వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డిి జాతీయస్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యే అవార్డును అందుకున్నారు. చాణక్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌లో ఈ అవార్డు ప్రదానం జరిగింది. బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి ఈ అవార్డు ప్రదానం చేశారు. కేంద్ర సహాయమంత్రి రామేశ్వర్‌తేలి శాలువాకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే తనకు ఈ అవార్డు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ సాహాసోపేత నిర్ణయాలే రాష్ట్రాన్ని అత్యుత్తమ స్థానంలో ఉంచాయన్నారు. ఆయన ఆదేశాల మేరకే నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలిగామన్నారు.

Other Updates