ఉచిత శిక్షణతో.. 66 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు..
పేద కుటుంబాల్లో వెలుగులు
ఉద్యమాల పురిటి గడ్డ సిద్ధిపేట కేంద్రం ‘వారధి’ బంగారు తెలంగాణకు బాటలు వేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ.. పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్ ఇనిస్టిట్యూషన్ అధినేత జగద్వీశర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శిక్షణ యువతకు బాసటగా నిలిచింది. సిద్ధిపేట పత్తి మార్కెట్‌యార్డు వేదికగా నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రతిభ కలిగిన పేద అభ్యర్థులకు వరంలా మారింది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్‌కు నిర్వహించిన శిక్షణ శిబిరంలో సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజక వర్గాలకు చెందిన 170 మంది శిక్షణ తరగతులకు హాజరయ్యారు. శిక్షణ పొందిన వారిలో 66 మంది ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ తుది ఫలితాల్లో ఉద్యోగాలు సాధించడంతో ఆయా నిరుద్యోగ కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పేద వాడిగా పుట్టడం తప్పుకాదు..! అయితే పేద వాడిగా చనిపోవడమే తప్పు..! ూర్చున్నకాడి ఉద్యోగాలు రావు..! అహర్నిశలు కష్టపడితేనే మంచి ఉద్యోగం దరిచేరుతుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరుతారని రాషా్టని ఆదర్శంగా సిద్ధిపేటను అభివృద్ధిలో ముందుంచాం.! ఇదే తరహాలో ఉద్యోగ సాధనలో ముందుండాలని పలుమార్లు నిర్వహించిన సభ, సమావేశాల్లో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు మార్గనిర్ధేశనం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జి లాంటి 30 రకాల పుస్తకాలు తెప్పించి స్వయంగా అభ్యర్థులకు అందించారు. సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ ఆయా నాలుగు నియోజక వర్గాల ంద్రాల్లోని ఎమ్మెల్యేలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రిలివ్స్‌ుకు ఉచిత శిక్షణ ఇవ్వగా దాదాపు 1400 మంది యువతీ, యువకులు హాజరయ్యారు. ప్రిలివ్స్‌ు ఉచిత శిక్షణకు హాజరైన వారిలో 170 మంది మెయిన్స్‌కు అర్హత సాధిం చారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్‌కు నిర్వహించిన శిక్షణ శిబిరంలో సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజక వర్గాలకు చెందిన 170 మంది శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
ఇక్కడ శిక్షణ పొందిన వారిలో 66 మంది ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ తుది ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారు. శిక్షణ పొంది ఉద్యోగం సాధించిన వారిలో సిద్ధిపేట నియోజక వర్గం – 37, గజ్వేల్ నియోజక వర్గం – 12, దుబ్బాక నియోజక వర్గం -03, మెదక్ నియోజక వర్గం – 14 మంది ఎంపికయ్యారు.
మామిడాల రాము
మెయిన్స్‌కు ఊతమిచ్చిన వేదిక..
సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డు వేదికగా రెండు నెలల పాటు హైదరాబాద్ పీజేఆర్ శిక్షణ సంస్థకు చెందిన 13 మంది అధ్యాపకులతో ఉచిత శిక్షణ అందించింది. ఈ క్రమంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పుస్తక సామగ్రిని అందించడమే గాక నిత్యం ఉచితంగా మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్ అందించారు. ప్రత్యేకించి మహిళా అభ్యర్థులకు ఆవాసాన్ని కల్పించారు. చివరలో ప్రత్యేకించి గ్రాండ్ టెస్టులు నిర్వహించి.. ప్రముఖులతో కౌన్సిలింగ్ ూడా ఇప్పించారు. సీపీ శివకుమార్‌తో ూడా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయించారు. సిద్ధిపేట సీఐ సైదులు పర్యవేక్షణలో ఈ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారిలో 66 మంది ఉద్యోగాలు సాధించారు. వీరికి సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫోర్‌మన్ ఉద్యోగాలు వరించాయి. హైదరాబాద్‌లో ప్రిలివ్స్‌ు, మెయిన్స్ శిక్షణ తీసుకోవాలంటే.. ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.50వేలు ఖర్చయ్యేది. కానీ ఇక్కడ పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పేద విద్యార్థులు కొలువులు సాధించి తమ ఇళ్లలో వెలుగులు నింపారు.
ప్రయత్నం ఫలించింది.!
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉంది. వారికి మరింత పదును పెడితే ఐఏఎస్, ఐపీఎస్ వరకు ఎదుగుతారు. అందు తొలి ప్రయత్నంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాను. నా ప్రయత్నం వృథా కాలేదు. తాము నిర్వహిస్తున్న శిక్షణ ంద్రానికి వచ్చిన 66 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిసి చాలా సంతోషమైంది. మిగతా వారు ూడా నిరాశపడకుండా ఉద్యోగాల కోసం పోటీ పడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పోటీ పరీక్షలకు సంబంధించి ఇక నుంచి సిద్ధిపేటలో రెగ్యులర్‌గా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తా. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఉద్యోగంతో పాటు తల్లిదండ్రులకు, సమాజానికి సేవ చేయాలి. ఆ దిశగా అందరికీ నా వంతు సహకారం పూర్తిగా ఉంటుంది.
– తన్నీరు హరీశ్ రావు, భారీనీటి పారుదల శాఖ మంత్రి
నా కల నెరవేరింది..
మా నాన్న శర్ఫోద్ధీన్ ూరగాయలు అమ్ముతారు. అమ్మ వసీం సుల్తానా బట్టలు కుడుతుంది. మేం ఐదుగురం అక్కా చెల్లెలం. అయినా మమ్మల్ని బాగా చదివించారు. నాకు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని ఆశ. అది నా కల. నా ఆశయాన్ని సాధించుకునేందుకు మంత్రి హరీశ్ రావు ఏర్పాటు చేసిన శిక్షణ నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. నా కలను సాకారం చేసేందుకు దోహదమైంది. నా కలను మంత్రి హరీశ్ రావు సారు ఏర్పాటు చేసిన కోచింగ్, ఫ్రెండ్స్ సాయంతో నెరవేర్చుకున్నాను. నా లాంటి ఎంతో మంది పేద కుటుంబాల్లో ూడా ఇలాంటి శిక్షణ తరగతుల ద్వారా వెలుగులు నిండినయ్.
– తబస్సం, భారత్‌నగర్, సిద్ధిపేట
సివిల్ కానిస్టేబుల్ అయ్యాను.
బీటెక్ చదివినా.. ఎలాంటి ఉద్యోగం రాలేదు. హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. ఇలాంటి సమయంలో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ శిక్షణ శిబిరంలో హాజరయ్యేందుకు దరఖాస్తు పెట్టుకున్నాను. శ్రద్ధగా నెల రోజులు క్రమం తప్పకుండా వెళ్లాను. 105 మార్కులు తెచ్చుకున్నాను. ఇవాళ సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. నా ంతో సంతోషంగా ఉంది.
– చిలుముల అనూష, పొన్నాల
సత్ఫలితాలు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉంది
సిద్ధిపేట ప్రాంతంలోని నిరుద్యోగుల కోసమని మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. సత్ఫలితాలు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉంది. 13 మంది నిష్ణాతులైన అధ్యాపకులకు వేతనాలు, నిర్వహణ ఖర్చు, విద్యార్థులకు భోజన సదుపాయాల ఖర్చులన్నీ ప్రతి రోజు హరీశ్ రావు సారే చెల్లింపులు చేసేవారు.
– జగదీశ్వర్ రెడ్డి, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు