‘బంగారు తెలంగాణ’ సాధనలో భాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. వీటి సాధన కొరకు ఇప్పటికే ప్రభుత్వం అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభివద్ధికీ, శాంతి భద్రతలకీ విడదీయలేని సంబంధం ఉంది. శాంతి భద్రతలు బాగా ఉంటేనే అభివద్ధి సాధ్యమౌతుంది.
రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ దిశగా ఆలోచించి హోం శాఖ పరిధిలో ఉన్న అనేక శాఖలు ముఖ్యంగా పోలీస్ శాఖ పటిష్ఠతకు, ఆధునీకరణకు అనేక చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను ఆధునీకరించడానికి కొన్ని వందల కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో విధానాలు పకడ్బందీగా అమలవుతున్నాయి.
మంచి మొబిలిటీ కొరకు పోలీస్ శాఖకు దాదాపు 350 కోట్లకు పైగా వ్యయంతో ఆధునిక
ఉపకరణాలతో కూడిన వాహనాలు, బ్లూ కోల్ట్ మోటార్ సైకిళ్ళు సమకూర్చడం జరిగింది. ప్రస్తుత అవసరాల రీత్యా, 500 కోట్లతో వాహనాల కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్ సిటీ లకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు వాహనాలు సమకూర్చడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ సిస్టం మెరుగుపడింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆఫీసర్లకి, సిబ్బందికి ఈ దిశలో కావాల్సిన శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన చోట పోలీస్ స్టేషన్, పోలీస్ ఆఫీసర్లకు, నూతన భవనాలు నిర్మిస్తున్నారు, పాత వాటికి అవసరమైన రిపేర్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నారు, దీని కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా, విజిటర్ల, ఇతరుల కొరకు వెయిటింగ్ హాల్ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ దిశగా, నిధులు కేటాయించడం జరిగింది. మొట్ట మొదటిసారిగా, పోలీస్ స్టేషన్లు, బ్యారెక్‌ల నిర్మాణానికి ప్లాన్డ్ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
పోలీస్ సర్టిఫికెట్లు, పోయిన డాక్యుమెంట్లుపొందుటకు, పోయిన వస్తువుల కేసుల కొరకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ మరియు పౌరులకు మరింత సులువుగా పోలీస్ సేవలను అందించుటకు ఐటి ఆధారిత ఆప్స్ ప్రవేశ పెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ప్రవేశపెట్టారు, అమలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లు పౌరులకు స్నేహపూర్వకంగా ఉండేటట్లు చేస్తున్నారు. ఇతర ఆఫీసులకు పనులనిమిత్తం పౌరులు ఎటువంటి జంకు లేకుండా ఎలాగైతే వెళతారో, అదే విధంగా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళగలిగేటట్లు భరోసా ఇస్తున్నారు. తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ సెంటర్‌ను ఆధునీకరించి, స్టేషన్‌కు వచ్చే పౌరులతో సమన్వయం పెంపొందించడం చేస్తున్నారు
మహిళా భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైన, ప్రధానమైన అంశం. రాష్ట్ర అవతరణ జరిగిన వెనువెంటనే, మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం, ఆ కమిటీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో అమలుచేస్తున్న విధానాలను సమీక్షించి, నివేదిక ఇచ్చింది. ఇట్టి నివేదిక పై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ”షీ” టీం లను ఏర్పాటు చేశారు. వీటిపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. పోలీస్ వ్యవస్థ లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు, సివిల్ పోలీస్ రిక్రూట్మెంట్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు. పోలీస్ స్టేషన్లలో మహిళల కొరకు వివిధ మౌలిక సదుపాయాలూ కల్పిస్తున్నారు.
మూడు వందల రెండు కోట్ల అంచనా వ్యయంతో అత్యంత అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని బంజారా హిల్స్‌లో నిర్మిస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ భారతదేశ పోలీస్ వ్యవస్థలోనే ఒక అపూర్వ ఘట్టంగా ఉండబోతోంది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది ఇరవై నాలుగు పద్దెనిమిది అంతస్తుల ట్విన్ టవర్స్‌తో పోలీస్ మ్యూజియం, రూఫ్‌పై హెలిపాడ్ సౌకర్యంతో పాటు …క్రిమినల్స్ ఇంటిగ్రేటెడ్ డాటాబేస్, ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ వ్యవస్థ, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ, సుమారు వేయి మందికి సరిపోయే ఆడిటోరియం ఇతర ప్రపంచ శ్రేణి సౌకర్యాలు, సాంకేతికతలను కలిగి ఉంటూ…..హైదరాబాద్ దిగ్గజ నగరానికి ఒక మైలురాయిగా ఉండబోతోంది. అంతే కాక ఇది పోలీసులతో పాటు ప్రభుత్వ శాఖలన్నిటికీ సహాయకారిగా ఉంటుంది.
నగరంలో మొత్తం లక్ష సీసీటివి కెమెరాల వ్యవస్థ ఏర్పాటు జరుగుతోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం పదివేల సీసీటివి కెమెరాలను సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలు, అన్ని జంక్షన్లలో ఏర్పాటు జరుగుతోంది. పౌర భద్రతా చర్యల అమలు చట్టంలోని నిబంధనల ప్రకారం దాదాపు తొంభై వేల కెమెరాలను కమ్యూనిటీ సీసీటివి ప్రాజెక్టు క్రింద ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ ఒక లక్ష సీసీటివి కెమెరాలు పోలీసు స్టేషన్ స్థాయి కమాండ్ కంట్రోలు కేంద్రాలకు, జోనల్ డీసీపి కార్యాలయాలకు, నూతనంగా నిర్మిస్తున్న కేంద్రీకత ప్రధాన కమాండ్ సెంటర్‌కు అనుసంధానించ డమవుతుంది. సీసీటివి వ్యవస్థ ప్రాజెక్టు వ్యయం ఆరు వందల యాభై ఏడు కోట్లు. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయడమవుతుంది. ఈ వ్యవస్థ నేర నివారణ, నేర నిర్ధారణ, నేర పరిశోధనలోనే కాకుండా, ట్రాఫిక్ వ్యవస్థలో, ఇతర ఎమర్జెన్సీ, ఎక్జిక్యుటివ్ శాఖలకి కూడా వారి విధుల నిర్వహణలో ప్రముఖంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత, పోలీస్ స్టేషన్‌లో సేవలను మెరుగు పరుస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు నిర్వహణ ఖర్చుల కొరకు ఎక్కడా లేని విధంగా నిధులు కేటాయిస్తున్నారు. ప్రతి నెలా సిటీ పోలీస్ స్టేషన్‌కు డెబ్బై ఐదు వేలు, అర్బన్ పోలీస్ స్టేషన్‌కు యాభై వేలు, రూరల్ పోలీస్ స్టేషన్ కు ఇరవై ఐదు వేలు మంజూరు చేస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమం.
పోలీస్‌శాఖలో ఇప్పటికే పది వేలకుపైగా పోలీస్ కాని స్టేబుల్ పోస్టులు, ఐదు వందల ముప్పై తొమ్మిది ఎస్సై పోస్టుల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్‌లు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ పద్ధతులలో… వర్తమాన అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు తీసుకు వచ్చారు. నిరుద్యోగ యువతను దష్టిలో ఉంచుకొని నియామకాలకు వయో పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది.
పోలీస్ సంక్షేమం కొరకు కూడా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. హోం గార్డులకు వేతనం నెలకు 20 వేలకు పెంచారు, ఇంత వేతనం దేశంలోని మరే రాష్ట్రంలో లేదు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఉగ్రవాద, తీవ్రవాద, అసాంఘిక శక్తుల చర్యలలో చనిపోయిన పోలీస్, సాధారణ పౌరుల కుటుంబాలకి, గాయపడిన పోలీసులకి అత్యుత్తమ ఎక్స్-గ్రేషియా ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించింది. హోంగార్డులను కుడా ఈ ఎక్స్-గ్రేషియా ప్యాకేజ్‌లో మొట్ట మొదటిసారిగా చేర్చారు.
చనిపోయిన వారి కుటుంబాలకు పెంచిన ఎక్స్-గ్రేషియా
కానిస్టేబుల్‌కు 25 నుండి 40 లక్షలు
హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్సై వరకు-25 నుండి 45 లక్షలు
ఇన్స్‌పెక్టర్ నుండి అడిషనల్ ఎస్పీ వరకు 30 నుండి 50 లక్షలు ఎస్పీలు, అధికారులు- 30 లక్షల నుండి ఒక కోటి
హోం గార్డులకు 30 లక్షలు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చాం
సాధారణ పౌరులు పది లక్షల నుండి 25 లక్షలు.
ట్రాఫిక్ నిర్వహణ కొరకు ఐటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తు న్నారు. ఇప్పటికే, హైదరాబాద్-సైబరాబాద్‌లలో చలాన్లు
ఏకీకతం చేస్తూ ఆన్-లైన్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సైబరాబాద్‌లలో క్యాష్ లెస్ చల్లాన్ల పద్దతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి వల్ల సిబ్బందిని ఇతర ముఖ్యమయిన విధులకు ఉపయోగించుకోవడానికి వీలు ఉంది. ట్రాఫిక్ సిబ్బంది వారి విధులు నిర్వర్తించే సమయంలో మరింత పారదర్శకత కొరకు సిబ్బందికి బాడీ కోర్న్ కెమెరాలు ప్రవేశపెట్టారు. దీనివల్ల, సిబ్బంది వాహన దారులను ఏదైనా విషయంలో ఆపి ప్రశ్నించే సమయంలో వారి సంభాషణ రికార్డు అవుతుంది, తద్వారా పారదర్శకతకు వీలు కల్పించడమే కాకుండా, అవినీతికి తావులేకుండా చేస్తున్నారు. ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడానికి సంకల్పించారు. హైదరాబాద్ సైబరాబాద్ కమీషనరేట్ పరిధులలో సిగ్నల్ రహిత ట్రాఫిక్ వ్యవస్థకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తున్నారు, ప్రణాళికలు చేస్తున్నారు. దీని కోసం స్కైవేలు, ఫ్లైఓవర్‌ల నిర్మాణం కొరకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రణాళికలు చేసింది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ప్రతినిత్యం వాయు శబ్ద కాలుష్యానికి గురవుతూ… వివిధ ఊపిరి తిత్తుల, శ్వాసకోసవ్యాధుల బారిన పడుతున్న విషయం దష్టిలోఉంచుకొని పొల్యూషన్ అలవెన్స్ మంజురు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణా రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం శాంతి సామరస్యాలకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి కుల మతాలకు అతీతంగా పండుగలను అధికారికంగా నిర్వహిస్తోంది. పండుగలు, పర్వదినాలు శాంతియుతంగా జరిగేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలు చేసిన కషి అభినందనీయం. అయితే, సంఘ విద్రోహ శక్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేకుండా శాంతి భద్రతలు కాపాడడానికి, కరడుగట్టిన అనేక మంది నేరస్తులపై పీడీ ఆక్ట్ ప్రయోగించి డిటెయిన్ చేశారు. నేరాల అదుపునకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
వరంగల్ పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు, సైబరాబాద్ కమీషనరేట్‌ను పరిపాలనా సౌలభ్యం కొరకు, ప్రభావవంతమైన పోలీసింగ్ కొరకు కొన్ని సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ… సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లుగా విభజించడంతో పాటు కరీంనగర్, నిజామాబాదు, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం కమీషనరేట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నేర పరిశోధనకు- నివారణకి, ఆర్గనైజ్డ్ నేరాల నిరోధానికి, సైబర్ నేరాల అదుపు కొరకు, ఐటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సిబ్బందికి తగు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీస్ శాఖకు, సిబ్బందికి అవసరమైన ఆధునిక వస్తు సామగ్రి సమకూర్చడం జరుగుతోంది.
భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేపడుతున్నందున వారి శిక్షణకు కావలసిన వసతి, సౌకర్యాలు కల్పించుటకు ప్రస్తుతం ఉన్న పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లలో వసతి, తరగతి గదులు, మౌళిక వసతులు ఇతర అవసరమైన సదుపాయాలను సమకూరుస్తున్నారు. ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణం జరుగుతోంది.
అగ్నిమాపక శాఖను కూడా ఆధునీకరిస్తున్నారు. ఈ మధ్యనే ఈ శాఖ ద్వారా పౌరులకు ఉత్తమ సేవలు అందించడానికి…. శాఖ వెబ్-సైట్ మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే, చర్లపల్లి పారిశ్రామిక వాడ, రంగా రెడ్డి జిల్లా, ఐ.కే.పి. నాలెడ్జ్ పార్క్, జినోమ్ వాలీ, శామీర్‌పేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్‌ల్లో కొత్త ఫైర్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్లు లేని మొత్తం 17 అసెంబ్లీ నియోజక వర్గాలకి ఫైర్ స్టేషన్లను మంజూరు చేయడానికి నిర్ణయించారు. ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అదే విధంగా, అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్న వివిధ ప్రాంతాలలో, హైదరాబాద్, వరంగల్ నగరాలలో కొన్ని ప్రాంతాలలో కూడా ఫైర్ స్టేషన్ లు నెలకొల్పడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అంతే కాకుండా, 16 ఫైర్ అవుట్ పోస్టులను పూర్తి ఫైర్ స్టేషన్లుగా మారుస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, ట్రాఫిక్ రద్దీని తట్టుకుని ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకొనే లోపు కొన్ని కొన్ని సార్లు, నష్టం ఎక్కువ అవుతోంది. దీనిని, అధిగమించడానికి, కొత్తగా, ఫైర్ మోటార్ సైక్లిళ్ళు ప్రవేశపెట్టారు. ఇవి కొంత వరకు అగ్నిని నిలుపుదల చేసే కెమికల్‌ను కలిగి ఉంటాయి. అంతే కాకుండా, వీరు ప్రమాద స్థలానికి ముందుగానే చేరుకొని, తగిన జాగ్రతలు తీసుకోవ డానికి, సూచనలు చేయడానికి అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలలో నష్టాన్ని తగ్గించడానికి, నివారించడానికి… ఇది ఒక సరికొత్త ప్రయోగం.
విచారణలో ఉన్న ఖైదీలను బెయిలుపై విడుదల అయ్యే వరకు, శిక్ష పడిన ఖైదీల శిక్షా కాలం పూర్తి అయ్యేవరకు భద్రంగా మంచి పరిసరాలలో ఉంచి, సంస్కరించి తిరిగి సమాజంలో కలిసేటట్లు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఖైదీలకు యోగ్యమైన వసతి, ఆహారం, దుస్తులు, పడక మొదలగునవి కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు, దేశంలోనే అత్యున్న తంగా ఉన్నాయి. క్రమశిక్షణ, సత్ప్రవర్తన కల జీవిత- జీవితేతర ఖైదీల విడుదల కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వివిధ జైళ్ళలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. జాతీయ ప్రిజన్ అకాడమీ నెలకొల్ప డానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం అంచనా 350 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే ఈ అకాడమీ కొరకు రంగారెడ్డి జిల్లా వికారా బాదులో 100 ఎకరాల స్థలం కేటాయించింది. త్వరగా నిధుల విడుదల కొరకు కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జైలు, కొన్ని సబ్‌జైళ్ళ నిర్మాణం చేపట్టినందున నిధులు కేటాయించారు.
వివిధ ప్రభుత్వ సంస్థలకు, దేవాలయాలకు, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎస్.పి.యఫ్. శాఖ సెక్యూరిటీ కల్పిస్తుంది. ఈ శాఖకు ఆధునిక సౌకర్యాలతో ట్రైనింగ్ అకాడమీ కొరకు స్థలం ఇప్పటికే కేటాయించారు. దీని నిర్మాణం కొరకు నిధులు కేటాయించడం జరిగింది.
ఎప్పుడు లేని విధంగా, హోంశాఖకు ప్లాన్ బడ్జెట్‌లో నిధులు కేటాయి స్తున్నారు. రాష్ట్ర హోం శాఖను దేశం లోనే ఆదర్శ వంతమైన శాఖగా తీర్చి దిద్దుతు న్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఇందుకో నిదర్శనం.
శ్రీనివాసరావు