కొత్త రాష్ట్రంలో నిరుపేదల బతుకులు మారాలని, వారికి గృహ వసతితోసహా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ వర్గాలవారికి చెల్లిస్తున్న పెన్షన్లు నామమాత్రంగానే ఉన్నాయని, అవి వారి జీవితాలకు ఏ విధంగా చాలడంలేదన్న తలంపుతో ‘ఆసరా’ పథకాన్ని రూపొందించింది. దీనిక్రింద ఆయా వర్గాలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని భారీగా, ఐదు రెట్లు పెంచి చెల్లిస్తోంది.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఆసరా’ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 8,నవంబర్,2014 న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. వృద్ధులు, వితంతువులకు గతంలో రూ. 200 ల పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు ఆ సొమ్మును రూ. 1000కి పెంచారు. వికలాంగుల పెన్షన్ కూడా రూ. 500ల నుండి రూ. 1500లకు పెంచారు. ఆ పెన్షన్లను అందించేందుకు ఆదాయ పరిమితిని కూడా పెంచారు.
బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి సదుపాయాన్ని మార్చి,2015 నుండి ఆచరణలోకి తెచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారం మొత్తం 4 లక్షల 90 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. 2015-16 బడ్జెట్ లో బీడి కార్మికులకు రూ.188 కోట్లు కేటాయించారు.
నిరుపేద వృద్ద కళాకారుల పెన్షన్‌ను ప్రభుత్వం రూ. 1500కి పెంచింది. గతంలో కళాకారులకు కేవలం రూ. 500 పెన్షన్‌లు మాత్రమే అందేవి.
1982 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు ప్రభుత్వాలు బలహీన వర్గాల గృహనిర్మాణాల పేరిట ఇండ్లు నిర్మించినా, అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదు. చాలా వరకు ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. కొద్దో గొప్పో ఇండ్ల నిర్మాణం జరిగినా, అవి కేవలం ఒక్క గది ఇల్లు మాత్రమే కావడంతో ఓ కుటుంబ అవసరాలు తీర్చలేకపోయింది. అందుకే తెలంగాణ ప్రభు త్వం నిరుపేదలకు నివాస యోగ్యమైన ఇల్లు, వారి ఆత్మ గౌరవం కాపాడే విధంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయిం చింది. ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా రెండు పడక గదుల ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.
- శ్రీ సికిందరాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఐడిహెచ్ కాలనీలో శిధిలావస్థలో వున్న భవనాల స్థానంలో 396 డబుల్ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అక్టోబర్ 3న దసరా రోజు శంకుస్థాపన చేశారు. ఈ గృహ సముదాయం నిర్మాణం శరవేగంతో సంతృప్తికరంగా పూర్తయింది. ఈ గృహాలను లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
- శ్రీ ఎస్టీ, మైనార్టీవర్గాల వారి సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి, తగిన సిఫారసులు చేసేందుకు రెండు వేర్వేరు కమీషన్లను ప్రభుత్వం నియమించింది. ఎస్టీల పరిస్థితులు అధ్యయనం చేసే కమీషన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ చెల్లప్పను చైర్మన్‌గా, ముస్లిం మైనార్టీల స్థితిగతులపై పరిశీలన చేసే కమీషన్ కు మరో రిటైర్డ్ ఐఏఎస్ జీ. సుధీర్‌ను నియమించింది.
- శ్రీ రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 2015 మే 1న నిర్ణయించింది. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుంది. ఈ పథకం ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తోన్న 5 లక్షల 8 వేలమంది డ్రైవర్లు, 16 వేలమంది హోంగార్డులు, 12 వేలమంది జర్నలిస్టులకు వర్తిస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటి వరకు ఉన్న ప్రమాద బీమా పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికులకు చెల్లిస్తున్న ప్రసూతి భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు.
- భవన నిర్మాణ రంగంలో ప్రమాదవశాత్తూ గాయపడి వికలాంగులైన కార్మికులకు రూ.30 వేలు ఉన్న నష్టపరిహారాన్ని రూ.60 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.అలాగే ప్రమాదవశాత్తు గాయపడి ఆస్పత్రి పాలైన కార్మికులకు నెలనెలా చెల్లించే భృతిని 15 వందల నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- శ్రీ ఆడపిల్ల పుట్టిందనగానే కన్న వారు పెళ్లి ఎలా చేయాలా అని భయపడే రోజులివి. ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేని దుర్భర పరిస్థితులున్నాయి. అందుకే దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి 51 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించి, ‘కల్యాణలక్ష్మి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2014-15 బడ్జెట్ లో 280కోట్లు, 2015-16 బడ్జెట్ లో రూ.237 కోట్లు ఇందుకు కేటాయించారు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదు. ఇంతటి గొప్ప కార్యక్రమం తెలంగాణలోనే అమలవుతుండడం మనందరికి గర్వకారణం.
- శ్రీ ముస్లిం వధువులకు కూడా రూ. 51 వేల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ‘షాదీ ముబారక్’ అనే పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. షాదీ ముబారక్ కు 2015-16 బడ్జెట్ లో రూ.100కోట్లు కేటాయించారు.
ఆహార భద్రత
గత ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కుటుంబంలో ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున, గరిష్ఠంగా 20 కేజీల బియ్యం మాత్రమే సరఫరా చేసేది.కానీ, తెలంగాణ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల చొప్పున బియ్యాన్ని అందిస్తోంది.
- శ్రీ తెలంగాణ రాష్ట్రంలోని హాస్టల్ విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నుండి మధ్యాహ్న భోజనం పథకానికి సన్నబియ్యం (బిపిటి,సోనామసూరి, సూపర్ ఫైన్ )సరఫరా చేస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా ఎంత పరిమాణంలో కావాలో అంత మేర బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- శ్రీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దళితుల అభివృద్ధి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది తప్ప ఆచరణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. ఇప్పటకీ 90 శాతం మంది దళితులు నిరుపేదలగానే వున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ దళితులకు మూడెకరాలు భూ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ భూమిలో బోరు, మోటారు, కరెంట్ కనెక్షన్ లాంటి వసతులు కూడా కల్పిస్తున్నది.
- శ్రీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తెలంగాణలోని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ఇచ్చేందుకు గాను అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్బిణీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా 2015 జనవరి 1 నుంచి అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ‘ఆరోగ్య లక్ష్మి’ అనే పేరు పెట్టారు. రాష్ట్రంలోని 31,897 అంగన్‌వాడి కేంద్రాలు, 4,076 మినీ అంగన్‌వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
- శ్రీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని జరిపిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిరుపేదల పట్ల అత్యంత సానుభూతితో ఉండే విధంగా క్రమబద్దీకరణ నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట వేయటం, ప్రతి భూమికి టైటిల్ కలిగిఉండటం లాంటి లక్ష్యాలు సాధించడమే క్రమబద్ధీకరణ ముఖ్య ఉద్దేశం. నిరుపేదలు వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌కు వచ్చి తలదాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇండ్లు నిర్మించుకున్నారని, అలాంటి పేదలకు ఉచితంగానే భూమిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- శ్రీ జర్నలిస్టుల సంక్షేమానికి 2014-15బడ్జెట్లో పది కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో కూడా రూ.10 కోట్లు కేటాయించింది.
- శ్రీ న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించింది.