bala1

పోలీసులకు సీఎం దిశా నిర్దేశం

‘ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు’ అనే నానుడి ఉందని, పోలీసులు భగవంతుడి అవతారమెత్తి పేద వాళ్లకు, దిక్కూమొక్కూలేని వారికి, అసహాయులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారు ఎలాగోలా తమ పనులు చేసుకుంటారని, కానీ ఏ అండా లేని వారికే పోలీసుల అవసరం ఎక్కువుంటుందనే విషయం గుర్తు పెట్టుకుని విధులు నిర్వర్తించాలని కోరారు. బాధితులు, పేదలు, పీడితుల పక్షం వహించాలని పిలుపునిచ్చారు.

కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాకుండా సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్న పోలీసులు అభినందనీయులని సీఎం అన్నారు. పేకాట, గుడుంబాలను అరికట్టడంలో విజయవంతమైన పోలీసులు కల్తీలు, నకిలీలు, మోసాల నుంచి ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు.
bala2
తెలంగాణ వస్తే నక్సలిజం, తీవ్రవాదం పెరిగిపోతుందనే అపోహలను పటాపంచలు చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత పోలీసులదని ముఖ్యమంత్రి ప్రశంసించారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రితో పాటు అనేక మంది తెలంగాణ పోలీసుల పని తీరును ఎన్నో సార్లు ప్రశంసించడం తనకెంతో సంతోషంగా, గర్వంగా ఉందని సీఎం చెప్పారు. పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో మరో 15వేల మంది ఉద్యోగులను నియమించడంతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

రాష్ట్ర స్థాయి పోలీసు అధికారుల సదస్సు హెచ్‌ఐసిసిలో జరిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభోపన్యాసం చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, డిజిపి అనురాగ్‌ శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ మహేందర్‌ రెడ్డి, డిజిలు అంజనీకుమార్‌, కష్ణప్రసాద్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

”తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమానికి యూనిఫామ్‌లో ఉండి కూడా పోలీసులు తమ వంతు సహకారం అందించారు. అందరం కలిసి కష్టపడి తెలంగాణ సాధించుకున్నం. సాధించుకున్న తెలంగాణను అభివద్ది చేసుకునే విషయంలో కూడా పోలీసులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పోలీసు వ్యవస్థ అత్యంత కీలకమైన వ్యవస్థ. ఇది బాగుంటేనే మిగతావి బాగుంటాయి. నేను కూడా శాంతిభధ్రతలు బాగుంటే వేరే విషయంపై దష్టి పెట్టగలుగుతున్నాను. లేదంటే దీంతోనే సరిపోయేది. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, తీవ్రవాద సమస్యలు ఎక్కువవుతాయని, శాంతిభధ్రతల సమస్యలు తలెత్తుతాయని అపోహలు స ష్టించారు. కానీ మన పోలీసులు చాలా తక్కువ సమయంలోనే ఆ అపోహలను పటాపంచలు చేశారు. ఈ ఘనత మన పోలీసులదే. నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి మన పోలీసుశాఖను ఎన్నో రకాల ప్రశంసిస్తుంటారు. కనీసం ఓ డజను సార్లు ప్రశంసించి ఉంటారు. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడమే కాకుండా దేశ భద్రతా వ్యవస్థకు దోహదపడే విధంగా పనిచేస్తున్నారు. యంగెస్ట్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియా… గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఇన్‌ ఇండియాగా మారింది. ఇది నాకు సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తున్నది. కొంత మార్పు వచ్చినప్పటికీ పోలీసు శాఖ ఇంకా మెరుగుపడాలి. పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి. స్నేహభావం కలగాలి. పోలీసు శాఖ కూడా ఉన్నతం కావాలి. మహిళా పోలీసు ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాలి. నేను భూపాలపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మహిళా పోలీసులు కొన్ని సమస్యలు చెప్పారు. వారికి కొన్ని సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.bala3

పదోన్నతులు కల్పించాలి
”పోలీసు శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలి. అన్ని విభాగాల్లో అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. అవసరమైతే సూపర్‌ న్యూమరీ పోస్టులు సష్టించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి సేవలను వినియోగించుకున్నప్పుడు వారికి కావాల్సిన పదోన్నతులు, దక్కాల్సిన గౌరవం అందాలి. రిటైరైన ఉద్యోగులకు కూడా చివరి రోజే పెన్షన్‌ డబ్బులు అందాలి. రిటైరైన ఉద్యోగిని ఘనంగా సన్మానించి, పోలీస్‌ వాహనంలోనే ఇంటిదాకా దించి రావాలి. అప్పుడు
ఉద్యోగులకు నైతికబలం వస్తుంది” అని సీఎం సూచించారు.

”తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మరెక్కడా లేని విధంగా పోలీసుల సంక్షేమానికి, పోలీసుశాఖ పటిష్టానికి చర్యలు తీసుకున్నాం. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాం. దాదాపు 4వేల కొత్త వాహనాలు సమకూర్చాం. ఇంకా అవసరమైన కొత్త వాహనాలను సమకూర్చుకోవాలి. దీనికోసం రూ.500 కోట్లు విడుదల చేస్తాం. 12వేల మందిని కొత్తగా నియమించాం. రాబోయే కాలంలో మరో 15 వేల మందిని నియమిస్తాం. ఎస్‌.ఐ.లు, డిఎస్పీల పోస్టులను కూడా భర్తీ చేస్తాం. ట్రాఫిక్‌, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేసే వారికి రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్నాం. పోలీసు స్టేషన్ల నిర్వహణకు ఆయా స్టేషన్ల స్థాయిని బట్టి నెలకు రూ.25,000, రూ.50,000, రూ.75,000 ఇస్తున్నాం. ఇంకా పోలీసు శాఖకు ఏమి కావాలో చెబితే వాటిని సమకూరుస్తాం. ఈ విషయంలో ఏ స్థాయి అధికారి అయినా సరే మాకు సలహా ఇవ్వవచ్చు” అని సిఎం చెప్పారు.

కల్తీ నిరోధానికి చర్యలు

”పోలీసులు అనేక విషయాల్లో గొప్పగా, అద్భుతంగా పనిచేశారు. పేకాట, గుడుంబాను అరికట్టడంలో అద్భుత విజయం సాధించారు. రౌడీయిజం, గుండాయిజం కూడా తగ్గింది. షీ టీమ్స్‌ గొప్పగా, అద్భుతంగా పనిచేస్తున్నాయి. మహిళలకు భద్రత ఏర్పడింది. మట్కా, గుట్కాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. మట్కా, గుట్కాలపై కఠినంగా వ్యవహరించాలి. కల్తీ, నకిలీ, మోసాలపై పోలీసులు దష్టి పెట్టాలి. కారం, పసుపు, పాలు, గుడ్లు, బియ్యం ఇలా ప్రతీ వస్తువు కల్తీ అవుతోంది. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ పాసుపోర్టులు వస్తున్నాయి. అనేక విషయాల్లో ప్రజలకు మోసాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటి విషయంలో కూడా పోలీసులు దష్టి పెట్టాలి. టోపీపైనా, బెల్టుపైనా, లాఠీపైనా భారతదేశ అధికారిక చిహ్నాలైన మూడు సింహాలు ధరించే గొప్ప అవకాశం, అదష్టం పోలీసులకు కలిగింది. కాబట్టి మీపై గొప్ప బాధ్యత ఉంది. తన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్క అక్రమం కూడా జరగొద్దు అని పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అనుకుంటే ఒక్క నేరం కానీ, మోసం కానీ జరగదు. ఈ విషయంలో మీరు గట్టిగా పనిచేయాలి. పోలీసులు బాధితులు, పీడితుల పక్షం నిలవాలి. డబ్బున్నొళ్లు, పలుకుబడి కలిగినోళ్లు ఎలాగోలా పనులు చేయించుకుంటరు. కానీ పేదవారికి దేవుడే దిక్కు. మీరు దేవుళ్లుగా మారాలి. అసహాయులకు, పేదవాళ్లకు, బాధితులకు అండగా నిలవాలి. వారికి న్యాయం చేయాలి. మా ప్రభుత్వంతో పోలీసులపై రాజకీయ వత్తిళ్లు లేవు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా పనిచేసే స్వేచ్ఛ పోలీసులకు ఉంది. ఈ అవకాశాన్ని పోలీసులు సద్వినియోగ పరుచుకోవాలి” అని ముఖ్యమంత్రి కోరారు.

”పట్టణాలు, నగరాల్లో కొత్త తరహా నేరాలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో రకరకాల నేరాలను అదుపు చేయడానికి హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి, సైబరాబాద్‌ కమీషనర్‌ గా పనిచేసిన సివి ఆనంద్‌ గొప్పగా విధులు నిర్వర్తించారు. అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. ఇతర కార్పొరేషన్లు, నగరాల్లో కూడా శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని మహేందర్‌ రెడ్డిని కోరుతున్నా. పోలీసులు తమ విధులే కాకుండా ప్రభుత్వం అప్పగించిన ఇతర బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో సివి ఆనంద్‌ గొప్పగా పనిచేస్తున్నారు. షీ టీమ్స్‌ పెట్టి స్వాతిలక్రా, గుడుంబా నియంత్రణ విషయంలో అకున్‌ సభర్వాల్‌ బాగా పనిచేస్తున్నారు. ఇంకా అనేక మంది పోలీసులు సామాజిక బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారు. అందరికీ అభినందనలు” అని ముఖ్యమంత్రి చెప్పారు.

వ్యంగ్యోక్తులతో నవ్వించిన ముఖ్యమంత్రి
జిల్లాస్థాయిలో ఎస్పీ ఆధ్వర్యంలో మీటింగ్‌ పెట్టుకుంటరు. ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు కలిసి మాట్లాడుకుంటరు. దాని పేరు క్రైమ్‌ మీటింగ్‌ అని పెట్టుకుంటరు. పోలీసులంతా కూర్చుని క్రైమ్‌ మీటింగ్‌ పెట్టుకుంటరా? దొంగలు క్రైమ్‌ మీటింగ్‌ పెట్టుకుంటరు” అని ముఖ్యమంత్రి వ్యంగ్యోక్తి విసరడంతో సదస్సులో నవ్వులు పూసాయి. క్రైమ్‌ మీటింగ్‌, క్రైమ్‌ రివ్యూ, క్రైమ్‌ స్టేషన్ల పేర్లు మార్చాలని సిఎం సూచించారు.

పుష్పగుచ్చం అందించిన పోలీసు జాగిలంbala4

సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన పోలీస్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. పోలీసు జాగిలం పుష్పగుచ్చం ఇచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికింది. ఇతర జాగిలాలు కూడా సిఎంకు సెల్యూట్‌ చేశాయి. బాంబు స్క్వాడ్‌, ప్రొటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ ఎక్విప్మెంట్‌, సెర్చ్‌ అండ్‌ డిటెన్షన్‌ ఎక్విప్మెంట్‌ ను సీఎం

Other Updates