పెంబర్తిలో మెటల్‌వేర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ క్లస్టర్ ఏర్పాటుకు అయ్యే రూ.1.81 కోట్ల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.49 కోట్లు ఆర్థిక సాయంగా లభించనున్నది. ఈ మేరకు భువనగిరి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా లేఖ రాశారు. ఈ క్లస్టర్ ఏర్పాటు వల్ల పెంబర్తిలో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలకు ప్రయోజనం, వారి కళాఖండాలకు మార్కెటింగ్ సౌకర్యం ఏర్పడుతుంది. సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధుల పథకం (స్ఫూర్తి) కింద పెంబర్తిలో ఇత్తడి కళాఖండాల తయారీ (మెటల్‌వేర్) క్లస్టర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా భువనగిరి ఎంపీ డాక్టర్ గౌడ్ చేసిన విజ్ఞప్తిని స్కీమ్ స్టీరింగ్ కమిటీ ఇటీవల చర్చించి ఆమోదం తెలిపింది. ఈ క్లస్టర్ పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందించాలని, లోహ తయారీ కార్మికులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయం సత్వరం అందే విధంగా చొరవ తీసుకోవాలని ఎంపీకి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కల్‌రాజ్‌మిశ్రా పేర్కొన్నారు. పెంబర్తిలో క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసినందుకు కేంద్రమంత్రికి ఎంపీ డాక్టర్ గౌడ్ కతజ్ఞతలు తెలిపారు.
హోం
»