పరిశుభ్ర సిరిసిల్లా లక్ష్యంగా పారిశుధ్య ప్రణాళికలు ఉండాలని మంత్రి కె. తారక రామారావు జిల్లా యంత్రాంగాన్ని అదేశించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. గ్రామ పారిశుధ్య ప్రణాళికలో భాగంగా రూపొందించిన కార్యక్రమాల అమలుపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.

ఇప్పటికే జిల్లా బహిరంగ మల విసర్జిత రహిత హోదాను(ఒడియఫ్‌) సాధించామని, ఇదే స్ఫూర్తితో పారిశుధ్య ప్రణాళికను కూడా విజయవంతం చేద్దామన్నారు. లిక్విడ్‌ వేస్ట్‌, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహాణ) ప్రాధాన్యతగా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి అదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల (సోక్‌ పిట్స్‌) నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లాలో

ఉన్న సూమారు 90 వేల గహాలకు ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని మండలాల వారీగా యంపిడివోలు, గ్రామాలు, వార్డుల వారీగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు.

గ్రా మ పారిశుధ్య కమిటీల అధ్వర్యంలో సంతప్త స్థాయిలో (సాచ్యురేషన్‌) ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాను యూనిట్లుగా మార్చుకుని, ముందు గ్రామస్థాయిలో సర్వే నిర్వ హించాలన్నారు. ఈ సర్వే ద్వారా నిర్మించాల్సిన వ్యక్తిగత, కమ్యూనిటీ, కామన్‌ ఇంకుడు గుంతల సంఖ్యను నిర్ధారించుకుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయితీలు, పాఠశాలలు, అంగన్‌ వాడి కేంద్రాలు, అరోగ్య

కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. వీటి నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం పెంచేలా వారిని చైతన్యం చేయాలన్నారు.

ఇప్పటికే జిల్లాలో 9500 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయిందని అధికారులు మంత్రికి తెలియజేశారు. నాగంపేట, చెక్కపల్లి లాంటి పలు గ్రామాల్లో వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం

పూర్తయిన నేపథ్యంలో, అక్కడి అనుభవాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇంకుడు గుంతల నిర్వహాణలో ఎదురవుతున్న అనుభవాలను పరిశీలించాలన్నారు. జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థతో సంప్రదించి ఇంకుడుగుంతల నిర్మాణం, నిర్వహాణకు సంబంధించి గ్రామీణాభివద్ధి శాఖ తాజా మార్గదర్శకాలు ఇవ్వాలని పంచాయితీ రాజ్‌ శాఖ కమీషనర్‌ రఘునందన్‌ రావును మంత్రి కేటీఆర్‌ కోరారు. దీంతోపాటు జాతీయ ఉపాధిహమీ పథకం కింద చేపట్టాల్సిన పాఠశాల కిచెన్‌ షెడ్డుల నిర్మాణం, హరితహారం వంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని కమీషనర్‌ను కోరారు. పారిశుధ్య నిర్వహాణలో భాగంగా వందశాతం వైకుంఠధామాల (శ్మశనాలు) నిర్మాణం, గ్రామాల్లో చెత్త సేకరణ, డంప్‌ యార్డులు, కంపోస్టింగ్‌ ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. సిరిసిల్లా నియోజకవర్గం పైన హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి, పలు శాఖల అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనులపైన సమీక్షించారు. నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో పనుల పురోగతి వివరాలు తెలుసుకున్న మంత్రి, పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అదేశించారు. పాఠశాలలకు అవసరం అయిన వివిధ కార్యక్రమాలపైన విద్యాశాఖాధికారులు మంత్రికి వివరాలు అందించారు. పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, వంతెనలు, గోడౌన్లు, కమ్యూనిటీ భవనాల పురోగతిని సైతం సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కష్టభాస్కర్‌ తోపాటు పంచాయితీరాజ్‌ కమీషనర్‌ రఘునందన్‌ రావు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Other Updates