పూర్వ ప్రధానమంత్రి, తెంగాణ ముద్దుబిడ్డ పి.వి. నరసింహారావుకు ‘మరణానంతరం భారతరత్న పురస్కారం’ ప్రకటించాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ మేరకు సభలో తీర్యానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ…
అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాను సంవత్సర కాంపాటు ఘనంగా నిర్వహించడానికి తెంగాణ ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్ 28 వతేదీన పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ శతజయంతి ఉత్సవా నిర్వహణ ద్వారా పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవను ప్రజందరూ ఉజ్వంగా స్మరించుకునేలా చేయాని తెంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది.
ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలోఒకటిగా భారత దేశం నివడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూకారకుడు పీవీ నరసింహారావు. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పీవీ నరసింహారావు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం.
ఆధునిక భారతదేశ చరిత్రను ముపు తిప్పిన నాయకు ఇద్దరే ఇద్దరు. ఒకరు స్వాతంత్రానంతరం ‘‘జవహర్ లాల్ నెహ్రూ, మోడరన్ ఇండియా నిర్మాత’’. రెండవవారు పీవీ నరసింహారావు, ‘‘గ్లోబల్ ఇండియా నిర్మాత’’.
పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతు స్వీకరించిన సమయంలో దేశం సమస్య సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్నది. దేశ ఆర్థికస్థితి అధోగతిలో ఉంది
సోవియట్, అమెరికా నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతున్నసంధికాంలో అంతర్జాతీయంగా అనేక మార్పు చోటుచేసుకుంటున్నాయి. కాలానుగుణంగా పరిణామశీంగా ఆర్ధిక దృక్పథంలో మార్పు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితు నడుమ దేశం నిబడి ఉన్నది. ఇంకో దిక్కు పంజాబ్ లో వేర్పాటువాదం బుసు కొడుతోంది. కశ్మీర్ లో ఉగ్రవాదు మారణహోమం కొనసాగిస్తున్నారు. వీటన్నిటితో పాటూ మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెకొల్పాలి. కాం విసిరినా ఇన్ని సవాళ్ళ నడుమ తనదైన, దార్శనికతతో, ధైర్యంగా ముందడుగు వేశారు పివి నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా వేగంగా, చాకచక్యంగా, సమర్థవంతంగా అము చేశారు.
రాజకీయాతో సంబంధంలేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ని ఆర్థికశాఖామంత్రిగా నియమించి పివి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాతో దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేశారు. లైసెన్స్, పర్మిట్ రాజ్‌ను అంతంచేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేటురంగం భాగస్వామ్యాన్ని పెంచారు. కూపస్థ మండూకంలా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి, దేశాన్ని బయటపడవేసి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగు తీయించారు.
నేడు భారతీయ మేధావు విదేశాలో ఉన్నతోద్యోగాు చేస్తున్నారన్నా, దేశానికి విదేశీ మారక ద్రవ్య న్విు పెద్ద ఎత్తున సమకూరాయన్నా, ఈనాడు దేశానికి ప్రపంచం నుదిక్కునుంచీ పెట్టుబడు తరలి వస్తున్నాయన్నా, స్వదేశీ కంపెనీు విదేశీ కంపెనీను కొనేస్థాయికి ఎదిగాయన్నా, ప్రభుత్వరంగ సంస్థలో సైతం పోటీతత్వం పెరిగిందన్నా, ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్నా, సగటు భారతీయుని జీవన శైలి ఎంతో మారిందన్నా వీటన్నిటి వెనకా పివి నరసింహారావు గారి దార్శనికత ఉంది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం.
పివి నరసింహారావు సంస్కరణనే వృక్షాునాటితే ఈనాడు మనం వాటి ఫలాు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానా విధాత, గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి.
భారత విదేశాంగ విధానంలో మేలి ముపు పీవీ దౌత్యనీతి ఫలితమే. అంతవరకూ సోవియట్ యూనియన్ తో మాత్రమే సంబంధాు కలిగిన భారత్ ను ఒకేఒక అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పీవీదే. భారత్ కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను సుముఖం చేసుకున్నది పీవీ వ్యూహమే. ‘ుక్ ఈస్ట్ పాసీ’ ప్రవేశపెట్టి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి ‘‘ఏషియన్ టైగర్స్’’ కి భారత్ ని చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది పీవీ దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్ ఈస్ట్ పాసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి, వాణిజ్య సంబంధాు పెంపొందించుకోవాని ప్రతిపాదించి, బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకుని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాు భారత్-చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పి.విదే.
ఉగ్రవాదు పీచమణచడంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న కేపీఎస్ గిల్ కు సంపూర్ణ మద్దతు, వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్‌లో శాంతిని పునరుద్ధరించారు. కె.ఆర్. వేణుగోపాల్ వంటి సమర్థులైన అధికారు సహకారంతో కాశ్మీర్‌లో శాంతి నెక్పొగలిగారు.
పివీ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనే భూ సంస్కరణకు నాంది పలికారు.
దేశంలో భూసంస్కరణను అత్యంత నిజాయితీగా అము చేసిన ముఖ్యమంత్రి ఆయన. 1972లో భూసంస్కరణ చట్టం తెచ్చారు.
భూస్వామ్య వర్గం కన్నెర్రచేసినా లెక్కచేయలేదు. భూగరిష్ట పరిమితి దాటిన వారు భూము ప్రభుత్వానికి అప్పజెప్పానే విధానాన్ని రూపొందించారు.
భూ సంస్కరణ స్ఫూర్తికి తనే ఆదర్శంగా నివాని తన స్వంతభూమి 800 ఎకరాు ప్రభుత్వానికి స్వాధీనం చేసారు. ఆభూమిని 479 మంది బ్ధిదారుకు అందేలా చూశారు.
పి వి చువవ్లనే తెంగాణలో పేదవాళ్ళకు భూమి భించింది. 93 శాతానికి పైబడి చిన్న కమతాున్న రైతు వ్యవసాయ వ్యవస్థ పివి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణ కారణంగానే ఏర్పడ్డది. భూసంస్కరణను చిత్తశుద్ధితో అముచేసినందుకు, ముల్కీ రూల్స్‌ను సమర్ధించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా పివి చలించలేదు. నిబద్ధతను కోల్పోలేదు.
రాష్ట్ర మంత్రిగానూ, కేంద్ర మంత్రిగానూ ఏ శాఖ నిర్వహించినా అందులో సంస్కరణు ప్రవేశపెట్టిన సృజనశీలి. నిత్య సంస్కరణాభిలాషి పివి నరసింహారావు.
అనన్యసామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్య పట్ల లోతైన అవగాహన ఉన్న పివి గారు వివిధ శాఖలో అనేక అభివృద్ధికరమైన సంస్కరణను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర విద్యామంత్రిగా గురుకు పాఠశాలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరు శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలు నెకొల్పారు. ఈ విద్యాయాు గ్రామీణ విద్యార్థుకు నేటికీ ఉచితంగా
ఉన్నత ప్రమాణా విద్యను అందిస్తున్నాయి. ఈ విద్యాయాలో శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయి పదవు పొందారు. ఉన్నత ఉద్యోగాలో రాణించారు. నేటికీ రాణిస్తున్నారు.
ఏడు నుండి పదవతరగతి వరకు మధ్యన ఉండే తరగతులో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేసారు. ప్లిు జీతగాళ్ళుగా, బాకార్మికుగా డ్రాప్ ఔట్స్‌గా మిగిలిపోతున్నరనే ఉద్దేశ్యంతో మానవీయ కోణంలో ఆలోచించి, ఆయన ఈ సంస్కరణ చేసారు
అన్ని కోర్సు అకడమిక్ పుస్తకాన్నీ తొగులో భించానే ఉద్దేశ్యంతో తొగు అకాడమీని నెకొల్పారు.
జైళ్ల మంత్రిగా బహిరంగ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. శిక్షార్హులో, ఖైదీలో పరివర్తనకు ఓపెన్ జైళ్ళు ఉపయోగపడతాయని విశ్వసించిన మానవీయమూర్తి పి.వి. విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ ను గుర్తించి ఆ దేశంతో ప్రప్రథమంగా దౌత్యసంబంధాు నెకొల్పారు. దేశీయాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా విధానపరంగా అనేక కొత్త పుంతు తొక్కారు.
పివి వ్యక్తిత్వం ఒక సహస్రదళపద్మం- అనేక కోణాున్న సమున్నత వ్యక్తిత్వం. పివి బహుభాషా కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త బాగంగాధర తిక్, పండిత గోవిందవ్లభ్ పంత్, కే. ఎం. మున్షీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారి సరసన లెక్కించదగిన అఖండ పాండిత్యం ఉన్నవాడు.
తొగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, పర్షియన్ మొదలైన భారతీయ భాషతో పాటూ ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలోను అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు.
రాజకీయాలో మునిగితేుతూనే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘‘వేయిపడగు’’ అనే బృహన్నవను హిందీ భాషలోకి ‘‘సహస్ర ఫణ్’’ పేరుతో అనుసృజించారు. అందరూ వేయి పడగు నవకు పి.వి. చేసింది అనువాదం అనుకుంటారు కానీ అది అనుసృజన అని, స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘వేయిపడగు’’ నవ అనేక పాత్రు, సన్నివేశాతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది.
‘‘క్లిష్టతరమైన ఈ నవను పి.వి అనుసృజన చేసినతీరు చూస్తే హిందీ నుంచి తొగులోకి నేను అనువాదం చేసానా అనేంత గొప్పగా ఉన్నదని’’ విశ్వనాథ సత్యనారాయణ అంతటి వారు అంతగా ప్రశంసించారంటే పి వి పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వేయిపడగు నవను బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా పి.వి. అభివర్ణించారు.
‘‘అబలా జీవితం’’ అనే మరాఠీ నవను తొగులోకి అనువాదం చేసారు.
తెంగాణ సాయుధ పోరాటంలో తన అనుభవాకు అక్షర రూపాన్ని ఇస్తూ ‘గ్లొ రామవ్వ’ అనే అత్యద్భుతమైన కథ రాసారు. ఈ కథలో ఆనాడు తెంగాణలో రామవ్వ వంటి సామాన్యు చేసిన త్యాగాను గొప్పగా చిత్రించారు. ఇంకా ఎన్నో కథు, పద్యాు, గేయాూ, నవలికూ రాశారు. ఆయన ఉపన్యాసాలో భాషా సాహిత్య పరిమళాు, గుబాళించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది.
విశ్వనాథ సత్యనారాయణకి, సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ పురస్కారాు భించడం వెనుక, కాళోజి నారాయణ రావుకి పద్మవిభూషణ్ బిరుదు రావడం వెనుక పి వి కృషి దాగివుంది. మనవాళ్ళ ప్రతిభ జాతీయ
స్థాయిలో మెగులోకి రావడానికి పివి వారధి అయ్యారు.
ఒక చిన్న గ్రామంలో పుట్టి, విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు, విశ్వవిద్యాయం నుంచి బహిష్కరణ చేసినాకూడా పీవీ వెరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది, గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గు రాంకిషన్ రావు దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ మొదు పెట్టినప్పటికీ పీవీ, పత్రికా సంపాదకత్వం పట్ల, రామానంద తీర్థ నాయకత్వంలోని స్వతంత్ర పోరాటం పట్లనే మొగ్గు చూపించారు. అద్భుతమైన గ్రహణ, ధారణ శక్తి పీవీ సొంతం. పేద పట్ల సానుభూతి, ప్రయోగశీత, పార్టీ పట్లా, ఆదర్శా పట్లా అంకితభావంతో పివి రాజకీయ ప్రస్థానం సాగించారు. గాంధీ, నెహ్రూ పట్ల ఆరాధానాభావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీం ఆయనను ఉన్నత పథంలో నడిపించాయి. ఎన్నో శిఖరాు ఎక్కించాయి.
1991లో ఎన్నికలో పోటీ చేయకుండా హైద్రాబాద్‌కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన పీవీ, రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతరం అఖిభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై, దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్ఠించారు. ప్రధానిగా భారత దేశాన్ని ప్రపంచ పరిణామాకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటూ, విమర్శకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి, తెంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచమేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆస్యం అయింది. పీవీ శతజయంతి
ఉత్సవాను తెంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో, వచ్చే పార్లమెంట్ సమావేశాలో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.
తీర్మానం:
తెంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణ సారథి, అరుదైన దౌత్యనీతికోవిదు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వమైన దాయి నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాముపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవా సందర్భంగా ప్రకటించానీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించానీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయానికి పీవీ నరసింహారావుగారి పేరు పెట్టానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది.
– క్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి