పి.వి. సునీత

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సారథ్యంలో తెలంగాణా నేడు స్వర్ణయుగం వైపు ప్రస్థానం సాగిస్తున్నది. నాలుగున్నర ఏండ్లలో ప్రపంచమే నివ్వెర పోయే ప్రగతిని సాధించింది. ఇది రైతు రాజ్యం అని మురిసిపోతున్నారు వ్యవసాయ దారులు. ఇది సంక్షేమ రాజ్యం అని సంబురపడుతున్నారు సమాన్య ప్రజలు. ఇది పెట్టుబడులకు స్వర్గధామమని ప్రశంసిస్తున్నారు పారిశ్రామిక వేత్తలు. ఇది కుల వృత్తుల జమానా అని జై కొడుతున్నాయి సబ్బండ వర్ణాలు. బహుజన సుఖాయ బహుజన అంటూ బంగారు తెలంగాణా బాటలో ముందుండి, నడిపిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

tsmagazine

కరెంటు కోతలు లేవు. ఎరువులు, మందుల కోసం పగలూ రాత్రి పడిగాపులు లేవు. విత్తనాల కోసం విల విలలు లేవు. పెట్టుబడి కోసం అప్పులు లేవు, తిప్పలు లేవు. రైతన్నల ముఖాల్లో సంతోషం విరబూస్తున్నది. పల్లె జనం పండుగ చేసుకుంటున్నరు. వ్యవసాయ సంక్షోబాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్‌ రైతు సమస్యలకు సంపూర్ణ పరిష్కారాలను చూపించారు. కేసీఆర్‌ ఫార్ములాను దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఆర్థిక వేత్తలు సమర్థిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రాణాధారం నీరు. నీటి సమస్య పరిష్కారమైతే వ్యవసాయం పండుగవుతుంది. పల్లెలు సుసంపన్నం అవుతాయి. ఇదీ కేసీఆర్‌ భాసవ. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా చెరువులు పునరుద్ధ రించుకుంటున్నాం. ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నం. పాలమూరు నుండి కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం చేసుకొని గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం చేసుకున్నాం. ప్రపంచం అబ్బురపడే రీతిలో బ్యారేజీలు నిర్మిస్తూ సొరంగాలు తవ్వుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ మవుతున్నాయి.

  •  మిషన్‌ కాకకతీయతో వేలాది చెరువులు పునరుద్ధరించిన ప్రభుత్వం వాటిని ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తున్నది. ఇక రైతన్నలు మొగులుకు మొకం పెట్టి దీనంగా వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. వానలు పడ్డా పడకపోయినా ప్రాజెక్టుల నుండి చెరువుల్లోకి నీళ్ళు పరుగులు పెడుతాయి. వ్యవసాయంతో పాటూ అన్ని రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. కరెంటూ నీళ్ళతో పాటూ రైతుకు కావలసింది శాస్త్రీయ పరిజ్ఞానం. భూసార పరీక్షలు మొదలుకొని సాగు పద్దతుల వరకూ అడుగడుగునా రైతుకు అండగా నిలవడానికి ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని ప్రభుత్వం నియమించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు భారీ సబ్సిడీలను అందిస్తున్నది.
  • ఇవన్నీ సమకూరిన తరువాత రైతుకు కావలసింది రొక్కం, పంటకు పెట్టుబడి. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే లక్ష రైపాయల వరకున్న ఋణాలను మాఫీ చేసి పేద రైతుల కన్నీరు తుడిచిండు. అసలు రుణాలు చేసే అవసరమే ఉండకూడదని ఆలోచించిండు. ఆ ఆలోచనలోంచి

ఉదయించిన పథకమే ‘రైతుబంధు’.

tsmagazine

    •  రైతన్నలకు రెండు పంటలకు ప్రతి ఎకరానికి 8000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రభుత్వమే అందిస్తున్నది. రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా మేధావులను ఆలోచింప చేసింది. ఇవ్వాళ్ళ పక్క రాష్ట్రాల రైతులు మేము తెలంగాణలో పుడితే బాగుండునని అనుకుంటున్నారు. రైతు మరణిస్తే అతని కుటుంబం సంక్షోభంలో పడకూడదని రైతు బీమాను ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు మన కేసీఆర్‌.
    • పండించిన పంట చేతికి రావాటంతో రైతుల సమస్యలు తీరిపోవు. ఎండకు, నీడకు, వానకు, వరపుకు, తట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకోచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే రైతు గతేమిటి. చేసిన శ్రమకు విలువేమిటి. ఈ సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్‌ సమగ్ర వ్యూహం రచించారు. ధాన్యం నిలువ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కొత్తగా గిడ్డంగులను ప్రభుత్వం నిర్మించింది. రైతు తన పంటకు ధరను తానె నిర్ణయించాలే అని కేసీఆర్‌ తలపోసిండు. దుక్కి దున్నిన దగ్గర నుండి ధాన్యం అమ్మేదాకా అన్ని దశలలో రైతే శాసించాలె అని నినదించిండు. వ్యవసాయ దారులను సుసంఘటిత వ్యవస్థగా తీర్చిదిద్దాలని రైతు సమన్వయ సమితులను స్థాపించిండు. బయట గిట్టుబాటు ధర లేకుంటే రైతు సమన్వయ సమితులే కొనుగోలు చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయించి అమ్మే విధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసే అధ్భుత వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తున్నది.
    • రైతుకు భద్రత కల్పిస్తే సమాజానికి ఆహార భద్రత లభిస్తుందనేది కేసీఆర్‌ ఆలోచన. ఇప్పటి వరకూ ప్రభుత్వాలన్నీ నగరాలనే పట్టించుకున్నయి. గ్రామాలను నిర్లక్ష్యం చేసినయి. పల్లెల అభివృద్ధే దేశం అభివృద్ధి అని నమ్మిన కేసీఆర్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్లే కాదు ప్రతీ కుల వృత్తి ఒక గొప్ప నైపుణ్యమే అని చాటి చెప్పిండు. కుల వృత్తుల వారందరూ మహోన్నత మానవ వనరులే అని, వాళ్లకు ప్రోత్సాహం అందిస్తే కోటానుకోట్ల రూపాయల సంపదను సృష్టిస్తారని, ఈ సమాజాన్ని సంపద్వంతం చేస్తారని ఆయన సిద్ధాంతం. గొల్ల కుర్మలకు 65 లక్షల గొర్రెలు పంచితే అవి అదనంగా మరో 30 లక్షల గొర్రె పిల్లలకు జన్మనిచ్చాయి. నేడు తెలంగాణా జీవ సంపదతో కళకళ లాడుతున్నది.
    • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో ప్రభుత్వమే చేప పిల్లలు వదిలి మత్స్యకారులకు జీవనోపాధిని కల్పిస్తున్నది. మత్స్యకారులకు ఆదాయం పెరగటంతో పాటూ ప్రజలకు అగ్వకు పౌష్టిక ఆహారం అభిస్తున్నది. భారీ సబ్సిడీ పై బర్రెల పంపిణీ చేస్తున్నది. దీని వల్ల అనేక మందికి ఉపాధి లభించటంతో పాటూ రాష్ట్రం పాడి పంటలతో తులతూగుతుంది. చేనేత కార్మికులకు చేతి నిండా పనికల్పిస్తున్నది. గౌడుల కోసం ఈత, తాటి వనాలు పెంచడంతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేసుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు, బట్టలు శుభ్రం చేసే ఆధునిక పరికరాల కొనుగోలుకు రజక సోదరులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నది. అత్యంత వెనుక బడిన కులాల కోసం రూ. 1000 కోట్లతో ఫెడరేషన్‌ ఏర్పాటు చేసింది.
    • ప్రతీ కులానికి సామూహిక వికాస వేదికగా, స్వాభిమాన ప్రతీకగా నిలిచే భవనాలను రాజధాని నగరంలో నిర్మిస్తున్నది.

tsmagazine

    • ఏ ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం తెల్లారంగనే బిందె పట్టుకొని తిరగ వలసిన దుస్థితి ఉండకూడదు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నదీజలాలు నల్లాల ద్వారా ఇస్తానని ప్రతిజ్ఞ చేసిన సాహసం కేసీఆర్‌ ది. తను సిద్ధిపేటలో విజయవంతం చేసిన పథకాన్ని రాష్ట్రమంతటా మిషన్‌ భగీరథ పేరుతో అమలులోకి తెచ్చిండు, లక్షా యాభై వేల కిలోమీటర్ల పొడవైన పైపులైన్‌ రాష్ట్ర మంతటా విస్తరించింది. ఈ పైపులైన్‌ పొడవు భూమి చుట్టు కొలతకన్నా మూడు రెట్లు ఎక్కువ. ఈ పైపులైన్‌తో పాటు ఆప్టికల్‌ ఫైబర్‌ని కూడా వేయడంతో ఇంటింటికి ఇంటర్నెట్‌ కూడా అందుబాటులోకి వస్తుంది.
    • పేద పిల్లలకు కడుపు నిండా బువ్వ పెట్టి కార్పోరేట్‌ స్థాయి విద్యనూ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ ఎత్తున గురుకులాలను ప్రారంభించారు. ప్రతీ విద్యార్థి పైన ఏటా లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణా గురుకులాల్లోని విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాటవాలను చాటుతున్నారు.
    • ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ ప్రభుత్వ బాధ్యత అని ప్రజా వైద్యం బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ అనేక చర్యలు చేపట్టారు. సర్కారు దవాఖానాల మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతున్నది. కార్పోరేట్‌ ఆసుపత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. తల్లీ బిడ్డల క్షేమం కోరి ఇస్తున్న కేసీఆర్‌ కిట్స్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తెలంగాణ ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు జరిపించి ప్రభుత్వం హెల్త్‌ ప్రొఫైల్‌ ఆఫ్‌ తెలంగాణాను తయారు చేస్తున్నది. మొదట ప్రజలందరికీ కంటి పరీక్షలు జరిపేందుకు ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించింది. కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేయటంతో పాటు శస్త్ర చికిత్సలు కూడా జరిపిసున్నది. ఆరోగ్య తెలంగాణా నిర్మాణమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నది.
    • ప్రతీ ఇంటికీ సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అనే ఆశయంతో అనేక సంక్షేమ పథకాలను తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్నది. వృద్దులకు చేయూత ని స్తూ, దివ్యాంగులకు ధీమా ఇస్తూ, వితంతువులకు, ఒంటరి మహిళలకు భద్రత ఇస్తూ, నేతన్నలకు, గీత న్నలకు భరోసా ఇస్తూ, ఎయిడ్య్‌ వ్యాధి గ్రస్తులకు ఊరట ఇస్తూ, బోదకాలు బాధితులకు అండగా నిలుస్తూ, బీడీ కార్మికులకు జీవన భృతి కలిస్తూ, మసీదుల్లో ప్రార్థన చేసే మౌజం ఆజాన్‌లకు హిమ్మత్‌ ఇస్తూ, అసహాయులందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్నది.
    • తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు, రంజాన్‌, క్రిస్టమస్‌ పండుగలను ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తున్నది. పేద ప్రజలకు కొత్త బట్టలు కానుక ఇస్తున్నది. పేద ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వమే పెద్దగా నిలుస్తున్నది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకంతో లక్షా నూట పదహారు రూపాయలు పెండ్లి ఖర్చుల కోసం ఇస్తున్నది.
    • పేద ప్రజల ఇల్లంటే ఒక్క అర్రల ఇరికి ఇరికి బతుకుడు కాదని, ఆత్మ గౌరవంతో అన్ని సౌకర్యాలతో జీవించా లని దేశంలో ఎక్కడా లేని విధంగ పేద ప్రజలకు రెండు బెడ్‌ రూముల ఇండ్లను ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్నది.

tsmagazine

  • 40వేల కోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.
  • నాలుగేళ్లలోనే తెలంగాణా పారిశ్రామిక రంగంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. టిఎస్‌ఐపాస్‌ చట్టం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉరకలు వేస్తున్నాయి. దిగ్గజ సంస్థలెన్నో తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. అంకుర సంస్థలకు టీ హబ్‌ అండగా నిలుస్తున్నది.
  • చారిత్రాత్మకమైన మన హైదరాబాద్‌ నగరం ఆధునిక హంగులతో విశ్వనగరంగా రూపుదాల్చుతున్నది. మన భాగ్యనగరాన్ని కాలుష్య రహితంగా మార్చటం కోసం మూసీ సుందరీకరణ జరుగుతున్నది. కాంక్రీట్‌ జంగిల్‌ కాకుండా మోస్ట్‌ లవబుల్‌ అండ్‌ లివేబుల్‌ సిటీగా ప్రభుత్వం హైదరాబాద్‌ను రూపొందిస్తున్నది.

tsmagazine
ఆదాయ పరిమితి పెంపు

దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్‌) ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు సంక్షేమ పథకాలను అందుకునేందుకు అర్హత సాధించారు.

tsmagazine
ఆసరా పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.5,043.92 కోట్లు ఖర్చుచేస్తూ ప్రతినెలా 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నది.

వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీతకార్మికులు, చేనేతకార్మికులు, బీడీకార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పింఛను రూ.200 నుంచి రూ.1000కి, వికలాంగులు, కళాకారుల
పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.1,500కు పెంచింది.
మరెక్కడా లేనివిధంగా వేలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా 1000 రూపాయల పింఛను అందజేస్తున్నది.

tsmagazine
6 కిలోల బియ్యం:
సమైక్య రాష్ట్రంలో ఒక్కోవ్యక్తికి 4 కిలోల చొప్పున కుటుంబానికి గరిష్ఠంగా 20 కిలోల రేషన్‌ బియ్యం మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒక్కోవ్యక్తికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయి కిలో బియ్యాన్ని అందజేస్తున్నది.

tsmagazine
విద్యార్థులకు సన్నబియ్యం:

అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ ంద్రాల్లోని 44.61 లక్షలమంది విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నారు.

అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం:

ప్రతీ అమరవీరుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. హైదరాబాద్‌లో అమరవీరుల స్మృతిచిహ్నం నిర్మాణంలో ఉన్నది. ఉద్యమకారులపై నమోదైన సుేలను ప్రభుత్వం ఎత్తేసింది.

స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం

పేద యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.50 వేల వరకు 100% సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం, రూ.2 లక్షలలోపు రుణానికి 70 శాతం, రూ.5 లక్షలలోపు రుణానికి 60 శాతం సబ్సిడీని ఇస్తున్నది.

జీతాల పెంపు

¬ంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐపీే, సెర్ప్‌, నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏవోలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సీఆర్టీలు, అర్చకులు తదితర ఉద్యోగు లందరి వేతనాలను, రేషన్‌ డీలర్ల కమిషన్‌ను ప్రభుత్వం పెంచింది.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం

ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు టాేయించి, ఆ నిధులను ఆ వర్గాల కోసమే ఖర్చుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో టాేయించిన నిధులు ఏదైనా కారణం వల్ల ఖర్చుకాకపోతే మరుసటి సంవత్సరానికి బదిలీచేసే విధంగా చట్టంలో నిబంధన పెట్టారు.

మూడెకరాల భూమి

రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.503.53 కోట్లు వెచ్చించి 5,065 ఎస్సీ కుటుంబాలకు 12, 975 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. దళితులకు భూమి పంపిణీ కార్యక్రమం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.1,469 కోట్లు టాేయించింది.

వృత్తినైపుణ్య శిక్షణ

వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ యువకులకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వివిధ వృత్తుల్లో స్థిరపడేట్లు చేసింది.

ప్రకృతి వైపరీత్యాల్లో మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సహాయం

వడగండ్లు, భారీవర్షాలు, వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, పిడుగుపాటుతో మరణించినవారి కుటుంబాలకు రూ.6 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది.

tsmagazine
గ్రామపంచాయతీలుగా గిరిజన తండాలు

గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామపంచాయితీలుగా మార్చాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరింది. వంద శాతం ఎస్టీ జనాభాగల గ్రామపంచాయతీలు కొత్తగా 1,326 ఏర్పడ్డాయి. షెడ్యూల్‌ ఏరియాలో గ్రామపంచాయతీలు 1,311 ఉన్నాయి. తెలంగాణలో మొత్తం వంద శాతంఎస్టీ జనాభా గల 2,637 గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇతర గ్రామాల్లో ూడా ఎస్టీలకు తమ జనాభా ప్రకారం రిజర్వేషన్‌ లభిస్తుంది. దీంతో రాష్ట్రం మొత్తంమీద 3,402 మంది ఎస్టీలు సర్పంచులయ్యే అవకాశం ఏర్పడింది.

ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకాలు

అన్ని ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను ప్రభుత్వం రిజర్వ్‌చేసింది. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 5 కోట్లతో ఎకరం స్థలంలో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రావ్‌ు ఫర్‌ రాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ ఎస్సీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు, ఇప్పటి నెలకొల్పిన పరిశ్రమలను విస్తరించాలనుకునేవారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది. వారి పరిశ్రమలకు ఉపయోగించే విద్యుత్‌ చార్జీల్లో ఒక్కో యూనిట్‌కు రూపాయిన్నర సబ్సిడీ ఇస్తున్నది. చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు రుణాలను తీసుకున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామకవేత్తలు వేలం పావలా వడ్డీ చెల్లించే వెసులుబాటు కల్పించింది. పరిశ్రమల స్థాపనకు అయ్యే వ్యయంలో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ అందజేస్తున్నది.

కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వడంతో పాటు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌ కల్పించింది.

ఉచిత విద్యుత్తు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు తమ ఇండ్లకు ఉపయో గించే విద్యుత్తును 101 యూనిట్లవరకు ఉచితంగా అందజేస్తున్నారు. గృహ వినియోగ క్యాటగిరీలో రూ.70 కోట్లకుపైగా ఉన్న ఎస్టీల విద్యుత్‌ బకాయిలను ప్రభుత్వం రద్దుచేసింది. గిరిజనులపై గతంలో నమోదు చేసిన విద్యుత్‌ విజిలెన్స్‌ సుేలన్నింటినీ ఎత్తివేసింది.

tsmagazine

tsmagazine

ఎంబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, ఏటా వెయ్యి కోట్ల రూపాయలు టాేయిస్తున్నది.

గొర్రెల పంపిణీ

రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై రూ.4వేల కోట్లతో 84 లక్షల గొర్రెలు పంపిణీచేస్తున్నది. ఉచితంగా దాణా, మందులు ఇస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నది.

ఉచితంగా చేపపిల్లల పంపిణీ

మత్స్యకారుల కోసం చెరువులు, ఇతర జలాశయాల్లో పెంచేందుకు ఉచితంగా చేపపిల్లల సరఫరా చేస్తున్నది.

గీత కార్మికుల సంక్షేమం

తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసింది. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ధరించింది.

చేనేత కార్మికుల సంక్షేమం

బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంచే చీరలను, హాస్పిటళ్లలో చద్దర్లు, విద్యార్థులు, పోలీసులకు యూనిఫారాల వసా్తలకోసం నేత, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్నది. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్‌టైల్‌ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నది. చేనేత కార్మికుల రుణాలను మాఫీచేసింది.

రజకులకు చేయూత

ప్రభుత్వం ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఆధునిక యంత్రాలతో లాండ్రీల ఏర్పాటు, వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలు, హాస్టళ్లలో దుస్తులు ఉతి బాధ్యత రజకుల అప్పగించాలని నిర్ణయించింది.

నవీన క్షౌరశాలల ఏర్పాటు

నాయీబ్రాహ్మణులు క్షౌరశాలలు పెట్టుకునేందుకు వందశాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది.200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుకునే సెలూన్లకు గృహ క్యాటగిరీ చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నది.

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం

పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్‌ కరంటును రూ.2 చొప్పున సబ్సిడీపై అందిస్తున్నది. అంగన్‌వాడీ సెంటర్లకు మధ్యాహ్న భోజన పథకానికి సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల కోసం గుడ్ల కొనుగోలు ద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు లాభం కలిగిస్తున్నది.

బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం

వివిధ వృత్తులను ఆధునీకరించుకొనే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చేసుకునే వారికి ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థికసాయం అందిస్తున్నది.

చేనేత కార్మికుల సంక్షేమం
బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంచే చీరలను, హాస్పిటళ్లలో చద్దర్లు, విద్యార్థులు, పోలీసులకు యూనిఫారాల వసా్తలకోసం నేత, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్నది. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్‌టైల్‌ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నది. చేనేత కార్మికుల రుణాలను మాఫీచేసింది.

మిషన్‌ కాకతీయ

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. 46,500 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి ప్రధానమైన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి.

మిషన్‌ భగీరథ

ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం చేపట్టింది. రూరల్‌ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు, 52.47 లక్షల నివాసాలకు, 65 అర్బన్‌ ఏరియాల్లోని 12.83 లక్షల నివాసాలకు నీరు అందనుంది. ఔటర్‌ రింగ్‌రోడ్‌ పరిధిలోని 7 అర్బన్‌ లోకల్‌ బాడీలు, రూరల్‌ ప్రాంతాల్లోని 183 ఆవాస గ్రామాలకు ఈ పథకం ద్వారా నీళ్లు అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజు సురక్షిత తాగునీరు అందించనున్నారు.

దివ్యాంగుల సంక్షేమం

దివ్యాంగులకు పూర్తి సబ్సిడీతో మోటరు సైకిళ్లను పంపిణీచేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థుల మెస్‌ చార్జీలను రూ.850 నుంచి రూ.1500 లకు పెంచింది. దివ్యాంగులకు 80శాతం సబ్సిడీతో రూ.లక్ష రుణసౌకర్యం కల్పించింది. రూ.10 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీ అందిస్తున్నది. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా దివ్యాంగులకు ూడా అన్ని రాయితీలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దివ్యాంగులను పెళ్లిచేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. వికలాంగులకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తున్నది.

రహదారుల నిర్మాణం

57 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, వేలం నాలుగేండ్లలోనే అంతకన్నా ఎక్కువగా 3,155 కిలోమీటర్ల నిడివిగల 36 జాతీయ రహదారులను ప్రభుత్వం మంజూరు చేయించుకోగలిగింది. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ ఏర్పడింది. 16వేల కోట్ల ఖర్చుతో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ రోడ్లను, వంతెనలను అభివృద్ధి చేసింది. వేల సంఖ్యలో ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చింది. సింగిల్‌లేన్‌ రోడ్లను డబుల్‌లేన్‌ రోడ్లుగా మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,146 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టింది.

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

నిరుపేదల ఆత్మగౌరవం కాపాడేలా 560 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 2,72,000 ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది.

హరితహారం
తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడంకోసం తెలంగాణకు హరితహారం చేపట్టింది. ఇప్పటి వర ా్లలో సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు

నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన 40 లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేసే విధంగా పనులు జరుగుతున్నాయి.

కోతల్లేని విద్యుత్‌

రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిననాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే, నేడు 16వేల మెగావాట్లకు చేరింది. 28 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించి, తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చడం కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది.

హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగురోడ్డు

ఇప్పుడున్న ఔటర్‌ రింగురోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్‌ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి-గజ్వేల్‌-చౌటుప్పల్‌-మాల్‌-కడ్తాల్‌-షాద్‌ నగర్‌- చేవెళ్ల-కంది పట్టణాలను కలుపుతూ వలయాకారంలో ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్‌ప్రెస్‌ హైవేగా రీజనల్‌ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విశ్వనగరంగా హైదరాబాద్‌

రూ.35 వేల కోట్లతో హైదరాబాద్‌లో ప్రభుత్వం వివిధ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. ట్రాఫిక్‌ సమస్య నివారణకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.25 వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉపరితల రహదారులు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. రహదారులు అభివృద్ధి పరచడానికి 2,716 కోట్లతో పనులు జరుగుతున్నాయి. తాగునీటి అవసరాలు తీర్చేవిధంగా 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వచ్చే ఐదేండ్లలో 50 వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ నగరంలో మౌలికవసతులను మెరుగుపరిచే ప్రణాళిక అమలవుతుంది.

కొత్త రెసిడెన్షియల్‌ పాఠశాలలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి వేలం 298 (261+37 జనరల్‌) రెసిడెన్షియల్‌ స్కూళ్లు మాత్రమే ఉండేవి. వేలం మూడేండ్లలో కొత్తగా 663 (610 + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరుచేసింది. ఎస్సీలకు 134, ఎస్టీలకు 64, బీసీలకు 261, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరయ్యాయి.

విద్యార్థుల విదేశీవిద్యకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్స్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీవిద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం అమలుచేస్తున్నది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిల్స్‌

పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం కోసం జిల్లా స్థాయిలోఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటుచేసింది.

కొత్త జోనల్‌ వ్యవస్థ

స్థానికుల 95 శాతం ఉద్యోగాలు ద్కలా తెలంగాణలో నూతన జోనల్‌, మల్టీజోనల్‌ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కొత్త జోనల్‌ విధానం ప్రకారమే పెద్దఎత్తున నియామకాలు జరుగనున్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు గుర్తించిన ఉద్యోగఖాళీలు 32,733. భర్తీచేసినవి 11,333. ఫలితాలు రావాల్సివున్నది 21,094. పరీక్షలకు సిద్ధంగా వున్నవి 306. నోటిఫిషేన్లకు సిద్ధంగా వున్నవి 8,206. విద్యుత్‌ శాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 25,004. రిూట్‌మెంట్‌ ద్వారా 2,681, రెగ్యులరైజేషన్‌ ద్వారా 22,323, కొత్త నియామకాలు జరుగాల్సినవి 3,600. పోలీసుశాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 10,980. కొత్త నియామకాలు జరుగాల్సినవి 25,000. సింగరేణిలో మొత్తం నియామకాలు 9,884. నేరుగా జరిగిన నియామకాలు 5,500. డిపెండెంట్‌ ఉద్యోగాలు 4,384. ఆర్టీసీలో 4,020 మంది రెగ్యులరైజేషన్‌, డిపెండెంట్‌ ఉద్యోగాలు 1,137. యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలలో మొత్తం 20,614. ఇప్పటివరకు జరిగిన నియామకాలు 9,614. కొత్తగా చేపట్టే నియామకాలు 11,000.

తప్పనిసరిగా తెలుగు:

అన్ని విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఆలయాల అభివృద్ధి

యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర, ధర్మపురి, జోగుళాంబ, కొమురవెల్లిమల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అధికారికంగా తెలంగాణ పండుగలు:

బతుకమ్మ, బోనాలు, రంజాన్‌, క్రిస్మస్‌ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక¬దా కల్పించింది.

ఉద్యోగుల సంక్షేమం

ఉద్యోగులందరికీ తెలంగాణ సాధన ప్రత్యేక ఇంక్రిమెంట్‌ మంజూరుచేసింది. సకల జనుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా నిర్ణయించింది. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగులకు గ్రాట్యుటీని చెల్లిస్తున్నది. హెల్త్‌కార్డులు అందించింది.

సింగరేణి కార్మికుల సంక్షేమం

సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా చెల్లిస్తున్నది. ఇండ్లు కట్టుకోవడానికి రూ. పదిలక్షల వడ్డీలేని రుణం అందిస్తున్నది. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదలచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారుణ్య నియామకాలు చేపట్టడానికి రంగం సిద్ధంచేసింది.

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద మహిళలందరికీ ప్రభుత్వం చీరెలు పంపిణీచేస్తున్నది.

తెలంగాణ ప్రముఖులకు జయంతి, వర్ధంతి

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన తెలంగాణ ప్రముఖుల జయంతులను, వర్ధంతులను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వారి పేరుమీద విద్యాలయాలు, ప్రభుత్వసంస్థలను నెలకొల్పింది. కుమ్రంభీం, జయశంకర్‌ పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది.

మెరుగైన వైద్యసేవలు

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కొక్క బెడ్‌ నిర్వహణకు ప్రతీ నెల సగటున రూ.5,016 ఖర్చు చేస్తున్నది. రూ.600 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల కోసం కొత్త వైద్య సామాగ్రి కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలిసిస్‌ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 25 ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు, 12 చోట్ల క్యాన్సర్‌ పరీక్షా ంద్రాలు ఏర్పాటుచేసింది.

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు

హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లలో ప్రభుత్వం బస్తీ దవాఖానాల(అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌)ను ప్రారంభించింది. పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తొలివిడతగా 50 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి.

టీఎస్‌ ఐపాస్‌

సింగిల్‌విండో విధానం: పరిశ్రమలకు వేలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చేందుకు తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ ఎండ్‌ సెల్ఫ్‌ సర్టిఫిషేన్‌ సిస్టవ్‌ు (టీఎస్‌ఐపాస్‌) చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 15 ఆగస్టు, 2018 నాటికి రూ.1,32,000 కోట్ల పెట్టుబడులు రాషా్టనికి తరలివచ్చాయి. ఆన్‌లైన్‌ విధానం ద్వారా 7,697 పరిశ్రమలకు అనుమతులు మంజూరుచేశారు. వీటిలో 2.50 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)

ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. మే 2018 నాటికి 1500 ఐటీ/ఐటీఈఎస్‌ కంపెనీల్లో 4.75 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, ఏడు లక్షలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ ఇంక్యుబేటర్‌ సెంటర్‌ టీ-హబ్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. ద్వితీయశ్రేణి నగరాలైన కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్లో ఐటీ ఇంక్యుబేషన్‌ ంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.

శాంతిభద్రతలు

పోలీసుశాఖను బలోపేతం చేయడంవల్ల సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది. రాష్ట్రం అంతటా లక్షలాది సీసీ మెెరాలనుపెట్టి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం అవుతుంది. షీ టీవ్స్‌ు కృషిఫలితంగా మహిళలకు భద్రత ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం కాలుష్య అలవెన్స్‌ ఇస్తున్నది.

మెరుగైన వైద్యసేవలు

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కొక్క బెడ్‌ నిర్వహణకు ప్రతీ నెల సగటున రూ.5,016 ఖర్చు చేస్తున్నది. రూ.600 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల కోసం కొత్త వైద్య సామాగ్రి కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలిసిస్‌ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 25 ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు, 12 చోట్ల క్యాన్సర్‌ పరీక్షా ంద్రాలు ఏర్పాటుచేసింది.

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు

హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లలో ప్రభుత్వం బస్తీ దవాఖానాల(అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌)ను ప్రారంభించింది. పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తొలివిడతగా 50 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి.

కంటి వెలుగు

అందరికీ కంటిపరీక్షలు నిర్వహించడానికి ప్రభు త్వం కంటివెలుగు పథకం అమలుచేస్తున్నది. ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేయడంతోపాటు ఆపరేషన్లు ూడా ఉచితంగానే జరిపిస్తున్నది.

పరమపదవాహనాలు

ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించినవారి మృతదేహాలను ఉచితంగా ఇంటికి పంపడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ఏర్పాటుచేసింది.

పరిపాలన సంస్కరణలు

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలను విజయవంతంగా అమలుచేసింది. చరిత్రలో ఇంతతక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. పరిపాలనా సౌలభ్యంకోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచడంకోసం, 10 జిల్లాలను 31 జిల్లాలు చేసింది. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసింది. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయితీలుంటే, కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటుచేసింది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రజలు ఇటీవలే కొత్త గ్రామ పంచాయితీల, కొత్త మున్సిపాలిటీల ప్రారంభోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ప్రభుత్వం పోలీస్‌ శాఖలోనూ కూడా భారీగా పాలనా సంస్కరణలు తెచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి వేలం రెండే రెండు పోలీస్‌ కమిషనరేట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 9కి పెంచుకున్నాం. పోలీస్‌ సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు పెంచుకున్నాం. సర్కిల్‌ కార్యాలయాలను 688 నుంచి 717కు పెంచుకున్నాం. పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు పెంచుకున్నాం.

Other Updates