telanganaశ్రీ అన్నవరం దేవేందర్‌

ఊర్లల్ల ఎన్ని కులాల అంత్రాలున్నా మల్ల ఊరన్న కాడ ఒక కట్టుబాటు ఉంటది. ఊల్లె ఎన్నో, వైరుద్యాలుంటయి. అయినా మనుషుల మధ్య పంచాయతీలు వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటడు. పెద్ద మనిషి అంటే నియ్యతి ఉంటది. ఊరు కులాలుగ విడిపోయి ఒక్క ఊరుగ కలివిడిగనే ఉంటరు. ఇంటింటికి మట్టి పొయ్యి ఉన్నట్టు ఇంటికో ముచ్చట మాట్లాడుకునేది ఉంటది. ఎందుకంటే ఏరు పడేటప్పుడు, గెట్లకాడ పంపకాల కాడ పంచాయితి ఉంటది. ఇగ ఇంట్లది ఇంట్ల ూడా అత్తా కోడండ్లు, యారండ్ల లొల్లిలు ఉండనే ఉంటయి. ఇవన్ని ూడా నిదా నంగ నియ్యతిగ తెంపేందుకు పెద్దమ నుషులు ఉంటరు. వాళ్ళు పంచాయితీ చేస్తరు. దేనికదే తెల్లగోలు చేస్తరు. ఏ రకమైన మనస్ఫర్ధలు అయినా సరే స వాలక్ష ఉదాహరణలతో పరిష్కరిస్తారు.

పంచాయితి ఒక్క ఇంట్ల జరిగింది అనుకో అప్పడు అదే కులం ఓ పెద్ద మనిషి ఉంటే ఆయనకు ఫిర్యాదు అయితరు. ఆయన చిన్న పంచాయితీ అంటె ఆలుమగలు, అత్తాకోడలు, అన్నదమ్ములది అయితే మందలిచ్చి సర్దుబాటు చేస్తడు. ఇంకా పెద్ద భూముల జాగల పంచాయితీ అయితే అది వేరే కథ నడుస్తది. ఇంట్లది ఇంట్ల గాకుంట కులపోల్ల మధ్య పంచాయితీ అయితే కులపెద్ద దగ్గరికి ఒగలు ఫిర్యాదు అయితరు. ఆయన కథ అంతా ఇని అవతలి పక్షంను పిలి పిస్తడు. పంచాయితీ పెట్టుడే అంటే చెరి ఇద్దరి పెద్ద మనుషులను తెచ్చు కొమ్మంటడు. కులపెద్ద సదరు పెద్దమ నిషిగ ఉంటడు. వాళ్ళు చెరి ఇద్దరి పేర్లు ఇస్తరు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యన దడ్వతు తీసుకుంటరు. దడ్వతు అంటే పైసలు డిపాజిట్‌ చేసుకోవడం, చెరి యాభైవేలు లేదా లక్ష వరకు నగదు లేదా బంగారం తీసుకొని ఒక వారం నిర్ణయిస్తరు.

పంచాయితీ జరిగే రోజు వరకు ఎవల పెద్ద మనుషులకు వాళ్ళు వాళ్ల పంచాయితీ కథ అంత ఇన్పిస్తరు. ఇన్నంక పంచాయితీ రోజు ఈ పెద్దమనుషులే గాకుండా కులపోల్లు పెద్దలు వచ్చి చెట్లకింద ూకోని ఇంటరు. రెండు పక్షాల వాదనలు అయిపో యినంక ఆ నల్గురు పెద్ద మనుషులు కల్సిమాట్లాడుకు నేతందు కు బయటకు పోయివస్తరు. కొన్ని కొన్ని పంచాయితీలల్ల వాయి దాలు ూడా ఏస్తరు. ఒక్కసారి పంచాయితీ తెంపరు. రెండు మూ డు సార్లు ూసున్నంక తెంపుతరు. పెద్దమనుషులు బయటికి పో యి ఎట్ల తెంపాలననే ఆలోచించి న్యాయమైన పరిష్కారం రాస్తరు.

ఊళ్ళె ఏ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు ఎట్ల పంచాయితీ చేసిండు అనే విషయం అందరిల నానుతది. ఒకరకంగా కోర్ట్‌ తీర్పుల లెక్కనే ఉంటది. ఇసోంటి పంచాయితీలు ఊర్లల్ల నుంచి పట్నాల దాకా ఉంటయి. నిజానికి పోలీసు వ్యవస్థకు న్యాయవ్యవస్థకు పని కల్పించకుండానే ఈ వ్యవస్థ పని చేస్తుంది.

పెద్ద మనుషులు పంచాయితీ తీర్పు తయారు చేసి సదర్ల పెద్ద మనిషికి ఇనిపిస్తరు. ఆయన కొన్ని మార్పులు చేసినంక మల్ల ఒక్క ఆలోచనకు వస్తరు. అప్పడు సదర్ల పెద్ద మనిషి తీర్పు సదివి వినిపిస్తడు. అప్పుడు తప్పని సరిగవినాలె. లేకుంటే చెప్పినట్టు వినకుంటే దడ్వతు రద్దు చేస్తరు. ఇంక ఎక్వ తక్వ మాట్లాడ్తేే కులంలల్లిె ఎల్లగొడ్తరు.

ఈ పంచాయితీల దగ్గర పెద్ద మనుషుల పాత్ర గొప్పగా ఉంటది. అనుభవజ్ఞులను మాటకారులను నియ్యతి గల్లోలను పెద్దమనుషులుగా ఎన్నుకుంటరు. వాళ్ళ వాస్తవ విరుద్దంగా వ్యవహరిస్తే పెద్ద మనిషి ¬దా కోల్పోతరు. దాంతోని ఊరి గౌరవం పోగొట్టుకున్న వాళ్ళయితారు. ఇసొంటి పంచాయితీలు కులం వాళ్ళ మధ్యన అయితయి. లేదా ఊరందరి మధ్యన ూడా అయితయి. ఎక్కడ పంచాయితీ అయినా పంచాయితీల నాడు కల్లు గుడాల ఇతర ఖర్చులు ఏమన్న ఉంటే తీసి కర్సు చేస్తరు. ఆ మిగిలిన వాటిని వాల్లకు ఇచ్చి పంచాయితీ తీర్పు మీద సంతకం పెట్టిచ్చుకుంటరు. అప్పుడు అమలు చేస్తరు. సాధారణంగా ఊరికి పెద్దమనిషి సర్పంచ్‌ ఉంటడు. ఆయన సమక్షంలోనే పంచాయితీలు జరుగుతయి.

పెద్ద మనుషుల్లో రకరకాలు ఉంటరు. కొందరు వాల్లకు కావల్సిన తీరుగ మేనేజ్‌ చేయబడుతరుకని అది అంతట జరుగది. ఊళ్ళె ఏ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు ఎట్ల పంచాయితీ చేసిండు అనే విషయం అందరిల నానుతది. ఒకరకంగా కోర్ట్‌ తీర్పుల లెక్కనే ఉంటది. ఇసోంటి పంచాయితీలు ఊర్లల్ల నుంచి పట్నాల దాకా ఉంటయి. నిజానికి పోలీసు వ్యవస్థకు న్యాయవ్యవస్థకు పని కల్పించకుండానే ఈ వ్యవస్థ పని చేస్తుంది. ముఖ్యంగా విడాకులు వివాహేతర సంబంధాల పంచాయితీలను ూడా చాలా జాగ్రత్తగా డీల్‌ చేస్తరు. ఎన్ని ఉండగూడని లక్షణాలున్నా పది ఉదాహరణలతో కలిపే ప్రయత్నం చేస్తరు. సాధారణంగా చిన్న చిన్న పంచాయితీలు అయితే పెద్ద మనుషులు గద్రిచ్చి పెట్టి కోప్పడుతారు. ఊరన్న కాడ ఏ కులం వాళ్ళకైనా వరుసలు పెట్టి పిలుసుకుంటరు. అదే వరుసలతో కాస్త పరుశంగానైనా తప్పు చేసినోల్లను మందలిస్తరు. బాగా పైసలుగల భూములు జాగలు ఉన్నవాళ్ళ పంచాయితీలు అయితే వీళ్ళతోని తెగయి. అవి రెండు మూడు సిట్టింగ్‌ లు ూసోని ఠాణాకు పోవల్సిందే. పైసలు, భూములతో ముడివడి ఉన్న ముచ్చట ఊర్ల కోర్టుల చుట్టూ తిరుగవలసిందే.

ఎన్కటి కాలం నుంచి ఊర్లంటే ఒక సామూహిక కుటుంబ భావన. ఇందులో ఎన్ని అంతరాలు వ్యతిరేకతలు అణచివేతలు ఉన్నా మన ఊరు మా ఊరు అనే భావనా సంప్రదాయం కొనసాగింది. అదే సంప్రదాయంకు అనుగుణంగా కొన్ని మార్పులు రావచ్చు గాని ఇంకా పెద్ద మనుషుల తీర్పులు కొనసాగుతున్నాయి. ఊర్లకు ఇప్పుడు టెలిఫోన్‌, సెల్‌ ఫోన్‌, మధ్యం దుకాణం, రాజకీయ పార్టీల జండాలు వచ్చిన తరువాత పూర్వపు సమైక్యత చైతన్యం కొంచెం లోపిస్తుంది. గడిచిన తరాలకున్న ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం ఈ తరంలో కన్పిస్తలేదు. కాకుంటే ఎవరికి వారే, ఎవరి సంసారం వారే ఎవరి పంచాయితీ వారే ననే విడివడే భావన ఎక్కువైంది. వ్యవసాయం, ఆర్థిక చైతన్యం, కొనుగోలు సంస్కృతి, వస్తు వ్యామోహం, పట్టణీకరణ ప్రభావం వల్ల ఊర్లల్ల ఉండే ఇదివరకటి సంబంధాల మధ్య పొరపచ్చాలు కన్పిస్తున్నయి. ఏది ఏమైనా పంచాయితీలు లొల్లులు కొట్లాటలు, చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు పెద్దమనుషుల కౌన్సిలింగ్‌’ కల్చర్‌ తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో భాగం మంచిని మంచి అనుడు, చెడును చెడు అనుడు పెద్ద మనిషులందరి ధర్మంగా విలసిల్లుతున్నది. ఎన్ని విరుద్ధ భావాల వైరుధ్యాలున్నా అంతిమంగా సమాజాన్ని ఊరిని మనుషులను పట్టించుకునుడు ఆలోచించుడే అసలైన కర్తవ్యం.

Other Updates