్నారా? మిత్రుని ప్రశ్న
ఇంకెవరు చేస్తారు? శాస్త్రిజీ సమాధానం.
నౌఖర్లు లేరా?
అంత డబ్బు మాకెక్కడి నుంచి వస్తుంది?
ఇంతలో పధ్నాుగేళ్ల కుర్రవాడొకడు వచ్చి భోజనం ఎక్కడ వడ్డించేదని అడిగాడు
ఇక్కడికే తీసుకురావసిందని శాస్త్రీజీ సమాధానమిచ్చాడు.
ఇతడు అహాబాద్‌లోని ఒక కాంగ్రెస్‌ వాది కొడుకు. క్నో చూడటానికి వచ్చాడు.
నాుగైదు రోజుంటాడు. నాకు వంట చేసి పెడ్తున్నాడు. ప్రస్తుతం మీ వదినె గారు, ప్లిు ఇక్కడ లేరు. కుర్రవాడు చేసే వంటను మీకెలా తినిపించాని భోజనానికి రావద్దన్నాను శాస్త్రీజీ చెప్పాడు.
ఆయన అన్నది అక్షరా నిజం. అక్కడ ఉన్న పాత టేబుల్‌ మీద ఒక పాత న్యూస్‌ పేపర్‌ పరచి దానిపై కుర్రవాడు కంచం పెట్టాడు. ఆ కంచంలో ఒక పరోటా ఉంది. పక్కన ఒక కప్పులో పుచని కూర ఉంది. ఇక ఉత్తర ప్రదేశ్‌ హోం మినిష్టరు గారి భోజనం ప్రారంభమైంది. మిత్రునితో మాట్లాడుతూనే శాస్త్రీజీ రెండు మూడు పరోటాు తినేశాడు. కుర్రవాడు మరొక పరోటా వేయబోగా కొంచెం కూర ఉందా? అని శాస్త్రీజీ అడిగారు. లేదు అని కుర్రవాడు మ్లెగా చెప్పాడు. ఇది విన్న ఉత్తర ప్రదేశ్‌ హోం మంత్రిగారికి చీమ కుట్టినౖట్లెనా లేదు. కాని మినిష్టరు గారి బీదరికం చూడలేక మిత్రుని కళ్లు చెమర్చాయి. శాస్త్రీజీ నిరాడంబర జీవన విధానానికీ, నిజాయితీకి ఇలాంటి కథు ఎన్నయినా చెప్పవచ్చు.
కాశీకి ఏడుమైళ్ల దూరంలో ఉన్న మొగల్‌ సరాయ్‌లో అక్టోబరు 2, 1904లో ఒక పాఠశా ఉపాధ్యాయుడి ఇంట్లో లాల్‌ బహదుర్‌ జన్మించారు. తండ్రి శారదా ప్రసాద్‌, తల్లి పేరు రాందులారీ దేవి. లాల్‌ బహదుర్‌ ఏడాదిన్నర వయసులోనే తండ్రి గతించాడు. తల్లి పోషణలో తన మాతా మహుయింట్లో పెరిగారు. చిన్నతనంలోనే చాలా కష్టపడి, నది దాటడానికి డబ్బులేకపోతే చేత పుస్తకాు పట్టుకొని, మరోచేత్తో ఈదుకుంటూ చదువుకున్నాడు. ఆత్మాభిమానం ఆయనకు పెట్టని కోటగా నిలిచింది. విద్యార్థి దశలోనే ఆయన మీద గాంధీజీ స్వదేశీ ఉద్యమ ప్రభావం పడిరది. ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి కాశీ విద్యాపీఠంలో చేరి శాస్త్రి పరీక్షలో సర్వ ప్రథముడుగా ఉత్తీర్ణుయ్యాడు. ఆ శాస్త్రి డిగ్రీ అయన పేరుతో కలిసి లాల్‌ బహదుర్‌ శాస్త్రిగా ప్రసిద్ధి చెందాడు. వివాహానంతరం అహాబాద్‌లో స్థిరపడి ఒక వంక కుటుంబ పోషణ చేసుకుంటూ, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి దాదాపు ఎనిమిది సంవత్సరాు జైల్లో ఉన్నాడు.
పదవుకోసం శాస్త్రీజీ ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించుకుంటూ వచ్చాయి. 1926లో అంటే తన 24వ ఏటనే ఆయన అహాబాద్‌ మునిసిపాలిటి సభ్యుయ్యారు. 1937లో ఉత్తర ప్రదేశ్‌ శాసనసభకు మొదటిసారి, 1946లో రెండవసారి ఎన్నికై 1947లో ఆ రాష్ట్ర హోంమంత్రి అయ్యారు. 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయనను అఖి భారత కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా నియమించడంతో ఆయన జీవితం గొప్ప ముపు తిరిగింది. 1952 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అభ్యర్థు నిర్ణయించే బాధ్యత నెహ్రూ ఆయన భుజస్కంధామీద ఉంచారు. ఆ బాధ్యతే ఆయనను అఖి భారతస్థాయి నాయకుడిగా చేసింది.
1952లో లాల్‌ బహదుర్‌ శాస్త్రి రాజ్యసభ సభ్యులై రైల్వే రహదారు శాఖ మంత్రి అయ్యారు. 1956లో ఆర్యబాద్‌ రైల్వే దుస్సంఘటనకు మనస్తాపం చెంది మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, దేశ సంఘటను ఆయనను పదవి నుంచి ఎక్కువకాం దూరంగా ఉంచలేక పోయాయి. అనంతరం ఆయన కేంద్ర పరిశ్రమ శాఖను చేపట్టారు. 1961లో గోవిందవ్లభ్‌ పంత్‌ మృతితో ఆస్థానంలో లాల్‌ బహదుర్‌ శాస్త్త్రి కేంద్ర హోం మంత్రి అయ్యారు. 1963లో కావ్‌ురాజ్‌ ప్రణాళిక కింద ఇతర మంత్రుతో పాటు శాస్త్రీజీ రాజీనామా చేసినా, నెహ్రూ తీవ్ర అస్వస్థతతో ఉన్న కాంలో కేంద్రంలో తిరిగి పోర్టు ఫోలియో లేని మంత్రిగా చేరారు. 1964లో నెహ్రూ మరణించగా కాంగ్రెస్‌ అధిష్ఠానం లాల్‌ బహదుర్‌ శాస్త్రిని ప్రధానమంత్రిగా నియమించింది.
ప్రధానమంత్రిగా శాస్త్రీజీ అనేక కఠిన సమస్యను నిజాయితీ దృష్టితో అత్యంత సమర్థంగా పరిష్కరించారు. ఆయన అతిచిన్న పెద్ద మనిషి.. ఎవరిని సంప్రదించకుండా మంత్రి మండలి ఏర్పాటు చేసి శాస్త్రీజీ అందరినీ ఆశ్చర్యపరిచారు. కాశ్మీర్‌లో హజ్రత్‌బల్‌ సమస్య, అస్సాం భాషా సమస్య, ఆహార ధాన్యా కొరత, షేక్‌ అబ్దుల్లా తిరుగుబాటు చర్యను ఆయన సమయస్ఫూర్తితో ఎదుర్కొన్నారు. సి.బి.ఐ. ద్వారా అవినీతిని ఎదుర్కొన్న తీరు, దాస్‌ విచారణ కమిటీ నివేదిక అధారంగా పంజాబు ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్‌ కైరాన్‌పై చర్య తీసుకున్న తీరును చూసి ప్రజు ఆయన దృఢ చిత్తంతో సమస్యను పరిష్కరించే నేర్పరిగా గుర్తించారు. పాకిస్థాన్‌ మన దేశంపై రెండు సార్లు దాడి చేసినా అపూర్వమైన ధైర్య సాహసాతో వాటిని తిప్పి కొట్టగలిగారు. రష్యా మధ్యవర్తిత్వంతో అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌, శాస్త్రీజీ మధ్య శాంతి ఒప్పందం జరిగిన రాత్రే 1966 జనవరి 11వ తేదీన ఆయన హఠాత్తుగా గుండె నొప్పితో మరణించారు. స్వంత ఇు్ల కూడా లేని ప్రధానమంత్రిగా శాస్త్రీజీకి దేశ ప్రజు నివాళుర్పించారు.

Other Updates