tsmagazine

పీసరి లింగారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్‌ తలచింది.

ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ వంతు తోడ్పాటునందించేందుకు టి-సాట్‌ సిద్ధమైంది.పోలీసు శాఖలో 18,428., పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాల ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్‌ 11న తెలంగాణ పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వి.వి. శ్రీనివాస్‌రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో కార్యక్రమాన్ని టి-సాట్‌ స్టూడియోలో ఘనంగా ప్రారంభించింది. రెండు నెలలు సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలు కొనసాగుతా యి. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు నిపుణ-విద్యలో ప్రసారాలు మొదల య్యాయి.టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు అందించే అవగాహన ప్రసారాలు టి-సాట్‌ సోషల్‌ మీడియాలోనూ అందుబాటులో ఉంటాయి.

రోజుకు ఏడు గంటల ప్రత్యేక ప్రసారాలు

టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్ల సేవలు నిరుద్యోగ యువతకు గ్రూప్‌-2 నుండి మొదలై ప్రస్తుతం విడుదలైన పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఉద్యోగాలతో పాటు టీఎస్పీయస్‌సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకూ కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో గ్రూప్‌-2, టీఆర్టీ, ఫారెస్టు, గురుకుల ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఆర్‌.ఆర్‌.బి.,బ్యాంకింగ్‌ తదితర ఉద్యోగాలకు సుమారు 3000 గంటల ప్రసారాలు అందించి పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల మనసును చూరగొన్న ఘనత టి-సాట్‌ టీవీకి దక్కింది. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో ఈ యేడాది భారీ ఎత్తున ఎస్‌.ఐ, ఏ.ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ కేటగిరి ఉద్యోగాలకు సబంధించి వివిధ విభాగాల్లో 18,428 పోస్టుల భర్తీకి ఉపక్రమించింది. వీఆర్వో,ఏఎస్వో పోస్టులతో పాటు ఫారెస్టు, వైద్య ఆరోగ్య, హోం, సాగునీటి శాఖల్లో పలు కేటగీరిల్లో ఉద్యోగాల భర్తీకి టీఎస్పీయస్సీ మరో 2,786 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు 15 సబ్జెక్టుల్లో అవగాహన కార్యక్రమాలు రోజుకు ఏడు గంటల చొప్పున ప్రసారం కానున్నాయి. జనరల్‌ అవేర్‌ నెస్‌, కరెంట్‌ ఆపైర్స్‌, మెంటల్‌ ఎబిలిటి, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ తదితర సబ్జెక్టులో శిక్షణ కొనసాగుతోంది.

సోషల్‌ మీడియాలోనూ….
టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలు సోషల్‌ మీడియాలోనూ అందు బాటులో ఉన్నాయి. ప్రజల్లో సాంకేతికత వద్ధి చెంది తమ తమ అవసరాలను ముంగిట్లోనే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామా రావు టి-సాట్‌ ప్రసారాలను సోషల్‌ మీడియా లోనూ విస్త్త్రుతపరచాలన్నారు. మొబైల్‌ ద్వార అరచేతిలో స్వర్గాన్ని చూస్తున్న ప్రజలకు టి-సాట్‌ ప్రసారాలూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా టి-సాట్‌ టీవీకి సంబంధించి యూట్యూట్‌ ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, వెబ్‌ సైట్‌లలో ప్రసారాలు అందిస్తోందని సీఈవో ఆర్‌.శైలేష్‌ రెడ్డి తెలిపారు.

సార్‌…నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది
”సార్‌…నేను పోలీసు ఉద్యోగం పొందాను. టి-సాట్‌ టీవీ పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్ష లకు సిలబస్‌ ప్రసారం చేసింది. ఆ పాఠాలను నేను మా ఊర్లో ఉండి రోజూ చూసే వాడిని, పుస్తకాలు చదువుకోవడంతో పాటు టి-సాట్‌ టీవీలో వచ్చే పాఠాలనూ రోజూ చూసాను. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మాకు మంచి అవ కాశం కల్పించారు. నేను పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సంపాదించడానికి టి-సాట్‌ టీవి ఉపయోగపడటం గర్వంగా ఉంది” అంటూ రాష్ట్ర మంత్రి కేటీయార్‌కు నర్సింహా అనే యువకుడు ట్విట్టర్‌ ద్వారా తెలిపిన విషయాన్ని మంత్రే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 2016లో పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ద్వార నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో ఉద్యోగం పొందిన యువకుడు స్వయంగా తన అనుభవాన్ని వ్యక్తం చేయడం టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లకు ఉన్న ఆదరణ చెప్పకనే చెబుతుంది. అంతే కాదు టీఎస్పీయస్సీ ద్వారా నిర్వహించిన టీఆర్టీ ఉద్యోగాలకు టి-సాట్‌ అందించిన ప్రసారాలతో ఉద్యోగం వచ్చిం దంటూ కొంపెల్లి చంద్రకాంత్‌ అనే యువకుడు యూట్యూబ్‌ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఓ ఉన్నతాధికారి డ్రైవర్‌ తాను రోజూ టి-సాట్‌ ప్రసారాలను తన మొబైల్లో చూసి చాలా విజ్ఞానం పొందుతున్నానని సీఈవో శైలేష్‌ రెడ్డికి చెప్పడం ఆశ్చర్యం, ఆనందంతో కూడిన విషయాలుగా వర్ణించవచ్చు.

Other Updates