kcrతెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని బీజింగ్‌లో భారత కౌన్సిలర్‌ నామ్‌ గ్యా సి కంపా (చీూవీ+్‌ూ జ ఖనూవీూూ) అన్నారు. క్యాంపు కార్యాలయంలో డిసెంబర్‌ 15న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావును కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇటీవల తాను చైనా సందర్శించిన సందర్భంగా పలు కంపెనీలతో మాట్లాడామని, చాలా మంది తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారని, వివిధ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌ కూడా వచ్చి ఇక్కడి పరిస్థితిని స్వయంగా చూసి వెళ్లారని సిఎం వివరించారు. హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు, కనీస అవసరాలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించారు.

ఈ సందర్భంగా కంపా మాట్లాడుతూ, చైనాలోని పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టిఎస్‌ ఐపాస్‌ చట్టాన్ని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంపైనా అధ్యయనం చేశాయని, సానుకూలంగా ఉన్నాయని వివరించారు. రాబోయే కాలంలో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణలో తమ సంస్థలు ప్రారంభిస్తాయన్నారు. ఆమెతో పాటు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి గౌరవ్‌ శ్రేష్ట కూడా ఉన్నారు.

ఈ సమావేశంలో సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సిఎం అదనపు కార్యదర్శి శాంతి కుమారి, టి.ఎస్‌.ఐ.ఐ.సి ఎం.డి ఇ.వి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates