krishna-pushkaramకృష్ణానది విశిష్టతను, ప్రాశస్థ్యాన్ని సవివరంగా అందించిన పుస్తకం ఈ పుష్కర కృష్ణవేణి. తెలంగాణ రాష్ట్రంలో పారే కృష్ణానదిని ఆనుకొనివున్న పుణ్యక్షేత్రాల, స్థల పురాణాలతోపాటు చారిత్రక ఆధారాలను చక్కగా వివరించడం బాగుంది. కృష్ణాతీర సాహితీ ప్రముఖుల వివరాలు, వారు రచించిన వివిధ గ్రంథాల వివరాలు పొందుపరచడం, పాఠకులను విశేషంగా ఆకర్షించే అంశాలు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే పుష్కరాల సందర్భంలో ఆచరించవలసిన విధివిధానాలు, కృష్టవేణి పుష్కర కథ, పుష్కర మంత్రాలు, పుష్కర జ్ఞాపకాలు వగైరాలన్నీ కూడా చదువరులను ఆగకుండా చదివించే అంశాలు. ఈ పుస్తకంలో ఉన్న 38 అంశాలు వేటికవే పాఠకులను వశపరుచుకునే మంచి విషయాలు. ఈ అంశాలన్నింటినీ ఒక వరుస క్రమంలో అందించడానికి రచయిత పడిన శ్రమ అందరికీ అర్థమవుతుంది. రచయిత డా|| భీంపల్లి శ్రీకాంత్‌ ఈ విషయంలో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. పుష్కరాలకు సంబంధించిన పుస్తకంగా భావించకుండా అందరూ కూడా తమ పుస్తకాల షెల్ఫ్‌లో తప్పనిసరిగా భద్రపరచదగిన పుస్తకమిది.

Other Updates