parabramhaతెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో అహర్నిశలూ కృషి చేసిన చరిత్ర పరిశోధకుడు శాసనాల శాస్త్రిగా పేరుగడించిన డాక్టర్‌ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి జులై 20న స్వర్గస్తులయ్యారు. వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, కడప జిల్లాల్లో అనేక గ్రామాలను తిరిగి, ఎన్నో శాసనాలను కనుగొని వాటిని భద్రపరిచారు. ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖలో పాతిక సంవత్సరాలు సేవలందించిన పి.వి. పరబ్రహ్మ శాస్త్రి దాదాపు రెండువేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. భారత చరిత్రకారులెందరికో పరబ్రహ్మశాస్త్రి మార్గదర్శకుడిగా నిలిచారు.

Other Updates