తెలంగాణ నిరుద్యోగ యువతకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఒక వరమయ్యాయి. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిరుద్యోగ యువతకే కాకుండా మహిళలు, వ్యవసాయాధారిత ప్రజలు, భాషాభిమానులు, సాహితీ ప్రియులు, క్రీడాభిమానులు-క్రీడాకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అత్యంత చేరువయ్యాయి టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్య. భవిష్యత్‌లో చిన్నపిల్లలు, భాషాభిమానులు, కళాకారులు, క్రీడాకారుల కోసమే కాకుండ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకూ ఉపయోగపడే విధంగా టి-సాట్ టెలివిజన్ మరిన్ని వినూత్న కార్యక్రమాలను అందించేందుకు సిద్ధమౌతుంది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ధేశించిన విజన్ 2024 లక్ష్య సాధనలో రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు చొరవతో టి-సాట్ తెలంగాణ ప్రజలకు చేరువౌతోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత తన శాఖ పరిధిలో ఉన్న టి-సాట్(మనటీవి)ని అధ్బుతంగా తీర్చిదిద్ది తెలంగాణ ప్రజలకు అందించాలని ఆయన భావించారు. ఎలక్ట్రానిక్ విభాగంలో అపారమైన అనుభవం ఉన్న ఆర్.శైలేష్ రెడ్డిని సీఈవోగా నియమించి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు దిశా నిర్ధేశం చేశారు.టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే కంటెంట్ తో పాటు నాలెడ్జ్ పార్టనర్లను ప్రోత్సహించడం, భవిష్యత్ ప్రణాళికను ఎప్పటికప్పుడు కేటీఆర్ సూచిస్తున్నారు.
ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటి పార్క్ ప్రారంభోత్సవ సభలో టి-సాట్ ను ప్రమోట్ చేస్తూ మంత్రి కేటీయార్ చేసిన ప్రసంగం టి-సాట్ పై ఉన్న ఆసక్తిని కనబరుస్తోంది. టి-సాట్ గురించి కరీంనగర్ లో ప్రసంగం ఆయన మాటల్లో…. ”కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వున్నాయి. వాటిలో కూడా మన పిల్లల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.కొత్త రకమైన టెక్నాలజిని వాడుకుని మీకు ప్రత్యేకంగా వాటిలో కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం కొనసాగుతోంది. మీరు గమనించాలి…గతంలో ఎంసెట్, ఐఐటీ, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల కోచింగ్ కోసం కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లల తల్లి తండ్రులకు ఖర్చు అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాటీలైట్ టెక్నాలజిని వినియోగించుకుని టి-సాట్ నెట్వర్క్ ద్వారా రెండు చానెళ్ల నిపుణ, విద్య కేబుల్ నెట్వర్క్ ద్వార ప్రతి ఇంటికి ప్రసారాలు అందిస్తున్నాం.మీరు కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా వాటిలో నాణ్యమైన శిక్షణ అందుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియ జేస్తున్నాను”.
అంతే కాదు…టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల పనితీరును ప్రపంచానికి తెలియచేయాలన్న లక్ష్యంలోనూ అతను వెనుకడువేయడం లేదు. గత నెల 18వ తేదీన హైదరాబాద్ హైటెక్ సిటిలో జరిగిన మిషన్ ఇన్నోవేషన్ 2018 సద్సస్సులోనూ టి-సాట్ గురించి వివరిస్తూ ఛానళ్ల పనితీరును సదస్సుకు తెలియ చెప్పారు. ఆయన మాటల్లో…
పంచ సూత్రాలు
టి-సాట్ టెలివిజన్ ఛానళ్లు పంచ సూత్రాలను ఎంచుకుని వాటి అమలే ధ్యేయంగా పనిచేస్తోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం మరియు ఆరోగ్యం. ఈ పంచ సూత్రాలను సంపూర్ణంగా ప్రజలకు అందించేకుందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పటికే మహిళా శివు సంక్షేమ శాఖ నాలెడ్జ్ పార్టనర్ గా కొనసాగుతూ రాష్ట్రంలో చిన్న పిల్లలకు, వారి తల్లులకు ప్రభుత్వం అందించే సమాచారాన్ని సమగ్రంగా చేరవేస్తోంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన టిఎస్-క్లాస్ కంప్యూటర్ విజ్ఞానాన్ని ఇక్కడి నుంచే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. వైద్య శాఖకు సంబంధించి అత్యంత ఆదరణ పొందుతున్న కేసీయార్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖంగా ప్రచారం కల్పించింది టి-సాట్. వ్యవసా యానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి తెలంగాణ గ్రామీణాభివద్ధి శాఖలు ప్రతి వారం ప్రసారాలు చేస్తున్నాయి. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టేం దుకు ఇటీవలే పోలీసు శాఖ నిర్వహిస్తున్న ”జాగో-బద్లో-బోలో” కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని టి.సాట్ నిర్ణయించింది.
పోటీ పరీక్షలకు అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి పరీక్షకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార అవగాహన కార్యక్రమాలు ప్రసారమౌతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెలువడిన తొలి నోటిఫికేషన్ గ్రూప్-2 మొదలు కొని గురుకుల ఉద్యోగగైడ్, ఎంసెట్, పాలిసెట్, ఐఐటి నీట్, ఫారెస్ట్ ఉద్యోగ గైడ్‌లతో పాటు టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ లకు అవగాహన కార్యక్రమాలను టి-సాట్ ప్రసారం చేస్తూనేఉంది. గ్రూప్-2 పోటీ పరీక్షలకు సుమారు 50 రోజులు, 250 గంటలు ప్రసారమయ్యాయి. ఎంసెట్,ఐఐటి మేయిన్స్, నీట్ పరీక్షలకు నాలుగు నెలల కాలంలో సుమారు 1000 గంటల ప్రసారాలను అందించింది టి-సాట్. గురుకుల ఉద్యోగ గైడ్, బ్యాంకింగ్ సర్వీసులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అవగాహన ప్రసారాలు అందించింది. పోటీ పరీక్షలకు తోడుగా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో టి-సాట్ ముందుంది. అంతారామమయం, గుడ్ హాండ్ రైటింగ్, ఇంటర్న్ షిప్, వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ”సమాచార గైడ్” గా పనిచేస్తోంది.
ఇస్రో తో ఒప్పందం
ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ఎన్ లైట్ అనే నినాదంతో 2016, సెప్టెంబర్ 27వ తేదీన ఐటి శాఖా మాత్యులు కె.టి.రామారావు ఇస్రో ప్రతినిధి బందతో ఒప్పందం కుదుర్చుకుని టి-సాట్ తొలి అడుగు వేసింది. గత పదిహేనేళ్ల క్రితం మనటీవీ ప్రసారాలు ప్రారంభమైనప్పటికీ 2016 నుంచే ప్రజలకు చైరువైందని చెప్పవచ్చు. గతంలో కేవలం ఆర్వోటీల ద్వారానే ప్రసారా లు అందుబాటులో ఉండే టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రస్తుతం కేబుల్ ద్వార తెలంగాణలోని సమారు 70 లక్షల కుటుంబాలకు చేరువయ్యా యి. భవిష్యత్‌లో తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవలందించాలన్నదే టి-సాట్ ప్రధాన లక్ష్యం.
యూట్యూబ్ లో టాప్….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాల ను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టి.సాట్-సాఫ్ట్ నెట్ సంస్థ సోషల్ మీడీయాలోనూ అందరికీ అందుబాటులో ఉంది. ఒక్క ఆర్వోటి వ్యవస్థకే పరిమితం కాకుండ కేబుల్ నెట్వర్క్,సోషల్ మీడియా ద్వార తాము చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు, నిరుద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు మారు మాల ప్రాంతాల్లో ఉండే సిబ్బందికి చేరవేస్తోంది.