ఇదొక చరిత్ర.
దేశంలో ఎన్నడూ కనీ, వినని సరికొత్త రికార్డు. దేశానికే ఆదర్శం.
కొత్తగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చరిత్రను తిరగ రాస్తున్నారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామన్న మాటను ప్రభుత్వం ఆచరణలో చూపిస్తోంది. విజయదశమి పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. సూర్యాపేట, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాలలో ముఖ్యమంత్రి కె..చంద్రశేఖర రావు స్వయంగా ఈ గహ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా, వివిధ జిల్లాలలో రాష్ట్ర మంత్రులు శంకుస్థాపనలు చేశారు.
2015-16 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల గహాలు, ప్రతి నియోజక వర్గంలో 400 గహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్థేశించింది. ఈ నిర్మాణాలన్నీ కేవలం 6నుంచి 8 నెలలో పూర్తి కావాలని కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి గత ఏడాది దసరా రోజునే హైదరాబాద్ లోని బోయిగూడలో ఐ.డి.హెచ్ కాలనీలోని పేదలకోసం దాదాపు 400 గహాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపనచేసి డబుల్ బెడ్ రూమ్ గహాల పథకానికి అంకురార్పణ చేశారు.
ఈ గ హ సముదాయం నిర్మాణం పూర్తయి, లబ్ధిదారుల గహప్రవేశానికి సిద్ధంగా వున్నాయి.
”ఢిల్లీలో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ క్వార్టర్లకన్నా బాగున్నాయి. లబ్ధిదారులు అదష్టవంతులు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏమి చెప్పారో అదే చేసి చూపించారు.” అని ఈ ఇళ్లను స్వయంగా సందర్శించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ఈ గహాలను నిర్మించిన విధానం, గహ సముదాయాలలో కల్పించిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యానికి గురికానివారు ఎవరూ లేరు. ప్రజా ప్రతినిధులతోసహా, వివిధ వర్గాల ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి వీటిని సందర్శించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరహాలో రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇంటికలను నిజంచేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.