తొలి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఛైర్మన్‌తోపాటు కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘనేత సి.విఠల్, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీ, మాజీ ఎమ్మెల్యే డా॥ బానోతు చంద్రావతిలను జీవో 169 ద్వారా ప్రభుత్వం నియమించింది.
కమిషన్ కార్యదర్శిగా స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన సీనియర్ అధికారి సుందర్ అబ్నార్‌ని టిఎన్‌పీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. కమిషన్ సభ్యులు ఆరేండ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. 2015 సంవత్సరాన్ని ఉద్యోగనామ సంవత్సరంగా మలుస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ధృఢ నిశ్చయంతోవుందని, నిరుద్యోగులెవ్వరూ ఆందోళన పడవలసిన అవసరంలేదని అన్నారు. ఇకనుంచి ఉద్యోగాల భర్తీ నిరంతరం జరుగుతూనే వుంటుందని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. నిపుణులతో చర్చించి శాస్త్ర సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని, ఇకముందు ఆన్‌లైన్ పద్ధతిలో పనిచేసే దిశగా అడుగులు ముందుకువేస్తాం అని అన్నారు ఘంటా చక్రపాణి.
హోం
»