రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దతత్తకు తీసుకున్న గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట. ఇవి మెదక్ జిల్లా, జగదేవ్‌పూర్ మండల గ్రామాలు. వీటిని దతత్త తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన ఆలోచనలకు అనుగుణంగా దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలకోసం వివిధ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఇదివరకే అధికారులను ఆదేశించారు. తాను ఆదేశించిన ప్రకారం జరుగుతున్న పనులను ఒకసారి స్వయంగా పరిశీలించాలనుకుని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో మార్చి 4 నాడు ముఖ్యమంత్రి పర్యటించారు.
ఇక్కడ నిర్మించి సిద్ధంగా వున్న రెండు పడక గదుల ఇండ్లను, కూడవెళ్లి వాగు ఆధునీకరణ, ఎర్రకుంట, నల్లకుంట మరమ్మతు పనులను కూడా కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లలోకి వెళ్ళి ప్రతి గదిని పరిశీలించారు. ఇంటిముందు భాగం, వెనుకభాగంతో పాటు మేడపైకి ఎక్కి చూశారు. ఈ గ్రామాలలో అమలు జరపాలనుకున్న అన్ని పనులను పరిశీలించిన అనంతరం రెండు గ్రామాల ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు ఖరారయ్యాయి కాబట్టి త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ (పాములపర్తి) సాగర్‌లకు టెండర్లు పిలిచి సరిగ్గా రెండున్నరేళ్ళల్లో గోదావరి నీళ్ళ ను తీసుకునివస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు.
”రాబోయే రోజులలో ఈ ప్రాంతమంతా గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టులను నిర్మించుకుంటే మీరు బతుకుతారు. మేం బతుకుతం అని అంటే అక్కడి ముఖ్యమంత్రి ఒప్పుకున్నరు” అని కేసీఆర్ అన్నారు. ఇక్కడ అమలయ్యే డ్రిప్ ఇరిగేషన్ సాగు ఆదర్శవంతం కానున్నదని పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఈ రెండు గ్రామాలు దేశాని పాఠాలు నేర్పనున్నాయని” ఇక్కడ మనం చేస్తున్న పనులు ఒకేసారి అన్ని గ్రామాలల్లో చేసే పనులు కావు ప్రయోగాత్మకంగా నాలుగైదు గ్రామాలలో అమలు చేసి చూపిస్తే ఇదొక తొవ్వలాగా మిగతా గ్రామాలకు ఆదర్శమవుతుందని తెలియజేశారు. ”మే 15 నుంచి 30 తారీఖు లోపల, మంచి రోజు చూసుకొని పండుగ వాతావరణంలో కొత్త ఇండ్లల్లోకి పోదాం. అప్పటిలోపల ఇంటింటికి నల్లా నీళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులన్నీ పూర్తయితయి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇక్కడ పేదల కోసం నిర్మించిన ఇళ్ళు హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలలో వుండే విల్లాలను తలపిస్తున్నాయని, ఇక్కడి ఇళ్ళను చూసన వారందరూ తనతో ఇదేమాట అంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఈ గ్రామాలలో నెత్తిమీద కుండ వున్నట్టే ఉంటుందన్నారు. గోదావరి జలాలు, నిర్మాణం చేయబోయే జలాశాయాలలోకి వస్తే, ఇక్కడి వ్యవసాయదారులు భూగర్భ జలాల మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
నేను కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరు గ్రామానికి డబుల్ బెడ్‌రూం ఇళ్ళు మంజూరు చేసిన, అక్కడ టెండర్లేస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కాని జేసీ ఇక్కడ హుషారుగున్నడు . కిందామీదపడి ఇళ్ళు కట్టిస్తున్నాడు. అక్క డ, ఇక్కడ లెక్క గట్టోళ్ళూ లేరు. అందుకే వాళ్ళ వశం గాక ఆ జిల్లా అధికారులు ఇక్క డకి వచ్చి పనులు చూసిపొతున్నరు. ఇదు వరకు మీరే అధికారుల చుట్టూ తిరగవలిసి వచ్చేది. కాని ఇప్పు డు మీ దగర్గికే అధికారులు వస్తున్నారు. కావలసనిన్ని నిధులను ప్రభుత్వం ఇస్తుంది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్థులందరూ కలిసికట్టుగా పని చేయాలి. ఒకవేళ ఎవ్వరైనా కొంచెం అడ్డం తిరిగినా వాళ్ళను కూడా మీరు కలుపుకొని పోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
తల పెటన్టి జలాశయాలు అందు బాటులోకి వస్తే ఈ గ్రామాల రైతులు ఏడాదికి మూడు పంటలు పండించుకోవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఈ మూడు పంటల్లో రెండు పంటలు దతత్త తీసుకున్న వితన్త సంస్థల సలహామేరకు పండిస్తే, మూడో పంటలో కూరగాయలు, వగైరా పంటలు పండించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అని అన్నారు. దీనికోసం అవసరమైన సలహాలు, సూచనలను స్థానిక వ్యవసాయాధికారులు అందిసార్తని ముఖ్యమంత్రి తెలిపారు.
గ్రామాన్ని దతత్త తీసుకున్న వితన్తసంస్థలు రైతులు సాగుచేసిన పంటలకు ముందుగానే ధరను నిర్ణయించి చెప్తారు. ఎవరి భూమి వారిదే అయినా పొత్తుల వ్యవసాయం వుంటుంది. పైసలు మాత్రం ఎవరివంతువి వారి వస్తాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇట్ల చేయడం వలన రైతులు తమ ధ్యాసను పంటల మీదనే పెట్టి సాగుచేయడానికి వీలయితది. ఈ తీరుగ అన్ని రకాలుగా రెండు గ్రామాలను అభివృద్ధి చేసుకుని, తెలంగాణ కాకుండా యావత్ దేశాని ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించి చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో వుంచుకునే ఎర్రవల్లి, నర్సన్నపేటల కోసం తండ్లాడకుంట వెంటపడుతున్నా అని కేసీఆర్ అన్నారు.
ఇక్కడ వున్న అక్కాచెల్లెళ్లు ఒక్క పట్టుమీద వుండాలె. ఆడవాళ్ళంతా పట్టుపడితే పనులు పూర్తయితయి. మహిళల పెత్తనమున్న దగ్గరనే లక్ష్మీ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ గృహ యజమానులు మహిళలే. అక్కడ అన్ని పనులు సగబెట్టేది వాళ్ళే అంటూ ”ఇట్లా అంటున్నానని ఎర్రవల్లి అన్నదమ్ములు నా మీదకు కోపానికి రావద్దు. మీరు బాగుండాలనే అభిప్రాయంతోనే చెప్తున్నా”అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇక్కడ ఒక్క మాట చెప్తున్నా, ఏకాభిప్రాయంతో వున్న గ్రామస్థులకు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హనుమంతరావు, ఆర్డీవో ముత్యం రెడ్డి, ఇతర అధికారులకు అభినందనలు. మీ వెంట నేనున్నా, ప్రభుత్వం అండగా వున్నదని, ఇరు గ్రామాల ప్రజలలో ఆత్మబలాన్ని నింపే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.