kurrentరాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి పారిశ్రామీకరణే మార్గం. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్‌ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పగిస్తారు. దానిని అన్నిరకాలుగా అభివృద్ధిచేసి ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో పరిశ్రమల కోసం ఈ భూమిని కేటాయిస్తారు. ఈ భూమికి విద్యుత్‌, నీళ్ళు సరఫరావంటి పనులుకూడా టి.ఎస్‌.ఐ.ఐ.సి. చేపడుతుంది. ఇందుకోసం ఈ సంస్థకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.

  • శ్రీ సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకం రూపంలో చెల్లించాల్సిన 638 కోట్ల రూపాయల బకాయిలుకూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలకు విద్యుత్‌ సబ్సిడీకోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.
  • శ్రీ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే ఐ.టి.ఐ.ఆర్‌. ప్రాజెక్టు కోసం రూ. 90 కోట్లు
  • శ్రీ ఎస్‌.సి.లలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 97.51 కోట్లు ప్రతిపాదించారు.
  • శ్రీ దుర్భర స్థితిలో ఉన్న పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకోవడానికి పేద కార్మికులకు ఉన్న రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థికమంత్రి తెలిపారు.

Other Updates