gantaతెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల జాతీయ సదస్సు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 19న గుజరాత్‌ లో జరిగిన 19వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల చైర్మన్ల సదస్సులో చక్రపాణిని ఈ పదవికి ఎన్నుకున్నారు. ఈ బాధ్యతల్లో ఆయన మూడేళ్ళపాటు ఉంటారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను బలోపేతం చేయడం, అభ్యర్థులకు మేలైన సేవలు అందించేందుకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కోహ్లీ ఘంటా చక్రపాణిని అభినందించారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఘంటా చక్రపాణి ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టి.ఎస్‌.పి.ఎస్సీ అవలంబించిన వినూత్న విధానాలు ఉద్యోగార్థులకు మేలు చేకూర్చాయని, ఈ బాటలోనే మిగతా రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు సయితం నడుచుకుంటాయన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తంచేశారు.

Other Updates