కాలేజిల సద్వెటప్పుడు మేము మషిరబాద్ల ఒక అర్రల కిరాయికి ఉండెటోల్లం. గా అర్ర పెద్దగుండేది. నేను, ప్రమోద్, నర్సిమ్మరెడ్డి గా దాంట్ల ఉండెటోల్లం. గా దాంట్లనే వొండుకునెటోల్లం. గా దాంట్లనే పండుకునేటోల్లం. గది మషిరబాద్ చౌరస్తకు దగ్గర్లనే ఉండేది. ఇగ దాంతోని మా కాలేజి దోస్తులు మా అర్రకు వొచ్చెటోల్లు. శానసేపు ముచ్చట బెట్టుకుంట గూసునేటోల్లు. ముచ్చట్లంటె మా సదువు గురించి గాదు. సిన్మల గురించి. ఆనంద్ సిన్మల రాజేశ్‌కన్నా యాక్షన్ బాగుందని ఒకడంటె, లే అమితాబ్ బచ్చన్ యాక్షన్ బాగుందని ఇంకొకడనేటోడు. దాంతోని గాల్లిద్దరి నడ్మ బైస్ నడిచేది. మా దాంట్ల కొంతమంది ఒకని దిక్కు ఉంటె ఇంకొంత మంది ఇంకొకని దిక్కు ఉండి బైస్ జేసెటోల్లు. గిదే గాకుంట కాలేజికి ఎన్నడు డుమ్మగొట్టి సిన్మకు బోవాలనేటి దాని మీద గూడ మాట ముచ్చట నడ్సేది. ఏ ¬టల్ల ఏం బాగుంటదనే దాని మీద గుడ్క ముచ్చట బెట్టెటోల్లం. మా కాలేజి పోరగాల్ల కాలేజే. మా కాలేజీల ఒక్క పోరి గూడ లేకుండ ?ట్కె మాకు మేమే బనాయించుకునేటోల్లం. కాలేజికి బోతుంటె తొవ్వల పోరిలు గండ్లబడెటోల్లు. ఊరిల్లిె సదువుకునెతందుకు మేము పట్నమొచ్చుండె బట్కె మేము గాల్ల తెరువు బోయేదిగాదు. మా కాలేజీల సద్వేటి పట్నం పోరగాల్లు పోరిలను బనాయించెటోల్లు. ??ని ఒక్కొక్క పారి పోరిలతోని గాల్లు తిట్లు దినెటోల్లు.
గీ నడ్మ మా సెక్షన్ల అంటె బిఎస్‌సి (ఎంపిసి) ఫస్టు ఈయర్ల ఒక పోరడు షరీకైండు. గాని పేరు సుబ్బారావు. గాని సొంత వూరు ఏలూరు. గాల్ల నాయినకు పట్నం తబాదిల అయ్యింది. గాయిన దప్తర్ మా కాలేజి దగ్గర్లనే ఉన్నది. ఇగ దాంతోని గాయిన గాన్ని మా కాలేజిల షరీక్ జేసిండు. ముందుగాల సుబ్బారావు నాయిన పట్నమొచ్చిండు. ఆఫీసర్ల షరీకైండు. కిరాయికి ఇల్లు దీస్కుండు. దీస్కున్నంక కారటేసిండు. గాయినేసిన కార?? ముట్టినంక సుబ్బారావు గాడు గాల్ల అమ్మను యెంటబెట్కోని రేల్‌గాడి ఎక్కిండు. గాడు పట్నంల అందరు హిం?ల లేకుంటె ఉర్దుల మాట్లాడ్తరని అనుకునేటోడు. ఎట్లన్న హిం? నేర్సుకోవాలని గాడు అనుకుండు. గని ఎవలన్న ఒకరితాన గాకుంట ఆనంతట గాడే హింది నేర్సుకోవాలని గాడు అనుకుండు. రొండు సార్లు ఇంటె ఎంత గొట్టుదైన గూడ నోటికొస్తదని గాడు అనుకునేటోడు. మస్తు తెలివి ఉన్నదని గాడు అందరికి జెప్పుకునేటోడు.
హిం? రాకున్నా రాదని జెప్పెటోడు గాదు. వొచ్చినోని లెక్క యాక్టింగ్ జేసెటోడు. హిం? మాటకు అర్థం ఎర్క లేకున్నా ఏదో ఒకటి అనెటోడు. ఎవ్వరో మాట్లాడంగ ఇనెటోడు. గదే గీడు మల్ల అనెటోడు. అని అవులగాడు అయెటోడు.
సుబ్బారావు, నేను ఒకపారి ఛాయ్ దాగెతందుకు మషిరబాద్ చౌరస్తల ఉన్న ఇరానీ ¬టల్కు బోయినం. పాత దోస్తుతోని గిన బోతె వన్ బై టూ ???????????????? ??????????????????????????????????????????????? బాగుండదనుకున్న??
??దో ఛాయ్ లావ్?? అని సర్వర్‌కు జెప్పిన. ఇద్దరం ఛాయ్ దాగినం.
ఇంతల మా దోస్తు ఒకడు ¬టల్లకు వొచ్చిండు. గాడు, నేను గల్వక శానదినాలైంది.
??కైసే హై రే?? అని గాడు అడిగిండు.
??అచ్ఛా హూ?? అని నేను అన్న
??ఛాయ్ గిన దాగుత వారా??? అని అడిగితె
??నోట్లె పాన్ ఉన్నదిరా?? అని గాడు అన్నడు.
జెరసేపు ముచ్చట బెట్టి గాడు బోయిండు.
గదే దినం పొద్దు మీకినంక సుబ్బారావు ఒక్కడే ఇరానీ ¬టల్కు బోయిండు.
???? ఛాయ్ లావ్?? అని అన్నడు.
దో అంటె రొండు అని గాన్కి ఎర్కలేదు. నేను అనంగ ఇన్నడు. గాడు అన్నడు. రొండు ఛాయ్‌లు ??గ శాతగాక గాడు ఒక్కటే ఛాయ్ దాగిండు. గని సచ్చుకుంట రొండు ఛాయ్‌లకు పైసలిచ్చిండు. ఇయ్యకుంటె ¬టలోడు ఊకో??? గదా.
గీన్కి హిం? రాదని ఎర్కలేక మా కాలేజీల
కై సే హైరే అని ఒకడు గీన్ని అడిగిండు
బచ్చా హూ అని గీడు అన్నడు.
జంగల్ సే ఆయేరే గదే అని గాడు అడిగితె
జంగల్ మే మంగల్ అని గీడు అన్నడు.
గీన్కి హిం? రాదని గాన్కి ఎర్కైంది.
సుబ్బారావు గాడు ఆనంతల ఆడే హిం? నేర్సుకునేతందుకు గీ నడ్మ హిం? సిన్మలు బగ్గ సూడబట్టిండు. గంతే గాకుంట హింది సిన్మ పాటలు గున్ గునాయించబట్టిండు. గీ నడ్మ గాడు ఆరాధన సిన్మ జూసిండు. ?రూప్ తేరా మస్తానా పాటను పాప్ తేరా సస్తానా, యార్ మేరా దీవానా, బూల్‌్ కహీ హవ్‌ుసే నా జేయే? అన్కుంట పాడిండు. హిం? సిన్మపాటలను ఆన్కి వొచ్చిన తీర్గ ఆడు పాడుతడు.
గాడు గిన ఉంటె మేము హిం?ల మాట్లాడెటోల్లం. మేము మాట్లాడుతుంటె గాడు ఇనెటోడు. మా మాటలకు అర్తం ఎర్కలేకున్నా ఎవలన్న ఏమన్న అడిగితె మల్ల గవే మాటలను జెప్పెటోడు.
ఒకపారి మేమందరం ¬టల్కు బోయినం.
??అరే సుబ్బిగా ఛాయ్ జెప్పురా?? అని నేనంటె
??పాంచ్ ఛాయ్ పీ ఆవ్?? అని గాడు సర్వర్‌కు జెప్పిండు. గాడు గట్ల జెప్పంగనే సర్వర్ ఒక్క తీర్గ నగిండు. మేము నల్లురమే ఉన్నం.
దోమే చార్ అని ప్రమోద్ గాడు జెప్పిండు. రొండిట్ల నాల్గు ఛాయ్‌లు జేసి సర్వర్ దెచ్చిండు. ఛాయ్ దాగుతుంటె
తువ్‌ు కౌన్ హైరే అని ప్రమోద్, నర్సిమ్మరెడ్డిని అడిగిండు.
మై కుత్తా హూ గదా హూ సువ్వర్ హూ, జంగ్లీ హూ, జాన్‌వర్ హూ పాగల్ హూ అని నర్సిమ్మరెడ్డి అన్నడు.
సుబ్బారావును తప్పు తొవ్వ బట్టిపిచ్చి ఏడిపిచ్చెతందు గాడు గట్ల అన్నడు.
రొండు దినాలైనంక
?????వ్‌ు కౌన్ హై?? అని ఎవరో సుబ్బారావు నడిగితె..
??మై కుత్తా హూ గదా హూ సువ్వర్ హూ జంగీ హూ, జాన్ వర్ హూ?? అని జెప్పి నవ్వుల పాలైండు.
ఒక పారి సుబ్బారావు బజార్లల్లిె బోబట్టిండు.
తొవ్వ??ంటి బోయెటోడు..
??చార్మినార్ కిదర్ హై?? అని ఎదురంగ వొచ్చెటోన్ని అడిగిండు.
??నై మాలూవ్‌ు?? అని ఎదురుంగ వొచ్చినోడు జెప్పిండు.
??సెక్రటేరియట్‌కు కైసే జానా??? అని ఒకడు పక్కనున్నోడిని అడిగిండు.
??నై మాలూవ్‌ు?? అని పక్కనున్నోడు జెప్పిండు.
గీడ ఎవ్వరు ఏమడిగినా నై మాలూవ్‌ు అనాలెనేమో అని సుబ్బారావు అనుకుండు.
??తుమారా నావ్‌ు క్యా హై రే?? అని గీన్ని కాలేజిల ఒకడు అడిగితె..
నై మాలూవ్‌ు అని గీడు అన్నడు.