magaతెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అభివృద్ధికి, హరితహారానికి చేస్తున్న కృషికి చేయూత నిచ్చేందుకు గాను భాషా, సాంస్కృతిక శాఖ ‘హేవళంబి’ ఉగాది సందర్భంగా కవితా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలకు మొత్తం 780మంది తమ కవితల్ని పంపించిండ్రు. మొత్తం ఈ సంకలనంలో 164 కవితలున్నాయి. చెట్టు చుట్టూ అల్లుకున్న తెలంగాణ జీవితాల్ని కవులు ఇందులో రికార్డు చేసిండ్రు.

ఈ పుస్తకాలన్నింటినీ భిన్న సామాజిక వర్గాల వారితో ముందుమాటలు, ఆశీస్సులతో వెలువరించారు. మంత్రిగా ఆజ్మీరా చందులాల్‌, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారిల ముందు మాటలు రాశారు. ఈ పుస్తకాలకు తమ వ్యాఖ్యానాలతో ఆప్యాయతను జోడించారు.

అయితే భాషా సాంస్క ృతిక శాఖ ఒకటి రెండు విషయాల్లో సవరణలు చేసుకోవాల్సి ఉన్నది. ఈ పుస్తకాల సలహా మండలిలో కొందరికే ఎక్కువ సార్లు అవకాశం దక్కింది. అట్లా గాకుండా ఆ యా రంగాల్లో కృషిజేసిన వారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్ప జెప్పినట్లయితే ఎక్కువమందిని అక్కున జేర్చుకోవడానికి వీలయితది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న వులకే ఎక్కువ సార్లు, జిల్లాల్లో ఉన్న కవులకు తక్కువ సార్లు కవి సమ్మేళనాల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతోందని విమర్శ ఉన్నది. ప్రణాళిక బద్దంగా పనిచేసినట్లయితే దీన్ని అధిగమించడం పెద్ద ఇబ్బందేమీ కాదు.

– సంగిశెట్టి శ్రీనివాస్‌

Other Updates